Asianet News TeluguAsianet News Telugu

ఫ్రెండ్ తెమ్మన్నాడని ట్యాబ్లెట్ తెచ్చినందుకు.. ఐదేళ్ల జైలు శిక్ష

 రియాద్‌లో పనిచేస్తున్న హైదరాబాద్‌కు చెందిన మోయిజ్‌.. తన స్నేహితుడి కుటుంబ సభ్యులు ఒక పార్శిల్‌ ఇస్తారని, దానిని తీసుకువారాలని కోరాడు.

5 years prison punishment for possession of illegal Drugs in Saudi
Author
Hyderabad, First Published Sep 16, 2020, 10:37 AM IST

స్నేహితుడు అడిగాడు కదా అని.. ట్యాబ్లెట్స్ తీసుకువెళ్లడమే అతను  చేసిన పాపం అయ్యింది.  స్వగ్రామాం నుంచి విదేశానికి స్నేహితుడి కోసం ట్యాబ్లెట్స్ తెచ్చినందుకు కొరడా దెబ్బలు తినాల్సి వచ్చింది. అంతేకాకుండా దాదాపు ఐదున్నరేళ్లు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. చివరకు క్షమా భిక్షతో ఇటీవల స్వదేశానికి చేరాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌ లంగర్‌హౌజ్‌కు చెందిన అబ్దుల్‌ వహీద్‌ (37) రియాద్‌ లోని ఒక బ్యాంకులో పని చేస్తుండేవాడు. ఆయనకు కూతురు పుట్టడంతో 2015లో హైదరాబాద్‌ వెళ్లాడు. తిరిగి విదేశాలకు వెళ్లే సమయంలో.., రియాద్‌లో పనిచేస్తున్న హైదరాబాద్‌కు చెందిన మోయిజ్‌.. తన స్నేహితుడి కుటుంబ సభ్యులు ఒక పార్శిల్‌ ఇస్తారని, దానిని తీసుకువారాలని కోరాడు.

తీరా విమానం దిగిన వెంటనే కస్టమ్స్‌ అధికారులు వహీద్‌ను తనిఖీ చేయగా.. ఆ పార్శిల్‌లో ట్యాబ్లెట్స్ డబ్బా ఉంది. వాటి విక్రయంపై సౌదీలో నిషేధం ఉండటంతో.. పోలీసులు అరెస్టు చేశారు. దీంతో మోయిజ్‌ మిత్రుడు షేక్‌ బదర్‌ కోరడంతో ఆ పార్శిల్‌ తెచ్చానని చెప్పాడు. పోలీసులు బదర్‌ను కూడా అరెస్టు చేశారు. తన భార్య హజ్రాకు అనారోగ్యం, నిద్రలేమి సమస్య ఉందని, సౌదీలో మందుల ఖరీదు ఎక్కువగా ఉండటంతో.. హైదరాబాద్‌ నుంచి తెప్పించానని బదర్‌ వెల్లడించాడు. కానీ, బదర్‌ భార్య గతంలో ఈ మందులను వాడలేదని పోలీసుల విచారణలో తేలింది.

కేసును విచారించిన న్యాయస్థానం నలుగురినీ దోషులుగా తేల్చి శిక్ష విధించింది.   వహీద్‌కు 8 సంవత్సరాల జైలు శిక్ష, 800 కొరడా దెబ్బలు, లక్ష రియాళ్ల (రూ.20 లక్షలు) జరిమానా, మందు బిళ్లలను తెప్పించిన బదర్‌, హజ్రాకు 5 సంవత్సరాల జైలు శిక్ష, 500 కొరడా దెబ్బలు, లక్ష రియాళ్ల జరిమానా, మోయిజ్‌కు రెండున్నరేళ్ల జైలు, 300 కొరడా దెబ్బలు విధించాలని కోర్టు తీర్పిచ్చింది. ఇటీవల సౌదీ అరేబియా రాజు సల్మాన్‌ మానవతా దృక్పథంతో  క్షమాభిక్ష ప్రకటించగా.. అబ్దుల్‌ వహీద్‌ శిక్ష గడువుకు ముందే విడుదల అయి స్వదేశానికి చేరుకున్నాడు.

Follow Us:
Download App:
  • android
  • ios