టర్కీ మీదుగా.. అమెరికా వెళ్తూ.. ఆరుగురు భారతీయులు అదృశ్యం...
గుజరాత్ లోని Kalol తాలూకాకు చెందిన తేజస్ పటేల్ కొద్ది రోజుల క్రితం తన భార్య అల్కా పటేల్, కొడుకు దివ్య పటేల్ తో కలిసి అమెరికాకు బయలుదేరాడు. సరిగ్గా ఇదే సమయంలో సురేష్ పటేల్ తన భార్య శోభ, కూతురు ఫోరమ్ తో కలిసి US వెళ్లేందుకు ఇంటి నుంచి బయల్దేరాడు. టర్కీ మీదుగా అమెరికా వెళ్లే క్రమంలో ఈ రెండు కుటుంబాలు Istanbul చేరుకున్నాయి. తాజాగా వీరితో వాళ్ల కుటుంబ సభ్యులకు కమ్యూనికేషన్ కట్ అయింది.
Turkey మీదుగా America వెళ్లే క్రమంలో ఆరుగురు Indians అదృశ్యమైన ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇస్తాంబుల్ లోని Indian Embassy ఇప్పటికే ఈ విషయంపై దృష్టి సారించగా ఇక్కడి పోలీసులు కూడా దర్యాప్తు ప్రారంభించారు. కాగా... ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
గుజరాత్ లోని Kalol తాలూకాకు చెందిన తేజస్ పటేల్ కొద్ది రోజుల క్రితం తన భార్య అల్కా పటేల్, కొడుకు దివ్య పటేల్ తో కలిసి అమెరికాకు బయలుదేరాడు. సరిగ్గా ఇదే సమయంలో సురేష్ పటేల్ తన భార్య శోభ, కూతురు ఫోరమ్ తో కలిసి US వెళ్లేందుకు ఇంటి నుంచి బయల్దేరాడు. టర్కీ మీదుగా అమెరికా వెళ్లే క్రమంలో ఈ రెండు కుటుంబాలు Istanbul చేరుకున్నాయి. తాజాగా వీరితో వాళ్ల కుటుంబ సభ్యులకు కమ్యూనికేషన్ కట్ అయింది.
దీంతో కంగారుపడ్డ కుటుంబ సభ్యులు ఇస్తాంబుల్లోని ఇండియన్ ఎంబసీని సంప్రదించారు. దీంతో ఎంబసీ అధికారులు అక్కడి అధికారులను అలర్ట్ చేశారు. కాగా, ఈ విషయంపై సమాచారం అందుకున్న గాంధీనగర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అమెరికా వెళ్లే క్రమంలో ఈ రెండు కుటుంబాలు ఇస్తాంబుల్ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? చట్టవిరుద్ధంగా అమెరికా వెళ్లేందుకు ఇస్తాంబుల్ కు చేరుకున్నారా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
అంతేకాకుండా విదేశీయులను అక్రమంగా అమెరికాకు తరలించే ముఠానే వీళ్లను కిడ్నాప్ చేసి ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా, పోలీసులు ఇలా అనుమానం వ్యక్తం చేయడానికి బలమైన కారణమే ఉంది. తాజాగా గుజరాత్ కు చెందిన కుటుంబం రక్తం గడ్డకట్టే చలిలో కెనడా నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించి ప్రాణాలు వదిలారు. ఈ నేపథ్యంలోనే తేజస్ పటేల్, సురేష్ పటేల్ లు కూడా తమ కుటుంబ సభ్యులతో కలిసి అమెరికాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించి ఉంటారని స్థానిక పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే తేజస్ పటేల్, సురేష్ పటేల్ ఏ గ్రామానికి చెందిన వారు అనే విషయాన్ని మాత్రం పోలీసులు బయటపెట్టడం లేదు.
కాగా, జనవరి 22 americaలో అక్రమంగా ప్రవేశించే క్రమంలో.. చిన్నారి, టీనేజర్ సహా నలుగురి దుర్మరణం విషాదాన్ని రేపుతోంది సరిహద్దుకు 40 అడుగుల దూరంలో deadbodyలు పడి ఉండడం బాధాకరంగా మారింది. letters లేకుండా మానవ అక్రమ రవాణా చేస్తూ ఓ పెద్ద ముఠానే పట్టుబడడం షాక్ కు గురి చేస్తోంది. రక్తం గడ్డ కట్టుకుపోయే అంతటి cold. మైనస్ 36 డిగ్రీల ఉష్ణోగ్రత, కనుచూపుమేరలో అంతా మంచు మేటలే. దీనికితోడు తీవ్రమైన మంచు తుఫాను. ఆపై చిమ్మచీకటి. ఇంతటి భయానక వాతావరణంలో కెనడా నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ఓ నలుగురు సభ్యుల భారతీయ కుటుంబం ప్రయత్నించింది.
వారిలో ఓ చంటి బిడ్డ, టీనేజర్ కూడా ఉన్నారు. ఎంతగా ప్రయత్నించినా అడుగు ముందుకు పడక.. మంచు తుఫానులో చిక్కుకుని పోయి.. అత్యంత దయనీయ స్థితిలో దుర్మరణం పాలయ్యారు. US-Canada border లో బుధవారం ఈ ఘటన జరిగింది. కెనడాలోని మానిటోబా ప్రావిన్స్ ఎమర్సన్ బోర్డర్ వద్ద అర్ధరాత్రి వేళ అమెరికాలోకి ప్రవేశించే ప్రయత్నంలో… తీవ్ర ప్రతికూల వాతావరణాన్ని తట్టుకోలేక ఆ నలుగురు మరణించారు. వీరిలో ఇద్దరిని భార్యాభర్తలుగా.. ఓ చిన్నారి, టీనేజర్ ను వారి పిల్లలు గా భావిస్తున్నారు. వారంతా అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నిస్తూ.. తీవ్రమైన మంచు తుఫానులో చిక్కుకుని మరణించి ఉంటారని అధికారులు ప్రాథమికంగా తేల్చారు.
మృతదేహాలు బోర్డర్ కు40 అడుగుల దూరంలో మంచులో కూరుకుపోయి ఉన్న స్థితిలో దొరికాయి. అంతకుముందు అమెరికా వైపున బార్డర్ లో ఇద్దరు భారతీయులతో వస్తున్న స్టీవ్ శాండ్ (47) అనే వ్యక్తిని యూఎస్ భద్రతాదళాలు అదుపులోకి తీసుకున్నాయి. ఆ వ్యాన్ లో భారీ మొత్తంలో స్నాక్స్, డిస్పోజబుల్ ప్లేట్లు కప్పులను గుర్తించిన అమెరికా దళాలు.. మరింత మంది బోర్డర్ దాటబోతున్నారని అనుమానించి కెనడా బోర్డర్ సెక్యూరిటీ సిబ్బందిని అప్రమత్తం చేశారు.
వెంటనే రంగంలోకి దిగి.. గాలింపు చేపట్టిన కెనడా సిబ్బందికి మంచులో కూరుకుపోయిన మృతదేహాలు లభించాయి. గాలింపు చర్యల్లో 15 మంది భారతీయులను గుర్తించి, ప్రశ్నించగా.. మరణించిన నలుగురు వీళ్ళ సమూహం నుంచి విడిపోయిన వాళ్లేనని తేలింది. ఎలాంటి పత్రాలూ లేకుండా అక్రమంగా అమెరికాలో తీసుకెళతానంటూ ఓ వ్యక్తి తమతో ఒప్పందం కుదుర్చుకున్నాడని, బోర్డర్ దాటేందుకు ఈ మార్గాన్ని సూచించి.. దాటాక తమను పికప్ చేసుకుంటానని చెప్పాడని వాళ్లు కెనడా బోర్డర్ సెక్యూరిటీ సిబ్బందికి తెలిపారు. ఈ కేసులో స్టీవ్ శాండ్ ప్రమేయాన్ని ప్రాథమికంగా గుర్తించిన అమెరికా దళాలు మానవ అక్రమ రవాణా కింద అతడిపై కేసు నమోదు చేశాయి.