న్యూఢిల్లీ: చైనా స్మార్ట్ ఫోన్ల కంపెనీ వివో మంగళవారం మార్కెట్లోకి యూ10 మొబైల్‌ను విడుదల చేసింది. 3జీబీ విత్ 32 జీబీ వేరియంట్‌ ఫోన్‌ ధర రూ.8,990, 3జీబీ విత్ 64జీబీ వేరియంట్ ఫోన్‌ ధర రూ.9,990, 4 జీబీ విత్ 64జీబీ వేరియంట్‌ ఫోన్‌ ధర రూ.10,990గా కంపెనీ నిర్ణయించింది.

ఈ ఫోన్‌లో 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 8ఎంపీ సెల్ఫీ కెమెరా, ఏఐ ట్రిపుల్‌ కెమెరాలు ఉన్నాయి. స్పాప్‌ డ్రాగన్‌ 665 ప్రాసెసర్‌, ట్రిపుల్‌ కెమెరా సెటప్‌ ఈ ఫోన్‌ లో ఉన్నాయి. ఈ నెల 29 నుంచి ప్రారంభమయ్యే అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌లో ఈ ఫోన్‌ అమ్మకానికి ఉంటుందని కంపెనీ తెలిపింది.

6.35 అంగుళాల ఎల్సీడీ డిస్ ప్లే గల వివో యూ 10 మోడల్ ఫోన్ బ్యాక్ 13+8+2 మెగా పిక్సెల్ సెన్సర్లతో కూడిన ట్రిపుల్ కెమెరా ఉంటుంది. లాంచింగ్ ఆఫర్ కింద వివో యూ 10 ఫోన్ కొనుగోలుదారులకు ఎస్బీఐ కార్డులపై 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.

ఆరు నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్, జియో ఫోన్ వినియోగదారులకు రూ.6000 విలువైన వోచర్లు లభిస్తాయి. తదుపరి వివో ఇండియా వెబ్ సైట్ నుంచి కొనుగోలు చేసే వారికి రూ.750 డిస్కౌంట్ లభిస్తుంది. ఆండ్రాయిడ్ 9 పై, ఫన్ టచ్ ఓఎస్ 9.1తో ఇది పని చేస్తుంది.