ఐఫోన్ అడ్మైరింగ్.. ఎకో ఫ్రెండ్లీ: హువావే సీఈఓ రెన్ జెంగ్ ఫీ అడ్మైరింగ్ కామెంట్స్

అమెరికా టెక్ దిగ్గజం ఆపిల్ తయారు చేస్తున్న ఐఫోన్లు ఎకో ఫ్రెండ్లీగా ఉంటాయట. ఈ విషయాన్ని చైనా స్మార్ట్ ఫోన్ల దిగ్గజం హువావే సీఈఓ రెన్ జెంగ్ ఫీ చేశారు. అందునా అమెరికా నిషేధాజ్నలు ఎదుర్కొంటున్న వేళ ఆయన వ్యాఖ్యలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. 

Huawei CEO Ren Zhengfei Admires iPhone Ecosystem, Admits Buying Them for Family Members

 

బీజింగ్: అమెరికా నిషేధం.. అమెరికా కేంద్రంగా పని చేస్తున్న టెక్నాలజీ, ఇతర సంస్థల ఆంక్షలతో చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ‘హువావే’ పలు సవాళ్లను ఎదుర్కొంటున్నది. అమెరికాకు ప్రతీకారం తీర్చుకునేందుకు చైనా కూడా సిద్ధమవుతోంది. అమెరికా కేంద్రంగా ఉత్పత్తి చేస్తున్న ఆపిల్ సంస్థ ఉత్పత్తులను నిషేధించే అంశాన్ని చైనా పరిశీలిస్తోంది. 

ఇటువంటి దశలో హువావే సీఈఓ రెన్ జెంగ్ ఫీ ఇటీవల మీడియాతో చేసిన వ్యాఖ్యలు అడ్మైరింగ్‌గా ఉన్నాయి. తన కుటుంబ సభ్యులు విదేశాలకు వెళ్లినప్పుడు వాడుకునేందుకు వీలుగా ‘ఐఫోన్లు’ కొనుక్కోవాలని సలహా ఇచ్చానని రెన్ జెంగ్ ఫీ ఫేర్కొన్నారు. ఐఫోన్ ఎకో సిస్టమ్ కు అనుగునంగా ఉంటుందని కూడా ఆయన చెప్పారు. తన హువావే బ్రాండ్ ఫోన్లన్నా తనకు ప్రేమేనన్నారు. హువావే ఫోన్లను అబిమానించడం రాజద్రోహం కాదని చమత్కరించారు. తాను సంకుచితంగా ఆలోచించబోనని రెన్ జెంగ్ ఫీ స్పష్టం చేశారు. కానీ రెన్ జెంగ్ ఫీ ఇలా ఐ ఫోన్ పట్ల అడ్మైరింగ్ గా మాట్లాటం ఆశ్చర్యంగా ఉంది. 

అందునా ‘స్విచ్ టు హువావే’ అనే నినాదాలు చైనాలోని సోషల్ మీడియా వేదికలపై ఊపందుకుంటున్న వేళ.. ఆపిల్ ఐఫోన్లతోపాటు విదేశీ సంస్థల ఫోన్ట్లను బహిష్కరించాలని పిలుపునిస్తున్న సమయంలో రెన్ జెంగ్ ఫీ చేసిన వ్యాఖ్య ఆసక్తికరంగా మారింది. హువావే చీఫ్ ఎగ్జిక్యూటివ్ తన ప్రిఫరెన్సెస్ వెల్లడించడం ఇదే మొదటిసారి కాదు.. కెనడాలో గతేడాది డిసెంబర్ నెలలో అరెస్టయిన రెన్ జెంగ్ ఫీ కూతురు, హువావే చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ మెంగ్ వాంగ్ ఝూ వద్ద ఐఫోన్ 7 ప్లస్, మాక్ బుక్ ఎయిర్, ఐపాడ్ ప్రో ఉండటం గమనార్హం. 

 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios