అమెరికాలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ముగ్గురు తెలంగాణ విద్యార్థులు సజీవదహనమయ్యారు. వివరాల్లోకి వెళితే.. కొలిర్‌వ్యాలీలోని ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా.. వీరిలో తెలంగాణకు చెందిన ముగ్గురు విద్యార్థులున్నట్లుగా తెలుస్తోంది. మరణించిన వారిని నల్గొండ జిల్లాకు చెందిన సాత్విక నాయక్, సుహాస్ నాయక్, జయ్ సుచితలుగా గుర్తించారు. వీరి మరణవార్త తెలుసుకున్న కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు. 

క్రిస్మస్ పండుగ రోజు అమెరికాలో ఈ దుర్ఘటన సంభవించింది. అంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో అర్ధరాత్రి ఇంట్లో చెలరేగిన మంటలకు ముగ్గురు సజీవదహనమయ్యారు. మరమించిన ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు. వీరంతా 14 ఏళ్ల నుంచి 17 ఏళ్లలోపు వయస్సున్న వారే. మృతులు ముగ్గురు నల్గొండ జిల్లా ఆడిశర్లపల్లి మండలం గుర్రపుతండాకు చెందినవారు.

"