Asianet News TeluguAsianet News Telugu

ఐ ఫోన్‌లో క్రెడిట్‌ కార్డ్‌ సేవలు...'ఆపిల్‌ పే' ద్వారా చెల్లింపులపై ఆఫర్లు

పలు రకాల సర్వీసులను ఆఫర్ చేస్తున్న ఆపిల్ తాజాగా ‘క్రెడిట్ కార్డు’ సేవలను అందుబాటులోకి తేనున్నది. మూడు శాతం క్యాష్ బ్యాక్ అందించే ఈ క్రెడిట్ కార్డు సేవలు ప్రస్తుతానికి ‘ఐఫోన్’లోనే అందుబాటులో ఉంటాయి. గోల్డ్ మన్ శాక్ మనీ చెల్లింపులు చేస్తుండగా, ఇంటర్నేషనల్ చెల్లింపుల బాధ్యతలను వీసాకార్డు నిర్వర్తిస్తుంది.

The Apple Card is a perfect example of Apples post iPhone strategy
Author
New Delhi, First Published Mar 27, 2019, 3:26 PM IST

శాన్‌ ఫ్రాన్సిస్కో/కాలిఫోర్నియా: టెక్‌ దిగ్గజం ఆపిల్‌ ‘సేవ’ల విస్తరణ దిశగా అడుగులు వేస్తున్నది. టీవీ సబ్ స్క్రిప్షన్ సర్వీసు ప్రారంభించిన ఆపిల్.. మున్ముందు క్రెడిట్ కార్డు సేవల్లోకి అడుగు పెట్టనున్నది. యాపిల్ టీవీ ప్లస్, కొత్త యాపిల్ టీవీ యాప్, టీవీ ఛానల్స్‌ను కాలిఫోర్నియా కేంద్రంగా ఆవిష్కరించింది. 

తాజాగా ఆపిల్‌ కార్డ్‌’ పేరుతో నూతనతరం ఆర్థిక సేవలకు శ్రీకారం చుట్టింది. తన సొంత వాలెట్‌ యాప్‌ ఆధారంగా సునాయాసంగా డిజిటల్‌ చెల్లింపులు చేసేందుకు వీలుకల్పిస్తోంది. కార్డు నంబర్, సంతకం, సీవీవీ సెక్యూరిటీ కోడ్‌ వంటి సంప్రదాయ ఫిజికల్‌ క్రెడిట్‌ కార్డ్‌ మాదిరిగా వివరాలను ఇవ్వాల్సిన అవసరం లేకుండా.. చిటికెలో చెల్లింపులు జరిగేలా అధునాతన డిజిటల్‌ కార్డును ఐఫోన్‌ వినియోగదారులకు అందిస్తోంది.

ఎక్స్‌పైరీ డేట్‌ లేని ఈ కార్డు సహాయంతో అత్యంత సులువుగా షాపింగ్‌ పూర్తిచేయవచ్చని యాపిల్‌ ప్రకటించింది. ‘ఆపిల్‌ పే’ యాప్‌లో అభివృద్ధి చేసిన డిజిటల్‌ క్రెడిట్‌ కార్డు వినియోగంపై 3% వరకు క్యాష్‌బ్యాక్‌ అందుతుంది. ఇందుకు బ్యాంకింగ్‌ సేవలను గోల్డ్‌మన్‌ శాక్స్‌ అందిస్తుండగా.. అంతర్జాతీయ చెల్లింపుల నెట్‌వర్క్‌ను మాస్టర్‌కార్డ్‌ అందిస్తోంది. 

ఐఫోన్‌లోని ఆపిల్‌ పే యాప్‌లో సైన్‌ఇన్‌ అయిన క్షణాల్లోనే ఈ క్రెడిట్‌ కార్డ్‌ సేవలను పొందొచ్చు. మెషీన్‌ లెర్నింగ్, ఆపిల్‌ మ్యాప్స్‌ ఆధారంగా చెల్లింపు జరిగిన స్థలం, మర్చంట్‌ పేరు స్టోరయి ఉంటాయి. కస్టమర్ల డేటాను ఇతరులకు విక్రయించేది లేదని గోల్డ్‌మన్‌ శాక్స్‌ పేర్కొంది. అందువల్ల కార్డు భద్రత విషయంలో ఏ సందేహం అవసరం లేదని ఆపిల్‌ పే వైస్‌ ప్రెసిడెంట్‌ జెన్నిఫర్‌ బైలీ పేర్కొన్నారు. ఈ వేసవి నుంచి అమెరికాలో క్రెడిట్‌ కార్డ్‌ సేవలు అందుబాటులోకి తెస్తామన్నారు.

ఇంకా మ్యూజిక్‌ సేవల్లో సంచలనం సృష్టించిన యాపిల్‌.. నెట్‌ఫ్లిక్స్‌ సహాయంతో ఇక నుంచి తాజా వార్తలను సైతం అందించేందుకు ప్రయత్నిస్తోంది. ‘నెట్‌ఫ్లిక్స్‌ ఫర్‌ న్యూస్‌’ పేరుతో 300 పైగా మేగజైన్లలోని ఆర్టికల్స్‌ను అందుబాటులో ఉంచడంతో పాటు సమగ్ర వార్తలను అందిస్తోంది. నెలకు 10 డాలర్లను సబ్‌స్క్రిప్షన్‌ కింద చెల్లించడం ద్వారా యాపిల్‌ కస్టమర్లు ఈ సేవలు అందుకోవచ్చని వెల్లడించింది. 

ఇంకా ఆపిల్ టీవీ యాప్‌ను కొత్త డిజైన్‌తో కొత్తగా ఆవిష్కరించింది. దాదాపు 100దేశాల్లో ఐఫోన్‌, ఐపాడ్‌, యాపిల్‌ టీవీ 4కె లో ప్రస్తుతానికి దీని సేవలు అందుబాటులో ఉంటాయి. శాంసంగ్‌ స్మార్ట్‌టీవీ, అమెజాన్‌ ఫైర్‌ టీవీ, ఎల్‌సీ, సోనీ, రోకూ, విజియో ప్లాట్‌ఫాంలలో కూడా త్వరలోనే లాంచ్‌ చేస్తామని యాపిల్‌ ప్రకటించింది.  

Follow Us:
Download App:
  • android
  • ios