Asianet News TeluguAsianet News Telugu

వ్యక్తిగత గోప్యత మరింత పటిష్ఠం చేసిన సెర్చింజిన్!

వ్యక్తిగత గోప్యతను కాపాడేందుకు గూగుల్ కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఖాతారుదల ప్రైవసీ రక్షణకు పెద్దపీట వేసింది.

Google simplifies privacy, security for users
Author
New Delhi, First Published Oct 4, 2019, 2:39 PM IST

న్యూఢిల్లీ: ప్రముఖ టెక్​ దిగ్గజం గూగుల్ యూట్యూబ్​, గూగుల్​ మ్యాప్స్​ ఖాతాదారుల వ్యక్తిగత గోప్యత కోసం మరిన్ని ఫీచర్లు తీసుకు వచ్చింది. యూట్యూబ్​లో సర్చ్​, వ్యూవ్స్​ హిస్టరీ, వాయిస్ అసిస్టెంట్ హిస్టరీ తొలగింపు వసతి అందుబాటులోకి తెచ్చింది గూగుల్. 

త్వరలోనే మ్యాప్స్​లోనూ ఇన్​కాగ్నిటో ఫీచర్​ను ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొంది. ఇంటర్నెట్‌లో తమ వినియోగదారుల వ్యక్తిగత గోప్యతను మరింత పటిష్ఠం చేయడానికి కొత్త ఫీచర్లు తీసుకొచ్చింది ప్రముఖ టెక్​ దిగ్గజం గూగుల్​.

భద్రతా పరంగా వినియోగదారుల నుంచి వస్తున్న ఫిర్యాదుల మేరకు గూగుల్, ఫేస్​బుక్ వంటి సంస్థలు ఈ ఏడాది సరికొత్త సెక్యూరిటీ ఫీచర్లను ప్రకటించాయి. 

భద్రతా ప్రమాణాలు పెంచే విషయంలో గూగుల్​ ఇప్పటికే పలు ఫీచర్లు అందుబాటులోకి తెచ్చింది. యూట్యూబ్​లో నిర్దిష్ట సమయం వరకు వీడియోల హిస్టరీని డిలీట్​ చేసే వీలును వినియోగదారులకు కల్పిస్తోంది గూగుల్​. 

గూగుల్ అసిస్టెంట్​కు వినియోగదారులు ఇచ్చిన వాయిస్​ కమాండ్లనూ తొలగించే వీలు కల్పిస్తున్నట్లు పేర్కొంది​.  గూగుల్ మ్యాప్స్​లో ఇన్​కాగ్నిటో ఫీచర్​ను అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది. 

దీని ద్వారా యూజర్లు తిరిగే ప్రాంతాలేవీ.. మ్యాప్స్​లో నమోదు కావు. ఈ నెలాఖరుకు ఆండ్రాయిడ్​ యూజర్లకు ఈ ఫీచర్​ అందుబాటులోకి రానుంది. ఐఓఎస్​ యూజర్లకు ఈ వసతి ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందనేది స్పష్టతనివ్వలేదు గూగుల్.

Follow Us:
Download App:
  • android
  • ios