టెకీలకు తీపికబురు.. త్వరలో భారీగా రిక్రూట్‌మెంట్లు

ఐటీ ఉద్యోగులకు తీపి కబురు. ఐటీ రంగంలో గత కొన్ని రోజులుగా నెలకొని ఉన్న స్లోడౌన్ క్రమంగా కనుమరుగవుతుండటంతో మీళ్లీ నియామకాలు ఊపందుకున్నాయి

goldman sachs planning to increase employees in india

ఐటీ ఉద్యోగులకు తీపి కబురు. ఐటీ రంగంలో గత కొన్ని రోజులుగా నెలకొని ఉన్న స్లోడౌన్ క్రమంగా కనుమరుగవుతుండటంతో మీళ్లీ నియామకాలు ఊపందుకున్నాయి. పలు కంపెనీలు సిబ్బంది సంఖ్యను భారీగా పెంచుకునేందుకు రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లు చేపడుతున్నాయి.

ఈ క్రమంలో బహుళజాతి ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ గోల్డ్‌మెన్ శాక్స్ బెంగళూరు సెంటర్‌లో ఇంజనీరింగ్ హెడ్‌ కౌంట్‌ను భారీగా పెంచుకోవాలని కసరత్తు సాగిస్తోంది. భారత్‌లో 290 మంది ఉద్యోగులతో 2004లో కార్యాలయాలను నెలకొల్పిన గోల్డ్‌మాన్‌కు ప్రస్తుతం 5000 మంది ఉద్యోగులు ఉన్నారు.

కాగా, భారత్‌లో ఏటా 24 శాతం మేర విస్తరిస్తోందని, గత ఐదేళ్లలో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ 20 శాతం పెరిగాయని ఆ సంస్ధ ఇండియా హెడ్ సంతాని తెలిపారు. వ్యాపారాభివృద్ధికి అనుగుణంగా తాము హైరింగ్ ప్రక్రియను చేపడతామని వెల్లడించారు.

బెంగళూరు సెంటర్ తమకు భారత్‌లో కీలకమని, ఇక్కడ కేవలం ఇంజనీరింగ్ కాకుండా ఆటోమేషన్, డిజిటైజేషన్ బిజినెస్‌ను కూడా అందిస్తున్నామని తెలిపారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios