Asianet News TeluguAsianet News Telugu

రెడ్ మీ 8 ఫోన్ 3జీబీతోపాటు 4 జీబీ కూడా రూ.7,999లకే

షియోమీ సంస్థ తన రెడ్ మీ 8 ఫోన్ పై వినియోగదారులకు అద్భుతమైన ఆఫర్ అందుబాటులోకి తెచ్చింది. తొలి 50 లక్షల యూనిట్ల దరకు రూ.1000 ధర తగ్గిస్తున్నట్లు తెలిపింది.

Redmi 8 Price in India Starts at Rs. 7,999, First Sale on October 12: Event Highlights
Author
Hyderabad, First Published Oct 10, 2019, 12:30 PM IST

న్యూఢిల్లీ: భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో.. మరీ ముఖ్యంగా బడ్జెట్‌ ఫోన్లు అందించడంలో ముందుండే రెడ్‌మీ నుంచి తాజాగా కొత్త మోడల్ విడుదలైంది. రెడ్‌మీ 8 మోడల్‌ స్మార్ట్‌ఫోన్‌ను భారత విపణిలో ఆవిష్కరించారు.

ఏఐ డ్యూయల్‌ కెమెరాలతో 3జీబీ ర్యామ్‌ విత్ 32జీబీ స్టోరేజ్‌, 4జీబీ ర్యామ్‌ విత్ 64 జీబీ స్టోరేజ్‌ వేరియంట్లలో ఇది లభించనుంది. దీనికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. 6.22 అంగుళాల స్క్రీన్, 5000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకత.

12 ఎంపీ, 2 ఎంపీ డ్యుయల్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో ఈ ఫోన్‌ రూపు దిద్దుకున్నది. ఫ్లిప్‌కార్ట్‌లో హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్ కార్డ్‌పై ఈ ఫోన్‌ను ఆర్డర్ చేసిన వారికి 10 శాతం క్యాష్‌బ్యాక్ లభించనుంది.

సిటీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులపై తక్షణ క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. అక్టోబర్ 12వ తేదీ నుంచి ఎంఐ .కామ్‌, ఎంఐ సోర్స్‌,ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా ఈ ఫోన్ విక్రయాలు మొదలుకానున్నట్లు తెలిసింది.

డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌, "ఇండస్ట్రీ-లీడింగ్" ఎడ్జ్ డిటెక్షన్, సోనీ ఐఎంఎక్స్‌ 363 సెన్సర్‌, స్కిన్ టోన్ మ్యాపింగ్ వంటి లక్షణాలకు మద్దతునిస్తుంది. అలాగే స్పీడ్‌ చార్జింగ్‌ కోసం యూఎస్‌బీ టైప్‌ సీ చార్జర్‌ , కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ ప్రొటెక్షన్‌, వాటర్‌డ్రాప్ తరహా నాచ్‌ డిజైన్‌ పెద్ద డిస్‌ప్లే , ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను అమర్చింది.

"అల్టిమేట్ స్క్రీన్ ప్రొటెక్షన్"తో రెడ్ , బ్లూ, బ్లాక్‌ కలర్ ఆప్షన్‌లో "ఆరా మిర్రర్ డిజైన్" తో దీన్ని ఆవిష్కరించింది. రెడ్ మీ 8 ఫోన్ స్నాప్‌డ్రాగన్‌ 439 సాక్‌ ప్రాసెసర్, ఎంఐయుఐ 10.0.1.3 ఆధారిత ఆండ్రాయిడ్ పై 9, 720x1520 పిక్సెల్స్‌రిజల్యూషన్‌ కలిగి ఉంటుంది.

4 జీబీ ర్యామ్‌ విత్ 64జీబీ స్టోరేజ్‌తోపాటు 512జీబీ వరకు విస్తరించుకునే అవకాశం ఉంది. ఇంకా 12+2 ఎంపీ ఏఐ రియల్‌ డ్యుయల్‌ కెమెరా, 8 ఎంపీ ఏఐ సెల్పీకెమెరా కూడా అమర్చారు.

వైర్ లెస్ ఎఫ్ఎం రేడీయో, ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఏఐ ఫేస్ లాక్ వంటి ఫీచర్లు ఉన్నాయి. రెండు వేరియంట్లలో ఈ మొబైల్ లభ్యం అవుతుంది. 3జీబీ ర్యామ్ విత్ 32 జీబీ అంతర్గత మెమొరీ వర్షన్ ధర 7.999 మాత్రమే. 4జీబీ విత్ 64 జీబీ పోన్ ధర రూ.8,999 మాత్రమే. అయితే ప్రారంభం ధర కింద 4జీబీ విత్ 64 జీబీ వేరియంట్ ఫోన్ రూ.7,999లకే లభిస్తుంది. ఇది తొలి 50 లక్షల ఫోన్ల విక్రయాలకు మాత్రమే లభిస్తుంది

Follow Us:
Download App:
  • android
  • ios