ఇన్నోవేషన్ ‘కీ’: మూడేళ్లలో క్లౌడ్ మార్కెట్ మూడింతలు

 బిగ్‌ డేటా, అనలిటిక్స్‌, కృత్రిమమేధస్సు, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ వినియోగం పెరుగుతున్నందున, దేశీయ క్లౌడ్‌ విపణి 2022 నాటికి మూడింతలై 7.1 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.49వేల కోట్ల) స్థాయికి చేరుతుందని నాస్కామ్‌ నివేదిక అంచనా వేసింది.

India's cloud market to cross $7 bn by 2022: Nasscom

బిగ్‌ డేటా, అనలిటిక్స్‌, కృత్రిమమేధస్సు, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ వినియోగం పెరుగుతున్నందున, దేశీయ క్లౌడ్‌ విపణి 2022 నాటికి మూడింతలై 7.1 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.49వేల కోట్ల) స్థాయికి చేరుతుందని నాస్కామ్‌ నివేదిక అంచనా వేసింది.

‘క్లౌడ్-తదుపరి వృద్ధి తరంగం’ పేరిట గూగుల్‌ క్లౌడ్‌, డెలాయిట్‌ టచ్‌ తోమత్సు ఇండియా ఎల్‌ఎల్‌పీలతో కలిసి నాస్కామ్‌ ఈ నివేదిక తయారు చేసింది. అంతర్జాతీయంగా కూడా క్లౌడ్‌ విపణి 16.5 శాతం వార్షిక వృద్ధితో 2022కు 345 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.23,80,500 కోట్ల)కు చేరొచ్చని పేర్కొంది.

క్లౌడ్‌ విపణి శరవేగంగా వృద్ధి చెందేందుకు వినూత్నత కీలకం అవుతుందని నాస్కామ్‌ అధ్యక్షురాలు దేవ్‌యాని ఘోష్‌ పేర్కొన్నారు. సేవల వ్యయం తగ్గించాలంటే క్లౌడ్‌ తప్పదన్నారు. 

గతేడాది దేశీయంగా మొత్తం ఐటీ వ్యయాల్లో క్లౌడ్‌ వాటా కేవలం 6 శాతమేనని నాస్కామ్ అంచనా వేసింది. మౌలిక సదుపాయాలను సేవల రూపంలో (ఐఏఏఎస్‌) పొందేందుకు 2018లో 100 కోట్ల డాలర్లు (సుమారు రూ.6,900 కోట్లు) వ్యయం చేశాయి.

ఏడాదికి 25 శాతం వార్షిక వృద్ధితో 2022 నాటికి ఇది 230-240 కోట్ల డాలర్లకు చేరొచ్చునని భావిస్తున్నది. దేశీయంగా ఐఏఏఎస్‌ వృద్ధికి మెరుగైన మౌలిక వసతులు, ఆర్థిక ప్రయోజనాలు, వినూత్నత పెరగడం, స్టార్టప్‌ల ప్రారంభం, డేటా ఇంటర్‌లింక్ కారణం అయ్యాయి. సాఫ్ట్‌వేర్‌ సేవల (ఎస్‌ఏఏఎస్‌) విపణి కూడా 36 శాతం వార్షిక వృద్ధి సాధిస్తోంది. 

ఇది 2022 నాటికి ఇదీ 330-340 కోట్ల డాలర్లకు చేరొచ్చునని నాస్కామ్ అధ్యక్షురాలు దేవ్‌యానీ ఘోష్ తెలిపారు.  ప్రపంచవ్యాప్తంగా క్లౌడ్‌ సేవల కోసం వెచ్చించే మొత్తం ఏటేటా 16.5 శాతం సంచిత వృద్ధి (సీఏజీఆర్‌)తో 2022 నాటికి 34,500 కోట్ల డాలర్లకు చేరుకోవచ్చని అంచనా వేశామన్నారు. 

మెరుగైన మౌలిక వసతులు, ఆర్థిక ప్రయోజనాలు, పుంజుకున్న ఆవిష్కరణలతోపాటు స్టార్టప్‌లు, నెట్‌వర్క్‌కు సానుకూల వాతావరణం వంటి అంశాలు దేశంలో ఐఏఏఎస్‌ వ్యయ వృద్ధికి దోహద పడనున్నాయని దేవ్ యానీ ఘోష్ చెప్పారు.

దేశీయంగా క్లౌడ్‌ వినియోగం పెంచాలంటే ప్రభుత్వం నిర్దేశిత సమయానికి కచ్చిత లక్ష్యాలను ప్రకటించాలని సూచించారు. ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యుత్ సరఫరా, భూ నిబంధనల్లో స్థిరత్వం, అధికవేగం డేటా కనెక్షన్లు ఉండాలని నాస్కామ్‌ అధ్యక్షురాలు దేవ్‌యాని ఘోష్‌ పేర్కొన్నారు.

తక్కువ వేతనాలకే ఉద్యోగులు లభిస్తుండటం, విరివిగా నిపుణుల లభ్యత, సాఫ్ట్‌వేర్‌ సేవల విక్రయాలకు సంబంధించి పరిణతి చెందిన వాతావరణం, కొత్త సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తుల అభివృద్ధిలో కృత్రిమ మేధ, మెషిన్‌ లెర్నింగ్‌ వంటి ఆధునిక టెక్నాలజీల వినియోగం ఎస్‌ఏఏస్‌ మార్కెట్‌ వృద్ధికి తోడ్పడనున్నాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios