Asianet News TeluguAsianet News Telugu

ఇన్డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో మెయ్‌జు 16ఎక్స్ఎస్: ధరెంతంటే?!

చైనా స్మార్ట్ ఫోన్ సంస్థల్లో ఒక్కటైన మెయ్ జు తాజాగా విపణిలోకి 16ఎక్స్ఎస్ మోడల్ ఫోన్ ను ఆవిష్కరించింది. అద్భుతమైన ఫీచర్లు గల ఈ స్మార్ట్ ఫోన్ రూ.17,150 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానున్నది

Meizu 16Xs with triple rear camera, 4,000 mAh battery launched
Author
New Delhi, First Published Jun 2, 2019, 11:08 AM IST

అధునాతన ఫీచర్లతో చైనాకు చెందిన ప్రముఖ మొబైల్స్ సంస్థ మెయ్‌జు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. 16ఎక్స్‌ఎస్‌ పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను చైనా మార్కెట్‌లో విడుదల చేసింది.  ప్రధానంగా ఈ స్మార్ట్‌ఫోన్‌లో 48మెగాపిక్సెల్‌ కెమెరా సహా ట్రిపుల్‌ రియర్‌ కెమెరాలను రియర్‌ సైడ్‌లో ఏర్పాటు చేసింది. 

ఇంకా భారీ స్క్రీన్‌, ఇన్డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3.5 ఎంఎం ఆడియో జాక్, ఫాస్ట్ ఫేస్ అన్‌లాక్ ఫీచర్లను అందిస్తోంది. అదీ బడ్జెట్‌ ధరలోనే రెండు వేరియంట్లలో అందుబాటులోకి  తేనున్నది. ఈ స్మార్ట్‌ఫోన్‌ రూ.17,150 నుంచి వినియోగదారులకు లభిస్తుంది.  

మెయ్‌జు 16ఎక్స్‌ఎస్ స్మార్ట్ ఫోన్‌లో 6.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది.  1080 x 2232 పిక్సల్స్ రిజల్యూషన్‌తోపాటు ఆండ్రాయిడ్ 9.0 పై, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 675 ప్రాసెసర్ అమర్చారు. 

6 జీబీ ర్యామ్ విత్ 64/128 జీబీ రామ్ స్టోరేజ్ సామర్థ్యం మెయ్‌జు 16ఎక్స్ ఎస్ స్మార్ట్ ఫోన్ సొంతం. ఇక 48+8+5 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాతోపాటు 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ గల 4000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీని అమర్చారు. 

మెయ్‪జు స్మార్ట్ ఫోన్ మిడ్ నైట్ బ్లాక్, బ్లూ, కోరల్ ఆరెంజ్, సిల్క్ వైట్ కలర్ ఆప్షన్లో లభిస్తుంది. చైనా కరెన్సీలో దీని ధర 1698 యువాన్లు. ఈ నెల 10వ తేదీ నుంచి సేల్స్ మొదలవుతాయి. అందుకోసం కస్టమర్లు ప్రీ ఆర్డర్స్ చేసుకోవాల్సి ఉంటుంది. 

ఫోన్ కస్టమర్ల కన్వినెన్స్ కోసం న్యూ ఈపీ2సీ టైప్ సీ హెడ్ సెట్ కూడా అందుబాటులోకి తెచ్చింది. కనెక్టివిటీ ఫ్రంట్‌కు వచ్చేసరికి ‘డ్యూయల్ 4జీ’, ఓల్ట్, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ ట్రాకింగ్ తదితర ఫీచర్లు మెయ్ జు 16ఎక్స్ ఎస్ స్మార్ట్ ఫోన్ సొంతం. కోటింగ్ ప్రొటెక్టివ్ గ్లాస్‌తో స్క్రాచ్ రెసిస్టెంట్ డిస్ ప్లే ఈ ఫోన్ స్పెషాలిటీ.

Follow Us:
Download App:
  • android
  • ios