వందకోట్ల పైమాటే!: జుకర్‌బర్గ్ భద్రత ఖర్చెంతో తెలుసా?

ఫేస్‌బుక్ ఛైర్మన్, సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ భద్రత కోసం ఆ సంస్థ భారీ మొత్తం వెచ్చిస్తోంది. జుకర్‌బర్గ్ భద్రత కోసం 2018లో ఫేస్‌బుక్ దాదాపు 20 మిలియన్ డాలర్లు(అంటే సుమారు రూ.138కోట్లు) ఖర్చు చేసింది. శుక్రవారం ఈ మేరకు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ వెల్లడించింది. 

Mark Zuckerberg's Security Cost Facebook Over Rs 138 Crore in   2018

వాషింగ్టన్: ఫేస్‌బుక్ ఛైర్మన్, సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ భద్రత కోసం ఆ సంస్థ భారీ మొత్తం వెచ్చిస్తోంది. జుకర్‌బర్గ్ భద్రత కోసం 2018లో ఫేస్‌బుక్ దాదాపు 20 మిలియన్ డాలర్లు(అంటే సుమారు రూ.138కోట్లు) ఖర్చు చేసింది. శుక్రవారం ఈ మేరకు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ వెల్లడించింది. 

అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఇది రెండు రేట్లు అధికం కావడం గమనార్హం. ఇది ఇలావుంటే, జుకర్‌బర్గ్ గత మూడేళ్లుగా 1 డాలరు మాత్రమే పారితోషికంగా తీసుకుంటున్నారు. అయితే, ఇతర సదుపాయాల కింద గత సంవత్సరం 22.6 మిలియన్ డాలర్లు కంపెనీ వెచ్చించింది. ఇందులో 90శాతం జుకర్‌బర్గ్, ఆయన కుటుంబం భద్రత కోసమే ఖర్చు చేసినట్లు పేర్కొంది.

జుకర్‌బర్గ్, ఆయన ఫ్యామిలీ భద్రత కోసం 2018లో దాదాపు 20 మిలియన్ డాలర్లు వెచ్చించగా, మిగితా 2.6 మిలియన్ డాలర్లు జుకర్ వ్యక్తిగత అవసరాల కోసం ఖర్చు చేసింది. 2017తో పోలిస్తే ఇది రెండు రేట్లు ఎక్కువగా ఉంది.

గత కొంత కాలంగా కొన్ని ఉగ్రవాద సంస్థల నుంచి బెదిరింపులు రావడంతో సోషల్ మీడియా సంస్థలు తమ సీఈఓల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ..  భారీగా వెచ్చిస్తున్నాయి. ఈ క్రమంలోనే జుకర్ భద్రత కోసం ఫేస్‌బుక్ ఈ స్థాయిలో ఖర్చు చేస్తోంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios