వాషింగ్టన్: అమెరికాలో ఘోర రోడ్డ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు భారతీయ విద్యార్థులు మరణించారు. వారిలో ఒకరు తెలుగు విద్యార్థి. మృతులను స్టాన్లీ (23), వైభవ్ గోపిశెట్టి (26)లుగా గుర్తించారు. వైభవ్ గోపిశెట్టి తెలుగు విద్యార్థి.

అమెరికాలోని టెనస్సీ రాష్ట్రంలో గల నాష్ విల్లే అనే పట్టణంలో ఆ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విద్యార్థులు ఇద్దరు కూడా టెనస్సీ స్టేట్ యూనివర్శిటీలో చదువుతున్నారు. 

డేవిడ్ టోరెస్ అనే వ్యక్తి తన ట్రక్కుతో విద్యార్థులు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టడం వల్ల ప్రమాదం సంభవించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నవంబర్ 28వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

స్టాన్లీ మాస్టర్స్ డిగ్రీ చేస్తుండగా, గోపిశెట్టి డాక్టరేట్. ప్రమాదం చేసి టోరెస్ ఏ ప్రశ్నలకు కూడా సమాధానం ఇవ్వడం లేదని, అధికారులు డిఎన్ఎ శాంపిల్స్ తీసుకున్నారని, దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు చెప్పారు. 

ఫుడ్ సైన్స్ రంగంలో తనకంటూ ఓ పేరును సంపాదించుకోవాలనే తపనతో విభైవ్ విపుల్ సుధీర్ గోపిశెట్టి నాష్ విల్లేకు వచ్చాడు.