Asianet News TeluguAsianet News Telugu

వాట్సాప్‌ స్టేటస్ ఎఫ్‌బీకి షేరింగ్: వాట్సాప్‌లో కొత్త ఫీచర్

మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ తన కస్టమర్ల కోసం కొత్త అప్‌డేట్‌ తీసుకొచ్చింది. కుడి వైపున ఉండే మూడు చుక్కలను క్లిక్ చేస్తే వాట్సాప్ స్టేటస్‌ ఫేస్‌బుక్‌కు డైరెక్ట్‌ షేర్ అవుతుంది. అలాగే మ్యూట్ స్టేటస్ అప్ డేట్ కోసం వాట్సాప్ ప్రయత్నిస్తోంది. 

WhatsApp new Status feature that you can use right away
Author
Washington D.C., First Published Sep 23, 2019, 4:34 PM IST

మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త ఫీచర్లతో కస్టమర్లకు ఎప్పటికపుడు రిఫ్రెష్ చేస్తున్నది. తాజాగా నేరుగా ఫేస్‌బుక్‌లో  వాట్సాప్ స్టేటస్‌‌ను షేర్‌ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లకు కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.

వాట్సాప్‌లో స్టేటస్‌గా పెట్టుకునే వాటిని ఇకపై ‘షేర్ టూ ఫేస్‌బుక్ స్టోరీ’ బటన్‌పై క్లిక్ చేయడం ద్వారా వాటిని ఫేస్‌బుక్ స్టోరీలుగా మార్చొచ్చు. స్టేటస్ అప్‌డేట్ తర్వాత కుడివైపు ఉండే మూడు  చుక్కలను క్లిక్‌ చేస్తే.. ‘షేర్ టు ఫేస్‌బుక్ స్టోరీ’ అనే ఆప్షన్‌ కనబడుతుంది. 

దానిపై క్లిక్ చేయగానే ఆ స్టేటస్ ఆటోమెటిక్‌గా ఫేస్‌బుక్ స్టోరీలో షేర్‌ అవుతుంది. ఈ ఫీచర్ ఇప్పుడు అన్ని వాట్సాప్ వినియోగదారులకు అందుబాటులో ఉంది.

వాట్సాప్ స్టేటస్‌ చిత్రం లేదా వీడియోను అప్‌లోడ్ చేశాక కుడివైపున ఉన్న మూడు చుక్కల్ని క్లిక్‌ చేసి షేర్‌ టు ఫేస్‌బుక్‌  స్టోరి అనే ఆప్షన్‌ను ఎంచుకుని పబ్లిష్‌ చేయాలి. 

అలాగే వాట్సాప్ మ్యూట్' స్టేటస్‌కు సంబంధించి కూడా అప్‌డేట్‌ తీసుకు రానుంది. మ్యూట్ చేసిన వ్యక్తుల షేరింగ్‌ పూర్తిగా కనిపించకుండా చేసే కొత్త ఫీచర్‌పై కూడా వాట్సాప్ పనిచేస్తోంది. 

ఆండ్రాయిడ్‌ , తాజా బీటా వెర్షన్ వినియోగదారులు తమ కాంటాక్ట్స్‌ లోని వారి స్టేటస్‌ను మ్యూట్‌ చేసుకునే అవకాశం ఉన్నసంగతి తెలిసిందే. అయితే మ్యూట్‌ చేసిన తరువాత కూడా ఆయా వ్యక్తుల  స్టేటస్‌లు హైలెట్‌ కాకుండా గ్రే కలర్‌లో మనకు కనిపిస్తుంటాయి. ఇకపై ఇలా కనిపించకుండా చేయాలని వాట్సాప్‌ ప్లాన్‌ చేస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios