లండన్ లో యువతికి వేధింపులు.. ఎన్ఆర్ఐకి జైలు శిక్ష

లండన్ లో ఓ యువతిని ప్రేమ పేరుతో వేధించినందుకు భారతీయ యువకుడికి అక్కడి న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. 29నెలల పాటు జైలు శిక్ష అనంతరం అతనిని భారత్ కి పంపించాల్సిందిగా న్యాయస్థానం తీర్పు వెలువరించింది.

28-Year-Old Indian Man Jailed For 29 Months For Stalking Woman In UK

లండన్ లో ఓ యువతిని ప్రేమ పేరుతో వేధించినందుకు భారతీయ యువకుడికి అక్కడి న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. 29నెలల పాటు జైలు శిక్ష అనంతరం అతనిని భారత్ కి పంపించాల్సిందిగా న్యాయస్థానం తీర్పు వెలువరించింది.

పూర్తి వివరాల్లోకి వెళితే... భారత్ కి చెందిన రోహిత్ శర్మ(28) ఉద్యోగ రిత్యా లండన్ వెళ్లాడు. కాగా.. అక్కడ 2017లో ఓ యువతిని  చూసి ఇష్టపడ్డాడు. అప్పటి నుంచి ఆమెను ప్రేమించమంటూ వెంటపడ్డాడు. ఆమె అభ్యంతరం చెప్పినా వినకుండా... ఆమె వెంటే పడేవాడు. అతని బాధ తట్టుకోలేక ఆ యువతి ఉద్యగం మానేసి వేరే ప్రాంతానికి కూడా వెళ్లిపోయింది. అయినా యువకుడు తన తీరు మార్చుకోకపోవడం గమనార్హం.

బాధితురాలికి రోజుకు 40కిపైగా వివిధ ఫోన్ల నుండి కాల్స్‌ చేసి వేధించేవాడు. బాధితురాలు ఫోన్‌ నెంబర్లను బ్లాక్‌ చేసిన ప్రతిసారి కొత్త ఫోన్‌ నెంబర్‌ నుంచి కాల్స్‌ చేసి వేధించేవాడు. వేధింపులు ఎక్కువ కావడంతో 2018ఫిబ్రవరిలో పోలీసులకు యువతి ఫిర్యాదు చేయడంతో రోహిత్‌కు హారాస్మెంట్‌ వార్నింగ్‌ ఇచ్చారు. అప్పటికీ మారకుండా తరచూ యువతిని వెంబడిస్తూ పని చేసే చోటుకు వెళ్లి గంటల తరబడి చూస్తూ వేధించేవాడు. దీంతో 2018 జూలైలో పోలీసులు కేసు నమోదు చేసి రోహిత్‌ను అరెస్ట్‌ చేశారు. అనంతరం బెయిల్‌పై విడుదలై తిరిగి వేధింపులు ప్రారంభించాడు. 

2018 నవంబర్‌లో కోర్టు విచారణకు హాజరుకాకపోవడంతో అతడికోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇంటెలీజెన్స్‌ పోలీసుల సమాచారంతో 2019 ఏప్రిల్‌లో రోహిత్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. విచారణలో రోహిత్‌ దోషిగా తేలడంతో యువతిని వెంబడించినందుకు 22 నెలలు, వేధింపులకు పాల్పడినందుకు 6 నెలలు, కోర్టు విచారణకు హాజరు కానందుకు ఒక నెల కలిపి మొత్తం 29 నెలల జైలు శిక్షతోపాటూ, శిక్షాకాలం పూర్తయిన తర్వాత అతడిని భారత్‌కు పంపించాలని న్యాయస్థానం తీర్పు వెలువరించింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios