తెలంగాణలో మరో నెలరోజుల్లో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇప్పటికే అభ్యర్థుల ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్... వారి గెలుపు కోసం వ్యూహరచనలు చేస్తున్నారు. ఇతర పార్టీల్లోని నాయకులను ఆకర్షించి టీఆర్ఎస్‌లో చేర్చుకోవడం కూడా ఇందులో ఓ భాగమే. ఇలా కేవలం తెలంగాణలోనే కాదు ఇతర దేశాల్లో స్థిరపడిన ఎన్ఆర్ఐలను కూడా టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంటూ తనదైన శైలిలో ముందుకు వెళుతున్నారు గులాబీ బాస్. ఇలా అమెరికాలో దాదాపు 300 మంది ఎన్అర్ఐలను టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు. బే-ఏరియా తెరాస శాఖ ఎన్అర్ఐ  నవీన్ జలగం ఆధ్వర్యంలో వీరంతా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. 

శాసన సభ ఎన్నికల్లో వందకు పైగా సీట్లను సాధించి కెసిఆర్  మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని కోరుతూ నవీన్  జలగం ఇంట్లో దుర్గా పూజ నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో టీఆఆర్ఎస్ అమెరికా కన్వీనర్ పూర్ణ బేరితో పాటు ఇతర ఎన్ఆర్ఐ సభ్యులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీకి ఎటువంటి ఆటంకాలు కలగకుండా చూసి,వంద సీట్లకు పైగా గెలుపొందెలా చేయాలని దుర్గా పూజతో పాటు నవ గ్రహ పూజ చేసి దేవుణ్ణి వేడుకున్నారు.

ఈ సంధర్బంగా నవీన్ జలగం మాట్లాడుతూ... గత నాలుగున్నరేళ్లలో రాష్ట్రం కెసిఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ దిశగా అడగులు వేస్తోందనీ... ఈ దశలో తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన కోరారు. కాంగ్రెస్ హయాంలో గత 60 సంవత్సరాలలో లేని అభివృద్ధి కేవలం నాలుగున్నరేళ్లలో కెసిఆర్ సాధించారని అన్నారు. అందువల్ల ప్రజలంతా ఆయనకు వెన్నుదన్నుగా నిలబడి బంగారు తెలంగాణ సాకారం కొరకు రెండో సారి తెరాసను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.  ముఖ్యమంత్రి అమలుచేసిన సంక్షేమ,అభివృద్ధి పథకాలు కొనసాగలంటే తప్పని సరిగా తెరాసను గెలిపించుకోవాల్సిన అవసరం ప్రజలపై ఉందన్నారు. 

  శ్రీని పొన్నాల,భాస్కర్ మద్ది,హృషీకేశ్,శశి దొంతినేనిలు టీఆర్ఎస్ లో చేరిన వారిలో వున్నారు.  ఈ కార్యక్రమంలో అమెరికా టీఆర్ఎస్ శాఖ నాయకులతో పాటు తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. 

వీడియో

"