ఎవరైనా కొత్త ప్రాంతానికి, జిల్లాకు, రాష్ట్రానికి వెళాలంటే ఓ కొత్త ప్రాంతానికి వెళ్లాలంటే నానా హైరానా పడేవారు. దారి తెలియక పోతే  తిప్పలు పడాల్సిందే. గూగుల్‌ మ్యాప్స్‌ పుణ్యమా అని ఆ బాధ తప్పింది. అంతగా వినియోగదారులను చేరువైన గూగుల్‌.. మరిన్ని ఫీచర్లను జోడిస్తూ ముందుకు వెళుతోంది. 

ఇప్పుడు మరో ఉపయోగకరమైన ఫీచర్‌ను గూగుల్‌ మ్యాప్స్‌లో అందుబాటులోకి తీసుకు వచ్చింది. అదే స్పీడో మీటర్‌ ఫీచర్. ఇప్పటి వరకు రూట్‌ తెలుసుకోవడానికి మాత్రమే పరిమితమైన గూగుల్‌ మ్యాప్స్‌ ఇకపై మనం వాహనంపై వెళ్లే వేగం కూడా చూపనున్నది. ఇది ఇంకా అందరికీ అందుబాటులోకి రాలేదు.

అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్, యూరప్‌, దక్షిణ అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో కొందరు యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది. భారత్‌లో కూడా పరిమిత సంఖ్యలో యూజర్లకు ఈ ఫీచర్‌ అందుబాటులో వచ్చినట్లు వార్తలు వస్తున్నా, ఇంకా దీనిపై స్పష్టత రాలేదు.

త్వరలో గూగుల్‌లో అందరికీ ఈ ఫీచర్‌ అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్‌ అందుబాటులోకి వస్తే మీరు వాహనం నడిపేటప్పుడు ఎంత వేగంతో వెళుతున్నారో చూడొచ్చు. అంతేకాదు నిర్దేశించిన వేగం దాటిన తర్వాత మీకు హెచ్చరికలు కూడా గూగుల్‌ మ్యాప్స్‌ జారీ చేస్తుంది.

గూగుల్‌ మ్యాప్స్‌ యాప్‌లో సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. అందులో నేవిగేషన్‌ సెట్టింగ్స్‌లోకి వెళితే డ్రైవింగ్‌ ఆప్షన్‌ దగ్గర స్పీడో మీటర్‌ సెట్టింగ్స్‌ కనిపిస్తాయి. దాన్ని ఎనేబుల్‌ చేసుకుంటే డిస్‌ప్లేపై స్పీడో మీటర్‌ను పొందొచ్చు. 

గూగుల్ మ్యాప్స్‌లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చిన వారికి మాత్రమే తెరపై కనిపిస్తాయి. తెలుసుకోవాలనుకుంటే మీరు ఒకసారి చెక్ చేస్తే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఇప్పటికే బస్సులు, రైళ్లు, ఆటో రిక్షాలు సహా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ మూడు నూతన ఫీచర్లు గూగుల్ మ్యాప్స్‌లో జత కలిశాయి. 

గూగుల్ డిజిటల్ మ్యాప్స్ ప్లాట్‌ఫామ్‌లో ఆన్ - స్క్రీన్ స్పీడో మీటర్‌ యాప్‌లో కనిపిస్తుంది. ఈ యాప్ అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బెల్జియం, బ్రెజిల్, కెనడా, చెక్ రిపబ్లిక్, ఫిన్లాండ్, జర్మనీ, ఇండియా, నెదర్లాండ్స్, పోలండ్, పోర్చుగల్, స్వీడన్, తైవాన్ తదితర దేశాల్లో రోల్ ఔట్ చేస్తోంది.