టెలిగ్రామ్ రికార్డ్ బ్రేక్: కేవలం 24 గంటల్లో 30 లక్షల యూజర్లు
సోషల్ మీడియా వేదిక ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ పనిచేయక నెటిజన్లు ఇబ్బందుల పాలయ్యారు. ఫలితంగా రైవల్ ప్లాట్ ఫామ్ ‘టెలిగ్రామ్’కు కలిసొచ్చింది. బుధవారం నుంచి గురువారానికల్లా అదనంగా 30 లక్షల యూజర్లు వచ్చి చేరారు.
సోషల్ మీడియా వేదిక ఫేస్‌బుక్ సొంతమైన వాట్సాప్‌కు భారీ షాక్ తగిలింది. వాట్సాప్ పోటీ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ యూజర్ బేస్‌లో టాప్‌గేర్‌లో దూసుకుపోతోంది బుధవారం ఫేస్‌బుక్ మెసేజింగ్ యాప్, వాట్సాప్ యాప్‌లు సేవలు స్తంభించడంతో నేపథ్యంలో యూజర్లు టెలిగ్రామ్ వైపు మళ్లి పోతున్నారు. కేవలం ఒక్కరోజులో తమ కొత్త యూజర్ల సంఖ్య భారీగా పెరిగిందని టెలిగ్రామ్ స్వయంగా తెలిపింది.
ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సాప్, ఇన్‌స్ట్రా సేవల్లో అంతరాయం ఏర్పడటంతో తమ యూజర్ల సంఖ్య భారీగా పెరిగిందని టెలిగ్రాం తాజాగా వెల్లడించింది. కేవలం 24 గంటల్లోనే తన నెట్‌వర్క్‌లో 30 లక్షల కొత్త యూజర్లు చేరారని టెలిగ్రాం ఫౌండర్ పావెల్ దురోవ్ తెలిపారు. వాట్సాప్‌కు పోటిగా ఎంట్రీ ఇచ్చిన చాటింగ్ యాప్ టెలిగ్రాంకు ప్రస్తుతం 200 మిలియన్ల నెలవారీ యూజర్లున్నారు.
కాగా ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్ సొంతమైన ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్‌బుక్ మెసేంజర్ సేవలకు బుధవారం తీవ్ర అంతరాయం ఏర్పడింది. లోడింగ్‌లో సమస్యలు ఎదురైనట్లు పలువురు యూజర్లు ఫిర్యాదు చేశారు. అటు ఫేస్‌బుక్ కూడా దీన్ని ధృవీకరించింది. గురువారం ఉదయానికి ఇన్‌స్టాగ్రామ్ సేవలను పునరుద్దిరించినట్టు ప్రకటించింది.
అతిపెద్ద సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్‌బుక్.. దాంతోపాటు ఇన్‌స్టాగ్రామ్ కూడా యూజర్లను ఇబ్బంది పెట్టింది. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది యూజర్లు బుధవారం ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లతో ఇబ్బందులు పడ్డారు. ఈ రెండు ప్లాట్‌ఫామ్‌లలో కొత్త పోస్టులు పెట్టడం, మెసేజ్‌లు పంపడం సాధ్యపడలేదు. మెసేంజర్ మొబైల్ యాప్ బాగానే పనిచేసినా డెస్క్ టాప్‌లో లోడ్ కాలేదు. ఫేస్‌బుక్ యాప్‌లలో వాట్సప్ మాత్రమే సజావుగా పని చేసింది. అయితే దీనిపై గురించి ఇంత వరకూ ఎటువంటి బహిరంగ ప్రకటన వెలువడలేదు.
ఈ సమస్య బుధవారం రాత్రి ప్రారంభమైనట్లు సమాచారం. డైరెక్ట్ మెసేజీలు, కంటెంట్ పోస్ట్ చేసే బటన్ కనిపించక యూజర్లు కాసేపు తికమకపడ్డారు. ఇంటర్నల్ ఎర్రర్ వల్లేఇలా జరిగినట్టు తెలుస్తోంది. డెస్క్‌టాప్ వర్షన్ లోడ్ అవ్వలేదు. కాగా మొబైల్ యాప్ మాత్రం కొంత సేపు పని చేసినట్లు యూజర్లు పేర్కొన్నారు.
దీనిపై ఓ వ్యాపారవేత్త మాట్లాడుతూ ‘ఫేస్‌బుక్‌ను వ్యక్తిగత అవసరాలకు మాత్రమే వినియోగిస్తే బాగుంటుంది. కానీ వ్యాపార అవసరాలకు కూడా ఫేస్‌బుక్ మీద ఆధారపడుతున్నాం. నేను న్యూయార్క్‌లో ఉన్న మా సిబ్బందితో మాట్లాడటానికి ఉన్న ఏకైక మార్గం.. ఫేస్‌బుక్. ఈ మెయిల్ పంపడం ఎప్పుడో మానేశాం’ అని పేర్కొన్నారు.
ఫేస్‌బుక్ పనిచేయక యూజర్లు #FacebookDown, #InstagramDown అనే హ్యాష్ ట్యాగ్‌లు క్రియేట్ చేసి ట్విటర్‌లో జోకులు పేల్చారు. ఈ ఇష్యూను సాధ్యమైనంత త్వరగా ఫిక్స్ చేస్తామని ఫేస్ బుక్ తెలిపింది.
దీని గురించి ‘ఫేస్‌బుక్ ఫ్యామిలీ యాప్‌ల యాక్సెస్‌లో కొంత మంది సమస్య ఎదుర్కొంటున్న విషయం మాకు తెలిసింది. ఈ సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామంటూ ఫేస్‌బుక్ ట్వీట్ చేసింది. భారత్‌తోపాటు ఇంగ్లాండ్, లాటిన్ అమెరికా, ఫిలిప్ఫిన్స్, టెక్సాస్, వాషింగ్టన్ తదితర ప్రాంతాల్లో ఫేస్ బుక్ సరిగా పని చేయలేదని సమాచారం.