Asianet News TeluguAsianet News Telugu

డేటా యూసేజ్‌లో మనమే ఫస్ట్.. డిజిటల్‌లో పట్టుకు అమెజాన్ పే పాట్లు

స్మార్ట్ ఫోన్లలో ఎక్కువ డేటా వాడుతున్నది ఇండియన్లే. అత్యధిక జనాభా గల చైనాలో సగటున 7.1 జీబీ రాం వాడుతుంటే ఇండియన్లు 9.8 జీబీ డేటా వాడుతున్నారని ఎరిక్సన్ మొబిలిటీ జూన్ నివేదిక వెల్లడించింది.

Indian smartphone users consume maximum data in the world at 9.8 GB per month: Ericsson
Author
New Delhi, First Published Jun 23, 2019, 3:41 PM IST

భారత్‌లో స్మార్ట్‌ఫోన్లు వినియోగిస్తున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. స్కూల్‌ పిల్లాడి నుంచి వృద్ధుల వరకూ చేతిలో ఫోన్‌ లేనిదే రోజు గడవదంటే అతిశయోక్తి కాదు. దీంతోపాటు వారు వినియోగిస్తున్న మొబైల్‌ డేటా కూడా పెరుగుతోంది. 

గతేడాది నాటికి ఒక్కొక్కరూ 9.8జీబీ వాడకం
అది కూడా ప్రపంచంలోనే అత్యధికంగా మొబైల్‌ డేటాను భారత్‌లో స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులు వినియోగిస్తున్నారని ‘ఎరిక్సన్‌ మొబిలిటీ’ నివేదిక 2019 జూన్‌ పేర్కొన్నది.

నెలలో సరాసరిగా అత్యధిక డేటా వినియోగంలో ప్రపంచంలోనే భారత్‌ తొలిస్థానంలో నిలిచింది. 2018 చివరి నాటికి దాదాపుగా 9.8 బీబీ డేటాను భారత్‌లో ప్రతి నెలా ఒక్కో స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారుడు ఖర్చు చేస్తున్నారు.

చైనాలో సగటు వాడం 7.1 జీబీ రామ్ డేటా
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనాలో ప్రతి నెలా సరాసరి డేటా వినియోగం 7.1 జీబీ కాగా ఉత్తర అమెరికాలో ఇది 7 జీబీగా నమోదైంది. భారత్‌లో జియో రంగ ప్రవేశంతో డేటా వినియోగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని ఎరిక్సన్ మొబిలిటీ నివేదిక తెలిపింది. 

తక్కువ ధరకే డేటా ప్యాకేజీ లభ్యత
రిలయన్స్ జియో రంగ ప్రవేశంతో కస్టమర్లకు తక్కువ ధరకే డేటా ప్యాకేజీలు అందుబాటులోకి వచ్చాయి. దీనికి తోడు అన్‌లిమిటెడ్‌ ఆఫర్లతో, ఆకర్షణీయమైన ప్లాన్లతో డేటా వినియోగం కూడా భారీగా పెరిగింది.

2018లో భారత్‌లో జీఎస్ఎం/ ఎడ్జ్ సబ్‌స్క్రిప్షన్లు 47 శాతం ఉండగా.. ఎల్టీఈ వాటా 38 శాతం ఉందని ఎరిక్సన్‌ తన నివేదికలో తెలిపింది. 2024 చివరి నాటికి ఎల్‌టీఈ శాతం 82 శాతానికి చేరుకుంటుందని అంచనా వేసింది. 2024 నాటికి స్మార్ట్ ఫోన్ల వాడకం దారుల సంఖ్య 110 కోట్లకు చేరుతుంది.

అమెజాన్‌ పే మరింత బలోపేతం
మరోవైపు దేశీయంగా డిజిటల్ చెల్లింపుల్లో తన స్థానాన్ని బలోపేతం చేసుకునేందుకు  ఆన్‌లైన్‌ దిగ్గజం అమెజాన్‌ రూ.450  కోట్లను పెట్టుబడిగా పెట్టనుంది. భారత్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్‌ పేమెంట్స్ మార్కెట్‌లో తన వాటా పెంచుకోవడానికి ఈ నిధులు ఉపకరిస్తాయని భావిస్తోంది.

వాల్‌మార్ట్‌కు చెందిన ఫోన్‌పే, అలీబాబా మద్దతున్న పేటీఎం, గూగుల్‌కు చెందిన ‘గూగుల్‌పే’ ఇప్పటికే ఈ మార్కెట్‌లో గణనీయమైన పోటీ ఇస్తున్నాయి. 

సింగపూర్, మారిషస్ అమెజాన్ డాట్ కామ్ నుంచి నిధులు ఇలా
సింగపూర్‌లోని అమెజాన్‌ కార్పొరేట్‌ నుంచి, మారిషస్‌లోని అమెజాన్‌.కామ్‌ నుంచి ఈ నిధులు వస్తాయి. ఈ విషయాన్ని అమెజాన్‌ రెగ్యూలేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. ఇప్పటికే అమెజాన్‌ 45 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించి ఈ నిధులను సేకరిస్తోంది.

ఇప్పటికే జూన్‌లో భారత్‌లో రూ.2,800 కోట్ల మేరకు పెట్టుబడులు పెట్టింది. ఈ నేపథ్యంలోనే పేమెంట్‌ సర్వీసుల విభాగాన్ని కూడా బలోపేతం చేస్తోంది.  భారత్‌లో 2023 నాటికి డిజిటల్‌ చెల్లింపుల మార్కెట్‌ విలువ ట్రిలియన్‌ డాలర్లను దాటుతుందనే క్రెడిట్‌ సూ పేర్కొంది. 

Follow Us:
Download App:
  • android
  • ios