Asianet News TeluguAsianet News Telugu

హాట్ కేక్‌ల్లా ‘షియోమీ’ ఫోన్లు, టీవీలు.. ఒక్కరోజే 15 లక్షల యూనిట్ల సేల్

ఫెస్టివ్‌ సీజన్ సందర్భంగా బడ్జెట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ ఉత్పత్తులు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఒక్కరోజే 15 లక్షల ఉత్పత్తులు అమ్ముడయ్యాయని షియోమీ తెలిపింది. మరోవైపు ఆన్ లైన్ రిటైల్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ దుమ్ములేపాయి. తొలి రోజు సేల్స్‌లో రూ.750 కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్లు అమ్ముడు పోయాయి.

Xiaomi Says Sold Over 1.5 Million Devices Across Amazon, Flipkart, Mi.com During Ongoing Festive Sales
Author
Hyderabad, First Published Oct 1, 2019, 12:51 PM IST

న్యూఢిల్లీ: ఈకామర్స్ సంస్థలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లు నిర్వహిస్తున్న పండుగ సేల్‌లో షియోమీ ఉత్పత్తులు హాట్ కేకుల్లా అమ్ముడు అవుతున్నాయి. రెండింటిలోనూ 29నే సేల్ ప్రారంభం కాగా, ఒక్క రోజులో ఏకంగా 15 లక్షల ఉత్పత్తులను విక్రయించినట్టు షియోమీ ప్రకటించింది.

ఎంఐ సొంత వెబ్‌సైట్‌లో నిర్వహిస్తున్న ‘దివాలీ విత్ ఎంఐ సేల్’, ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్‌బిలియన్ డేస్ సేల్’, అమెజాన్ ‘గ్రేట్ ఇడియన్ ఫెస్టివల్ సేల్’ ద్వారా కొన్ని గంటల్లోనే వీటిని విక్రయించినట్టు తెలిపింది.

అమ్ముడుపోయిన ఉత్పత్తుల్లో అత్యధిక వాటా స్మార్ట్‌ఫోన్లదేనని షియోమీ వివరించింది. ఆ తర్వాతి స్థానాల్లో ఎంఐ ఎకో సిస్టం డివైజ్‌లు, యాక్సెసరీలు, ఎంఐ టీవీ మోడళ్లు ఉన్నాయని తెలిపింది. మొత్తం అమ్మకాల పరంగా సెకన్‌కు పది ఉత్పత్తులు విక్రయించినట్టు షియోమీ వివరించింది.

ఫెస్టివ్ సీజన్‌లో భాగంగా అమ్ముడవుతున్న పది బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్లలో ఐదు షియోమీవేనని పేర్కొంది. ఇక, టీవీ కేటగిరీల్లో ప్రతీ మూడు టీవీల్లో రెండు ఎంఐ టీవీలు ఉన్నాయని తెలిపింది. అలాగే, ఎంఐ బాండ్ మోడళ్లు, ఎంఐ సెక్యూరిటీ కెమెరాలు కూడా వేగంగా అమ్ముడుపోయాయని పేర్కొంది.

ఇక, ఎయిర్ ప్యూరిఫైర్ కేటగిరీలో ‘ఎంఐ ఎయిర్ ప్యూరిఫైర్ 2ఎస్’ బెస్ట్ సెల్లర్‌గా నిలిచిందని షియోమీ వివరించింది. మరోవైపు పండుగ సీజన్‌లో భారతీయ వినియోగదారులు స్మార్ట్‌ఫోన్ల కొనుగోళ్లలో దుమ్ము లేపారు. ప్రముఖ రిటైల్ ఈ కామర్స్‌ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఈ సీజన్ తొలి రోజు రికార్డు స్థాయిలో అమ్మకాలు సాధించినట్టు తెలుస్తోంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో రూ. 750 కోట్ల విలువైన ప్రీమియం స్మార్ట్‌ఫోన్లను విక్రయించామని, కేవలం 36 గంటల్లో ఈ రికార్డ్‌ సేల్‌ను నమోదు చేసినట్టు ప్రకటించింది.

కాగా, బిగ్ బిలియన్ డేస్ అమ్మకం తొలిరోజు రెండు రెట్లు వృద్ధిని సాధించినట్లు వాల్‌మార్ట్ సొంతమైన ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ప్రీమియం బ్రాండ్లు వన్‌ప్లస్, శాంసంగ్, ఆపిల్‌ స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలతో 36 గంటల్లో రూ. 750 కోట్లకు మించి సాధించినట్టు తెలిపింది.

తమకు ఇదే అతిపెద్ద ప్రారంభ రోజు అమ్మకాలని అమెజాన్‌ గ్లోబల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, కంట్రీ హెడ్ అమిత్ అగర్వాల్ తెలిపారు. బ్యూటీ అండ్‌ ఫ్యాషన్‌ రంగంలో 5 రెట్ల వృద్ధినీ, గ్రాసరీస్ అమ్మకాల్లో ఏకంగా 7 రెట్ల వృద్ధిని సాధించినట్టు వెల్లడించారు. ప్రధానంగా తమకొత్త కస్టమర్లలో 91శాతం, ద్వితీయ శ్రేణి, త్రుతీయ శ్రేణి పట్టణాలదేనన్నారు.

ఈ ఫెస్టివ్‌ సీజన్‌ అమ్మకాల్లో మొత్తం మీద రెండు సంస్థలు 5 బిలియన్‌ డాలర్లకుమించి ఆదాయాన్ని ఆర్జించే అవకాశం వుందని తాజా నివేదికల అంచనా. స్నాప్‌డీల్‌, క్లబ్‌ ఫ్యాక్టరీ లాంటి సంస్థలు కూడా ఇదే జోష్‌ను కొనసాగిస్తున్నాయి. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ పండుగ అమ్మకాలు అక్టోబర్ 4న ముగియనున్నాయి

Follow Us:
Download App:
  • android
  • ios