ప్రముఖ మొబైల్‌ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ తన అభిమానుల కోసం ‘ఎంఐ ఫ్యాన్‌ ఫెస్టివల్‌ 2019’ను తేనున్నది. ఈ నెల నాలుగో తేదీ నుంచి  ఆరో తేదీ వరకు షియోమీ వస్తువులపై ప్రత్యేక రాయితీని అందించనుంది. ఎంఐ.కామ్‌, ఎంఐ హోమ్‌, ఎంఐ స్టోర్లు, అధీకృత ఆఫ్‌లైన్‌ స్టోర్లలో వివిధ ఉత్పత్తులపై డిస్కౌంట్‌ లభిస్తుంది. 

మూడు రోజుల పాటు సాగే ఈ సేల్స్‌లో డిస్కౌంట్లు, ఫ్లాష్ సేల్స్, పాపులర్ ప్రొడక్ట్స్.. రెడ్ మీ నోట్ 7 ప్రో, ఎంఐ టీవీ 4 ప్రో, ఎంఐ ఎ2, ఎంఐ ఎయిర్ ఫ్యూరిఫయర్ 2ఎస్, రెడ్ మీ 6 తదితర ఉత్పత్తులపై స్పెషల్ డీల్స్ అందుబాటులోకి తెచ్చింది. 

అంతేకాదు, ‘ఫన్‌ అండ్‌ ఫ్యూరియస్‌’ పేరుతో ఆన్‌లైన్‌ గేమ్‌లను ఆడటం ద్వారా రెడ్‌మీ నోట్‌ 7, ఎంఐ స్పోర్ట్స్‌ బ్లూటూత్‌ ఇయర్‌ఫోన్స్‌ను సొంతం చేసుకోవచ్చు. దీంతోపాటు రెడ్‌మీ నోట్‌ 7ప్రో, పోకో ఎఫ్‌1, ఎంఐ సౌండ్‌బార్‌, ఎంఐ ఎల్‌ఈడీ టీవీ 4 ప్రో తదితర ఉత్పతులను రూ.1 ఫ్లాష్‌ సేల్‌ కింద విక్రయించనుంది. 

ఇక షియోమీకి చెందిన అన్ని ఉత్పత్తులపై హెచ్‌డీఎఫ్‌సీ కార్డుతో కొనుగోలు చేయడం ద్వారా 5శాతం అదనపు రాయితీ అంటే రూ.500 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఎంపిక చేసిన ఉత్పత్తులపై మాత్రం వెంటనే రాయితీ లభించనుంది.

ఇక మొబిక్విక్‌తో వ్యాలెట్‌ ద్వారా కొనుగోలు చేసే వారికి 15శాతం రాయితీని ఇన్‌స్టా సూపర్‌ క్యాష్‌ రూపంలో పొందవచ్చు.  షియోమీ రెడ్‌మీ 6 3జీబీ+32జీబీ మోడల్‌పై రూ.2000 డిస్కౌంట్‌తో రూ.6,999లకే లభించనున్నది.

అలాగే షియోమీ రెడ్‌మీ వై2 3జీబీ, 4జీబీ వేరియంట్ ఫోన్లతోపాటు రెడ్‌మీ నోట్‌ 6ప్రో 3 జీబీ, 4జీబీ వేరియంట్ ఫోన్లు రూ.7,999.. రూ.9,999లకే లభించనున్నాయి. రెడ్‌మీ నోట్‌5 ప్రో మోడల్ ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్‌ను రూ.10,999లకే కొనుగోలు చేసుకోవచ్చు.

షియోమీ ఉత్పత్తులపై గరిష్ఠంగా రూ.2000 వరకు ఆఫర్లు, డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ పేరిట ఆదా చేయొచ్చు. అంతేకాదు ఎంఐ పే ద్వారా కొనుగోలు చేసేవారు మూడు రోజులు ఒక ఎంఐ టీవీ, రెడ్ మీ నోట్ 7 ప్రతిరోజు గెలుచుకునే చాన్స్ కూడా ఉంది. 

ఇంకా రెడ్ మీ 6ఎ కొనుగోలుపై రూ.1000, ఎంఐ ఇయర్ ఫోన్లపై రూ.400, ఎంఐ టీవీ 4 ప్రో 55 - ఇంచ్ పై రూ.9000, ఎంఐ బాడీ కంపోజిషన్ స్కేల్‌పై రూ.1300 వరకు, ఎంఐ బాండ్ హెచ్ఆర్ఎక్స్ ఎడిషన్ పై రూ.800 వరకు రాయితీ లభిస్తుంది.