Asianet News TeluguAsianet News Telugu

మంచులో కూరుకుపోయి చిన్నారితో సహా, భారతీయ కుటుంబం మృతి.. అమెరికా-కెనడా సరిహద్దులో విషాదం..

 కెనడాలోని  మానిటోబా  ప్రావిన్స్ ఎమర్సన్ బోర్డర్  వద్ద అర్ధరాత్రి వేళ అమెరికాలోకి  ప్రవేశించే ప్రయత్నంలో… తీవ్ర ప్రతికూల వాతావరణాన్ని తట్టుకోలేక ఆ నలుగురు మరణించారు.  వీరిలో ఇద్దరిని భార్యాభర్తలుగా..  ఓ చిన్నారి,  టీనేజర్ ను వారి పిల్లలు గా భావిస్తున్నారు.

 

4 of Indian family, including infant, freeze to death on US-Canada border
Author
Hyderabad, First Published Jan 22, 2022, 8:11 AM IST

న్యూయార్క్ :  americaలో అక్రమంగా ప్రవేశించే క్రమంలో.. చిన్నారి, టీనేజర్ సహా నలుగురి దుర్మరణం విషాదాన్ని రేపుతోంది సరిహద్దుకు 40 అడుగుల దూరంలో deadbodyలు పడి ఉండడం బాధాకరంగా మారింది. letters లేకుండా మానవ అక్రమ రవాణా చేస్తూ ఓ పెద్ద ముఠానే పట్టుబడడం షాక్కు గురి చేస్తోంది. 

రక్తం గడ్డ కట్టుకుపోయే అంతటి cold.  మైనస్ 36 డిగ్రీల ఉష్ణోగ్రత,  కనుచూపుమేరలో అంతా మంచు మేటలే. దీనికితోడు తీవ్రమైన మంచు తుఫాను. ఆపై చిమ్మచీకటి. ఇంతటి భయానక వాతావరణంలో కెనడా నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ఓ నలుగురు సభ్యుల భారతీయ కుటుంబం ప్రయత్నించింది. వారిలో ఓ చంటి బిడ్డ, టీనేజర్ కూడా ఉన్నారు. ఎంతగా ప్రయత్నించినా అడుగు ముందుకు పడక.. మంచు తుఫానులో చిక్కుకుని పోయి.. అత్యంత దయనీయ స్థితిలో దుర్మరణం పాలయ్యారు.

US-Canada border లో బుధవారం ఈ ఘటన జరిగింది. కెనడాలోని  మానిటోబా  ప్రావిన్స్ ఎమర్సన్ బోర్డర్  వద్ద అర్ధరాత్రి వేళ అమెరికాలోకి  ప్రవేశించే ప్రయత్నంలో… తీవ్ర ప్రతికూల వాతావరణాన్ని తట్టుకోలేక ఆ నలుగురు మరణించారు.  వీరిలో ఇద్దరిని భార్యాభర్తలుగా..  ఓ చిన్నారి,  టీనేజర్ ను వారి పిల్లలు గా భావిస్తున్నారు. వారంతా అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నిస్తూ.. తీవ్రమైన మంచు తుఫానులో చిక్కుకుని మరణించి ఉంటారని అధికారులు ప్రాథమికంగా తేల్చారు. 

మృతదేహాలు బోర్డర్ కు40 అడుగుల దూరంలో మంచులో  కూరుకుపోయి ఉన్న స్థితిలో దొరికాయి. అంతకుముందు అమెరికా వైపున బార్డర్ లో ఇద్దరు భారతీయులతో వస్తున్న స్టీవ్ శాండ్ (47) అనే వ్యక్తిని యూఎస్ భద్రతాదళాలు అదుపులోకి తీసుకున్నాయి. ఆ వ్యాన్ లో భారీ మొత్తంలో స్నాక్స్, డిస్పోజబుల్ ప్లేట్లు కప్పులను గుర్తించిన అమెరికా దళాలు..  మరింత మంది బోర్డర్ దాటబోతున్నారని అనుమానించి కెనడా బోర్డర్ సెక్యూరిటీ సిబ్బందిని అప్రమత్తం చేశారు.

వెంటనే రంగంలోకి దిగి.. గాలింపు చేపట్టిన కెనడా సిబ్బందికి మంచులో కూరుకుపోయిన మృతదేహాలు లభించాయి. గాలింపు చర్యల్లో 15 మంది భారతీయులను గుర్తించి, ప్రశ్నించగా.. మరణించిన నలుగురు వీళ్ళ సమూహం నుంచి విడిపోయిన వాళ్లేనని తేలింది. ఎలాంటి పత్రాలూ లేకుండా అక్రమంగా అమెరికాలో తీసుకెళతానంటూ ఓ వ్యక్తి తమతో ఒప్పందం కుదుర్చుకున్నాడని, బోర్డర్ దాటేందుకు ఈ మార్గాన్ని సూచించి.. దాటాక తమను పికప్ చేసుకుంటానని చెప్పాడని వాళ్లు కెనడా బోర్డర్ సెక్యూరిటీ సిబ్బందికి తెలిపారు. ఈ కేసులో స్టీవ్ శాండ్ ప్రమేయాన్ని ప్రాథమికంగా గుర్తించిన అమెరికా దళాలు మానవ అక్రమ రవాణా కింద అతడిపై కేసు నమోదు చేశాయి.

Follow Us:
Download App:
  • android
  • ios