Asianet News TeluguAsianet News Telugu

విపణిలోకి బిగ్‌ బ్యాటరీ శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌: ఎం30, ఎం10ఎస్ లాంచ్

స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో తన స్థానాన్ని పదిలంగా కాపాడుకునేందుకు దక్షిణ కొరియా సంస్థ శామ్ సంగ్ వేగంగా పావులు కదుపుతోంది. అత్యధికంగా 6000 ఎంఎహెచ్ సామర్థ్యం గల బ్యాటరీతో కూడిన గెలాక్సీ ఎం30ఎస్ ఫోన్‌ను విపణిలోకి ఆవిష్కరించింది.
 

Samsung Galaxy M30s with 48MP rear camera launched in India
Author
New Delhi, First Published Sep 19, 2019, 3:49 PM IST

ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల దిగ్గజం శామ్‌సంగ్‌ దేశీయ మార్కెట్లోకి మరో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లను అందుబాటులోకి తెచ్చింది. చైనా కంపెనీల నుంచి ఎదురవుతున్న తీవ్ర పోటీతో మార్కెట్‌లో దిగ్గజ స్థానానికి ఎసరొస్తున్న వేళ శామ్‌సంగ్‌ ఆధునిక ఫీచర్లతో సరికొత్త ఫోన్లను భారత మార్కెట్లోకి దించింది.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో వాటర్‌డ్రాప్ డిస్‌ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ప్రధాన ఆకర్షణ. ఈ నెల 29వ తేదీ నుంచి వినియోగదారులకు ఈ ఫోన్లు అందుబాటులోకి వస్తాయి.

తక్కువ ధరకు ఆధునిక ఫిచర్లతో సంస్థ వీటిని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. గతంలో గెలాక్సీ ఎం30, ఎం10 మోడళ్లకు కొనసాగింపుగా శామ్‌సంగ్‌ సంస్థ గెలాక్సీ ఎం30ఎస్‌, ఎం10ఎస్‌ స్మార్ట్‌ఫోన్లను కొత్తగా మార్కెట్లోకి ఆవిష్కరించింది. 

శామ్‌సంగ్‌ గెలాక్సీ ఎం30ఎస్‌ 4జీబీ/64జీబీ వేరియంట్‌ ధరను కంపెనీ రూ.13,999గా కంపెనీ నిర్ణయించింది. 6జీబీ/128జీబీ వేరియంట్‌ ధరను శామ్‌సంగ్‌ రూ.16,999గా పేర్కొంది. ఓపల్‌ బ్లాక్‌, పెరల్‌ వైట్‌, సోఫైర్‌ బ్లూ కలర్స్‌లో లభ్యం అవుతుంది. 

ఈ ఫోన్‌ 6.4 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ ఇన్ఫినిటీ యూసూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, ఎగ్జినోస్‌ 9611 ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌, 48, 5, 8 ఎంపీ సామర్థ్యం కలిగిన మూడు వెనుక కెమెరాలు, ముందు వైపు 16 ఎంపీ సెల్ఫీ కెమెరాతో మార్కెట్లోకి విడుదల చేసింది. మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా మెమొరీని 512 జీబీ వరకు పెంచుకునే వీలుంది. 

6,000 ఎంఏహెచ్‌ సామర్థ్యంగల మహా బ్యాటరీ కలిగి ఉన్న ఈ ఫోన్‌ 15 వార్ట్స్‌ చార్జింగ్‌ను సపోర్ట్‌ చేస్తుంది. మరోవైపు 3జీబీ/32జీబీ గెలాక్సీ ఎం10ఎస్‌ స్మార్ట్‌ఫోన్‌ ధరను కంపెనీ రూ.8,999గా కంపెనీ నిర్ణయించింది. 

పియానో బ్లాక్‌, స్టోన్‌ బ్లూ రంగుల్లో లభిస్తుంది. 6.40 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ ఇన్ఫినిటీ వీ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేతో ఈ ఫోన్‌ లభించనుంది. ఎగ్జినోస్‌ 7834బి ప్రాసెసర్‌ను వినియోగించారు. ఇంటర్నల్‌ స్టోరేజీని ఎస్‌డీ కార్డును ఉపయోగించి 512 జీబీ వరకు పెంచుకునే వీలుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios