నేడే శామ్‌సంగ్ గెలాక్సీ తొలి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్
శామ్‌సంగ్ గెలాక్సీ మొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది
న్యూఢిల్లీ: ప్రముఖ దక్షిణ కొరియా మొబైల్ తయారీ సంస్థ శామ్‌సంగ్ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ అందించింది. శుక్రవారం శామ్‌సంగ్ గెలాక్సీ మొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఫోన్ ధర మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. ప్రపంచంలోనే అతి పెద్ద మొబైల్ తయారీ సంస్థ శామ్‌సంగ్ ఎనిమిదేళ్లుగా ఈ ఫోన్‌ను రూపొందిస్తోంది.
ఏప్రిల్ నెలలో మార్కెట్లోకి ఈ ఫోన్‌ను విడుదల చేసిన కొన్ని రోజులకే ఫోన్ స్క్రీన్ సమస్య మొదలైంది. స్క్రీన్‌లో సమస్యలు తలెత్తడంతో ఫోన్ విడుదలను కొన్నాళ్లపాటు నిలిపివేశారు. జర్మనీ, అమెరికా, ఫ్రాన్స్ దేశాల్లో హైస్పీడ్ 5జీ నెట్‌వర్క్‌తో శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి రానుంది.
ఈ ఫోన్ అంతర్జాతీయ మార్కెట్‌లో 1980 డాలర్లుగా పలుకుతోంది. ఈ నెల 27వ తేదీన అమెరికా విపణిలో అడుగు పెట్టనున్న శామ్ సంగ్ 12 జీబీ విత్ 512 జీబీ స్టోరేజీ సామర్థ్యం, 7.3 అంగుళాల ఇంటర్నల్ ఫ్లెక్సిబుల్ డిస్ ప్లే కలిగి ఉంటుంది.