ఆపిల్‌ ఐఫోన్‌11 ఆగయా:జస్ట్ 699 డాలర్లే.. 13 నుంచి బుకింగ్స్

ప్రముఖ టెక్నాలజీ సంస్థ ఆపిల్‌ విపణిలోకి ఐఫోన్ 11 సిరీస్ ఫోన్లను ఆవిష్కరించింది. మరోవైపు ఏడోతరం ఐ ప్యాడ్లనూ ఆవిష్కరించిన ఆపిల్ యాజమాన్యం.. ఆపిల్ టీవీ పేరుతో వీడియో స్ట్రీమింగ్‌ సర్వీస్‌ ప్రారంభించింది. ఆర్కేడ్‌ పేరుతో వీడియో గేమింగ్‌ సర్వీస్‌ కూడా అందుబాటులోకి తెచ్చింది.

iPhone 11 Pro And 11 Pro Max launched with triple cameras

కాలిఫోర్నియా: ప్రపంచమంతా ఉత్కంఠతో ఎదురు చూస్తున్న కొత్త ఐఫోన్లను ఆపిల్‌ విడుదల చేసింది. ఐ ఫోన్‌-11, 11 ప్రో, 11 ప్రో మ్యాక్స్‌ అధునాతన స్మార్ట్‌ఫోన్లను ఆపిల్‌ హెడ్‌క్వార్టర్స్‌ క్యుపర్టినోలోని స్టీవ్‌ జాబ్స్‌ ఆడిటోరియంలో జరిగిన ప్రత్యేక ఈవెంట్‌లో ఆవిష్కరించారు. ఐఫోన్‌ 11 ఆరు రంగుల్లో లభ్యం కానున్నది.

కొత్తగా గ్రీన్, పర్పుల్‌ రెడ్, యెల్లో రంగుల్లో లభించనున్నది. స్పెషల్‌ ఆడియో, డాల్బీ అట్మోస్‌ ఫీచర్, ఇరువైపులా 12 మెగాపిక్సెల్‌ అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరా, 6.1 లిక్విడ్‌ రెటినా డిస్‌ప్లే, స్లో మోషన్‌ సెల్ఫీలు, ఏ13 బయోనిక్‌ చిప్‌ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఐఫోన్‌ 11 ధర 699 డాలర్ల నుంచి మొదలవుతుంది.

మరోపక్క ఆపిల్ ఐదోతరం ఐవాచ్‌ సిరీస్‌ 5ను తీసుకొచ్చింది. మామూలు వాచ్‌ మాదిరిగానే ఎప్పుడు డిస్‌ప్లే కంటికి కనిపించేలా ఐ వాచ్‌ సిరీస్‌ 5ను ఆవిష్కరించింది. ఈ వాచ్‌ల్లో కంపాస్‌ను కూడా అమర్చింది. ధర 399 నుంచి 499 డాలర్లు మధ్య ఉంటుంది. 

రోజువారీ ఎంత వ్యాయామం చేశారు. ఎంత శక్తిని వినియోగించారు, మీ హ్రుదయ స్పందన ఎలా ఉంది, శబ్ద - మహిళల ఆరోగ్యం గురించి ఐవాచ్ ద్వారా తెలుసుకోవచ్చు. అత్యవసర అంతర్జాతీయ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఒక్కసారి చార్జింగ్ చేస్తే రోజంతా పని చేస్తుందిది. 100 శాతం రీ సైక్లింగ్ అల్యూమినియం, ఆర్సెనిక్ రహిత గ్లాస్ తదితరాలు వినియోగించి వాచ్ తయారుచేశారు. .

ఇంకా 10.2 అంగుళాల ఏడో తరం ఐపాడ్, ఐపాడ్ ఓఎస్‌ను ఆపిల్ పరిచయం చేసింది. ప్రస్తుతానికంటే రెండు రెట్లు అధిక సామర్థ్యంతో పని చేస్తుంది. దీని బ్యాటరీ 10 గంటల పాటు పని చేస్తుంది. ఈ నెల 30వ తేదీ నుంచి లభించే ఐ పాడ్ ధర 329 డాలర్ల నుంచి మొదలవుతుంది. 

కొత్తగా వీడియో స్ట్రీమింగ్‌ సర్వీస్‌–ఆపిల్‌ టీవీ, వీడియో గేమింగ్‌ సర్వీస్‌–ఆర్కేడ్‌లను అందుబాటులోకి తెచ్చింది. నెట్‌ఫ్లిక్స్‌ తరహా స్ట్రీమింగ్‌ వీడియో సర్వీస్, ఆపిల్‌ టీవీని ఆపిల్‌ కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. దీన్ని ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ ప్రారంభించారు. ఆపిల్‌ టీవీ ద్వారా ఓఫ్రా విన్‌ఫ్రే, జెన్నిఫర్‌ అనిస్టిన్‌ తదితర స్టార్స్‌ నటించిన ఒరిజినల్‌ ప్రోగ్రామ్స్‌ను ప్రసారం చేస్తుంది. 


వంద దేశాల్లో ఈ సర్వీస్‌ నవంబర్‌ ఒకటో తేదీ నుంచి ఆపిల్ - ఐఫోన్ కస్టమర్లకు నుంచి లభించనున్నది. నెలకు సబ్‌స్క్రిప్షన్‌ 4.99 డాలర్లు. కొత్త ఐఫోన్‌లు, ఐపాడ్‌లు కొన్నవాళ్లకు ఏడాది పాటు ఈ సర్వీస్‌ను ఉచితంగా అందిస్తారు.  

ఆపిల్‌ కంపెనీ వీడియో గేమింగ్‌ సర్వీస్‌–ఆర్కేడ్‌ను అందుబాటులోకి తెచ్చింది. ధర 4.99 డాలర్లు ఇది ఈ నెల 19 నుంచి అందుబాటులోకి వస్తుంది. కొత్తగా వంద గేమ్స్‌ను అందిస్తోంది. మన అన్నపూర్ణ స్టూడియోస్‌ సంస్థ కూడా కొన్ని గేమ్స్‌ను అందిస్తుండటం విశేషం.  

ఐఫోన్ల అమ్మకాలు పడిపోవడంతో ఇప్పుడు ఆపిల్‌ కంపెనీ సర్వీసులపై దృష్టి పెట్టిందని నిపుణులు అంటున్నారు. గత ఏడాది వరుసగా మూడు త్రైమాసికాల్లో ఐఫోన్‌ల అమ్మకాలు పడిపోయాయి. గతంలో కొత్తది రాగానే పాత ఫోన్‌ను పక్కనపెట్టి, కొత్త ఫోన్‌ కోసం పరుగులు పెట్టేవాళ్లు. ఇప్పుడు సీన్‌ మారింది. 

కనీసం ఐఫోన్‌ యూజర్లలో చాలా మంది మూడేళ్లు దాటిన తర్వాతే కొత్త ఐఫోన్‌ను కొనుగోలు చేస్తున్నారని నిపుణులంటున్నారు. డివైస్‌ల అమ్మకాలు పడిపోతుండటంతో ఆపిల్‌ మ్యూజిక్, ఐక్లౌడ్, ఆపిల్‌ టీవీ వంటి సర్వీసులపై ఆపిల్‌ కంపెనీ దృష్టిని ఎక్కువగా పెడుతోంది. 

ఐఫోన్ 11 వేరియంట్ ఫోన్ 6.1 అంగుళాల లిక్విడ్ రెటినా డిస్ ప్లే కలిగి ఉంటుంది. బ్లాక్, గ్రీన్, ఎల్లో, పర్పుల్, వైట్, రెడ్ రంగుల్లో లభిస్తుంది. బ్యాకప్ రెండు కెమెరాలు (12 ఎంపీ వైడ్- ఆల్ట్రా వైడ్, 4కే స్పష్టత, సినిమాటిక్ వీడియో. ఇప్పటివరకు ఐ ఫోన్ లో లేని అత్యధిక స్పష్టమైన వీడియోలు తీయొచ్చు. నైడ్ మోడ్) ఉంటాయి.

ఇంకా ఐ ఫోన్ 11 ఫోన్ డాల్బీ ఆల్మోస్ శబ్దం, స్లో మోషన్ సెల్ఫీస్, మరే ఇతర స్మార్ ఫోన్ లో లేని అత్యధిక స్పీడ్ తో పనిచేసే ఏ 13 బయోనిక్ సీపీయూ, అత్యంత వేగంగా పనిచేసే జీపీయూ, ఐ ఫోన్ టెన్ఆర్ కంటే మరో గంటల అదనంగా పనిచేసే బ్యాటరీతోపాటు శరవేంగా ముఖాన్ని గుర్తించే కెమెరా తదితర ఫీచర్లు ఉన్నాయి. 

5.8 అంగుళాల సూపర్ రెటీనా డిస్ ప్లే తోపాటు మిడ్ నైట్ గ్రీన్, స్పేస్ గ్రే, సిల్వర్ వైట్, గోల్డ్ రంగుల్లో ఫోన్ లభిస్తుంది. బ్యాకప్ సింగిల్ పీస్ గ్లాస్, స్టెయిన్ లెస్ స్టీల్ తో రూపొందించారు. బ్యాకప్ మూడు కెమెరాలు కలిగి ఉంటుంది. డాల్బీ ఆటోమోస్ శబ్దం, సెకన్‌కు లక్ష కోట్ల ఆపరేషన్లు జరిపే సీపీయూ, 40 శాతం తక్కువ విద్యుత్ వినియోగం, ఐ ఫోన్ టెన్ఎస్ కంటే నాలుగు గంటలు అదనంగా బ్యాటరీ పని చేస్తుంది. 

ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్ ఫోన్ 6.5 అంగుళాల డిస్ ప్లే కలిగి ఉంటుంది. ఐ ఫోన్ టెన్ఎస్ మ్యాక్స్ కంటే ఐదు గంటలు అదనంగా వచ్చే బ్యాటరీ, బ్యాకప్ మూడు కెమెరాలతో (12 వైడ్ ఆల్ట్రా వైడ్, టెలిఫోటో) ఒకే సమయంలో మూడు భిన్న రకాలుగా ఒకే ఫోటో తీయొచ్చు. కను రెప్పల మధ్య చోటును కూడా స్పష్టంగా చూపే సామర్థ్యం దీని సొంతం

ఐఫోన్ 11 ఫోన్ లో 65 జీబీ వేరియంట్ ధర 699 డాలర్లు కాగా, ఐ ఫోన్ 11 ఫ్రో ఫోన్ 128 జీబీ ర్యామ్ వేరియంట్ ఫోన్ 999 డాలర్లకు లభిస్తుంది. ఐ ఫోన్ 11 ప్రో మ్యాక్స్ ఫోన్ 128 జీబీ ర్యామ్ వేరియంట్ ఫోన్ 1099 డాలర్లకు వినియోగదారులకు లభిస్తుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios