అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వసలదారులను ఏరివేసేందుకు హోంల్యాండ్ సెక్యురిటీ అధికారులు ఏర్పాటు చేసిన ఫేక్ యూనివర్శిటీ వలలో భారతీయులు చిక్కుకున్న సంగతి తెలిసిందే. మొత్తం 8మంది విద్యార్థులకు ఈ ఏడాది జనవరిలో 12నెలల నుంచి 24 నెలల వరకు అక్కడి న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. కాగా... ఆ 8మంది ఇండియన్స్ స్టూడెంట్స్ లో ఆరుగురు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందినవారు కావడం గమనార్హం.

AlsoRead ఫార్మింగ్టన్ యూనివర్సిటీ కేసులో... 8 మంది భారతీయులకు ఐదేళ్ల జైలు.?...

అమెరికాలో విద్య, ఉపాధి అవకాశాల కోసం వెళ్లి అక్కడ అక్రమంగా నివసిస్తున్న వానిని గుర్తించడానికి ప్రభుత్వం నకిలీ యూనివర్శిటీని ఏర్పాటు చేసింది. 2015లో ఏర్పాటైన  యూనివర్శిటీ ఆఫ్ ఫార్మింగ్టన్‌లో హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు మారువేషాల్లో ఉద్యోగులుగా చేరారు.

ఈ క్రమంలో విద్యార్థులకు నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి వారిని ఇక్కడ నివసించేందుకు ఏర్పాట్లు చేస్తోన్న పలువురిపై నిఘా పెట్టారు. ఈ ఆపరేషన్‌లో 600 మంది విదేశీ విద్యార్థులకు నకిలీ పత్రాలు లభించేందుకు సహకరించినవారిని కూడా గుర్తించారు.

Alsoread ఫేక్ యూనివర్సిటీ కలకలం: తెలుగువారి కోసం రంగంలోకి తానా...

కాగా.. జైలు శిక్ష పడిన తెలుగు విద్యార్థుల వివరాలు ఇలా ఉన్నాయి.  సంతోష్ సామా( ఫ్రీమాంట్)కి  రెండు సంవత్సరాల జైలు శిక్ష, భరత్ కాకిరెడ్డి(29) (లేక్ మేరీ), సురేస్ కందాలా(31)లకు 18నెలల జైలు శిక్ష విధించారు.

అవినాష్ తక్కెళ్లపల్లి కి 15నెలల జైలు శిక్ష, అశ్వంత్ నూనె కి సంవత్సరం, నవీన్ ప్రత్తిపాటికి సంవత్సరం పాటు జైలు శిక్ష విధించారు. మరో ఇద్దరు ప్రేమ్ రాంపేసా, ఫణిదీప్ కర్నాటిలకు త్వరలో శిక్ష ఖరారు చేసే అవకాశం ఉంది.