Asianet News TeluguAsianet News Telugu

వచ్చే ఏడాది చివరికల్లా మైక్రోసాఫ్ట్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్!

మైక్రోసాఫ్ట్‌ వచ్చే ఏడాది స్మార్ట్‌ఫోన్ ను మార్కెట్లోకి విడుదల చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఫోన్లకు ధీటుగా ఫీచర్లను తీసుకురానుంది

MICROSOFT UNVEILS SURFACE DUO FOLDING SMARTPHONE IN LATEST GAMBLE TO TAKE ON APPLE AND SAMSUNG
Author
New Delhi, First Published Oct 4, 2019, 2:46 PM IST


న్యూఢిల్లీ: స్మార్ట్​ఫోన్​ ప్రపంచంలోకి వచ్చే ఏడాది సర్ఫేస్ సిరీస్​తో డబుల్ స్క్రీన్ ఫోల్డబుల్ ఫోన్లు తీసుకురానున్నట్లు ప్రకటించింది. దిగ్గజ టెక్​ సంస్థ మైక్రోసాప్ట్​. సరికొత్త ల్యాప్​టాప్​లు, ట్యాబ్​లు, వైర్​లెస్ ఇయర్​బడ్స్​ను అమెరికా న్యూయార్క్​లో ఆవిష్కరించిన మైక్రోసాఫ్ట్ తాజాగా ఫోల్డబుల్ ఫోన్ తేనున్నట్లు ప్రకటించింది. 

మెక్రోసాఫ్ట్​ నుంచి రెండు స్క్రీన్ల ఫోల్డబుల్ స్మార్ట్​ఫోన్​లను తీసుకొస్తున్నట్లు తెలిపింది. సర్ఫేస్​ డ్యుయో, సర్ఫేస్ నియో పేరుతో వచ్చే ఏడాది చివరికి ఇవి అందుబాటులోకి వస్తాయని మైక్రోసాఫ్ట్ అధికారులు చెప్పారు. 

ఫోల్డ్ చేసినప్పుడు ఫోన్ల పరిమాణం 5.6 అంగుళాలు. తెరిచినప్పుడు 8.3 అంగుళాలకు పెరుగుతుంది. ఈ డబుల్ స్క్రీన్ ఫోన్​లో ఒకేసారి రెండు యాప్​లను ఓపెన్ చేయవచ్చు. లేదా ఒకే యాప్​నూ వాడవచ్చు. ఆ సమయంలో మరో స్క్రీన్ కీబోర్డ్​గా పనిచేస్తుంది. ఇటీవలే గేలాక్సీ సిరీస్​తో మడత ఫోన్​లను విడుదల చేసింది మొబైల్ దిగ్గజ సంస్థ శామ్‌సంగ్.

ఇప్పుడు వీటికి పోటీగా రెండు తెరల మడత ఫోన్​తో రాబోతోంది మైక్రోసాప్ట్. గతంలో మైక్రోసాఫ్ట్​ నుంచి వచ్చిన స్మార్ట్​ ఫోన్లలో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్​ను వినియోగించారు. కొత్తగా రూపొందిస్తున్న డబుల్ స్క్నీన్ల ఫోన్లలో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్​ను ఉపయోగిస్తున్నారు. 

వినియోగదారులకు అత్యాధునిక సదుపాయలతో అత్యున్నత సాంకేతిక విలువలు గల డివైస్​లను అందుబాటులోకి తేవడమే సంస్థ లక్ష్యమని  మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తెలిపారు. సర్ఫేస్ సిరీస్​ నుంచి కొత్త మోడల్స్​ఈ కార్యక్రమంలో సర్ఫేస్ సిరీస్​ నుంచి మార్కెట్​లోకి సరికొత్త ల్యాప్​టాప్​లు, ట్యాబ్​లు, కంప్యూటర్లను విడుదల చేసింది మైక్రోసాఫ్ట్​. 

ఆపిల్​, అమెజాన్​, గూగుల్​కు పోటీగా వైర్​లెస్​ ఇయర్​ బడ్స్​ను తెచ్చింది. వీటి ప్రారంభ ధర 249 డాలర్లుగా నిర్ణయించారు. గూగుల్ సర్ఫేస్ ల్యాప్​టాప్ -3 13 అంగుళాలు, 15 అంగుళాల వేరియెంట్ల​తో​ అందుబాటులో ఉంది.

వీటి ధర 999 డాలర్లు, 1199 డాలర్లు. సర్ఫేస్ ప్రొ 7, సర్ఫేస్​ ప్రొ ఎక్స్​ ల్యాప్​టాప్​లను అత్యాధునిక ఫీచర్స్​తో మొబైల్​ ఫోన్ అనుభూతి పొందేలా రూపొందించారు. ప్రొ7 ధర 749 డాలర్లు. ప్రొ-ఎక్స్ ధర 999డాలర్లుగా నిర్ణయించారు.

Follow Us:
Download App:
  • android
  • ios