Asianet News TeluguAsianet News Telugu

వన్‌ప్లస్ 6టీ, హానర్‌వ్యూ రేట్లకే ‘ఐ-ఫోన్’.. మేడిన్ ఇండియా మరీ

ఆపిల్ స్మార్ట్ ఫోన్లు ‘ఐ-ఫోన్లు’ భారత మార్కెట్‌లో చౌక ధరకే లభ్యం కానున్నాయి. అధిక సుంకం భారం తప్పించుకునేందుకు భారతదేశంలోనే వాటిని ఉత్పత్తి చేసి.. ఇక్కడి ధరకే విక్రయించాలని ఆపిల్ నిర్ణయించింది.

iPhone 7 now made in India: Is it worth buying over OnePlus 6T and Honor View 20?
Author
New Delhi, First Published Apr 3, 2019, 10:33 AM IST

ఐ-ఫోన్‌ ప్రేమికుల్లారా!! మీకు శుభవార్త. ఐ -ఫోన్లు చైనా దిగ్గజ సంస్థలు వన్ ప్లస్ 6టీ, హానర్ వ్యూ 20 ధరలకే మీకు అందుబాటులోకి రానున్నాయి. అవును ఇది నిజం. ఎందుకంటే భారతదేశంలోనే స్మార్ట్ ఫోన్లను తయారు చేసి, ఇక్కడ ధరకే విక్రయించాలని తద్వారా తన మార్కెట్‌ను కాపాడుకోవాలని టెక్ దిగ్గజం ‘ఆపిల్’తలపోస్తోంది.

స్మార్ట్ ఫోన్ల మార్కెట్ లో తొలుత శామ్‌సంగ్‌దే హవా
ప్రారంభంలో భారతదేశ స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో శామ్‌సంగ్ దే హవా. కానీ తర్వాత ఆ స్థానాన్ని చైనా దిగ్గజం షియోమీ ఆక్రమించాక శామ్‌సంగ్ సంస్థకు తత్వం బోధపడలేదు. ఆగమేఘాల మీద మిడిల్ క్లాస్ కస్టమర్లను ఆకట్టుకునేందుకు మూడు వేరియంట్ ఫోన్లను ఆవిష్కరించింది శామ్ సంగ్... అదే బాటలో ఆపిల్ పయనించాలని నిర్ణయించుకున్నది.

త్వరలో సరసమైన ధరలకే ‘ఐ-ఫోన్’
కనుక త్వరలోనే ఇండియాలో తయారైన మరో ఐఫోన్ సరసమైన ధరలో భారతీయ వినియోగదారులకు  లభ్యం  కానుంది. మేడిన్‌ ఇండియా పోర్ట్‌ఫోలియోలో మరో కొత్త ఫోన్‌ను తీసుకు రానుంది.

ఇందులో భాగంగా బెంగళూరులో తయారీ కేంద్రంలో ఆపిల్‌ ఐపోన్‌ 7ను రూపొందిస్తోంది. ఈ ఫోన్ల అసెంబ్లింగ్‌ ప్రక్రియ మార్చి నెలలో  ప్రారంభమైదని ఆపిల్‌ ఇండియా ప్రతినిధి వెల్లడించారు. 

భవిష్యత్‌లో భారత్‌లో మేడిన్ ఇండియా ఎక్స్‌పాన్షన్
భారతదేశంతో తమ దీర్ఘకాలిక నిబద్ధతను కొనసాగిస్తూ స్థానిక కస్టమర్లకోసం స్థానికంగా ఐఫోన్ 7ని ఉత్పత్తి  చేస్తు‍న్నందుకు గర్వంగా ఉందని ఆపిల్‌ ప్రకటించింది.

భవిష్యత్‌లో మేడిన్‌ ఇండియాను పోర్టిఫోలియోను మరింత విస్తరించనుందని కూడా తెలుస్తోంది. దీంతో  ఐఫోన్‌ 7 బేసిక్‌ మోడల్‌ రూ.39వేలకంటే తక్కువకే అందుబాటులోకి వస్తుందని టెక్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

సుంకాల భారం తగ్గించుకునేందుకు ఇండియాలోనే ఉత్పత్తికి ‘ఆపిల్’ శ్రీకారం
సాధారణ స్మార్ట్ ఫోన్లతో పోలిస్తే ఐఫోన్లు ఖరీదు ఎక్కువే. దీనికి తోడు  విదేశీ స్మార్ట్‌ఫోన్లపై దిగుమతి సుంకాన్ని కూడా కేంద్రం  భారీగా పెంచింది.  ఈ నేపథ్యంలోనే సుంకాల బారీ నుంచి తప్పించుకునేందుకు గత ఏడాది నుంచే భారత్‌లోనే తమ ఐఫోన్ల ఉత్పత్తిని  చేపట్టింది ఆపిల్‌ సంస్థ.

తైవాన్‌ దిగ్గజం విస్ట్రోన్‌ సహకారంతో బెంగళూరులోని ప్లాంట్‌లో ఐఫోన్‌ 6ఎస్‌, ఐఫోన్‌ ఎస్‌ఈలను రూపొందించిన సంగతి తెలిసిందే.

పంచ్‌ హోల్‌ సెల్ఫీ కెమెరాతో నోకియా ఎక్స్‌71
అద్భుతమైన ఫీచర్లతో, చక్కటి బిల్డ్‌ క్వాలిటీతో సరికొత్త నోకియా మోడల్ స్మార్ట్ ఫోన్‌ను ఆవిష్కరించింది. హోల్‌ పంచ్‌ సెల్ఫీ కెమెరా దీని స్పెషాలిటీ. అంతేకాదు, వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరాతో ఈ ఫోన్‌ వస్తున్నది.

దీని ధరను 11,900 తైవాన్‌ డాలర్లుగా నిర్ణయించింది. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.26,000. అయితే, దీనిని భారత్‌లో ఎప్పుడు విడుదల చేస్తారనే దానిపై మాత్రం కంపెనీ ప్రకటించలేదు.

ఇవీ నోకియా ఎక్స్‌71 ప్రత్యేకతలు
6.3 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ డిస్‌ప్లే గల నోకియా ఎక్స్ 71 ఫోన్ వెనుకవైపు 48ప్లస్ 5ప్లస్ 8 మెగాపిక్సెల్‌ మూడు కెమెరాలు కలిగి ఉంటుంది. స్నాప్‌డ్రాగన్‌ 660 ప్రాసెసర్‌తోపాటు  6 జీబీ ర్యామ్ ప్లస్ 128జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ సామర్థ్యం కలిగి ఉంటుంది.  మైక్రోఎస్డీ సాయంతో 256జీబీ వరకూ దీని మెమొరీని పెంచుకునే సామర్థ్యం ఉంది. ఆండ్రాయిడ్‌ 9.0తోపాటు 3500 ఎంఏహెచ్‌ సామర్థ్యం గల బ్యాటరీని అమర్చారు. 

Follow Us:
Download App:
  • android
  • ios