‘బిగ్ బిలియన్ డేస్’ సేల్ ముగిసి మూడు రోజులైనా కాకముందే ఈ-కామర్స్ రిటైల్ మేజర్ ఫ్లిప్‌కార్ట్ మరో సేల్‌కు సిద్ధమైంది. ‘బిగ్ దీపావళి సేల్’ పేరుతో ఈ నెల 12 నుంచి 16 వరకు ఐదు రోజులు మరోసారి భారీ ఆఫర్లతో ముందుకొస్తోంది.

స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు, వేరబుల్స్, టీవీలు, హోమ్ అప్లయెన్సెస్ తదితర ఉత్పత్తులపై ఆఫర్ల వర్షం కురిపించింది. ‘బిగ్ బిలియన్ డేస్ సేల్‌‌’కు మాదిరిగానే ‘బిగ్ దీపావళి’ సేల్‌లో కూడా ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు తొలుత అందుబాటులోకి వస్తుంది. 

అక్టోబర్ 11న రాత్రి 8 గంటల నుంచే ఫ్లిప్ కార్ట్ ప్లస్ సభ్యులకు ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. స్టేట్‌బ్యాంక్‌తో జతకట్టిన ఫ్లిప్‌కార్ట్ క్రెడిట్‌కార్ట్ యూజర్లకు 10 శాతం తక్షణ రాయితీ ఆఫర్ చేస్తోంది. నోకాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు, బండిల్డ్ ఎక్స్‌చేంజ్ ఆఫర్లు అందిస్తోంది.
 
రెడ్‌మీ నోట్ 7 ప్రొ, రెడ్‌మీ నోట్ 7ఎస్, రియల్‌మీ 5, వివో జడ్1 ప్రొ, రియల్‌మీ సీ2 వంటి స్మార్ట్‌ఫోన్లపై డీల్స్ ప్రకటించనుంది. టీవీలు, అప్లయెన్సెస్ కేటగిరీలో 50 వేలకు పైగా ఉత్పత్తులపై 75 శాతం వరకు రాయితీ ఇవ్వనున్నట్టు తెలిపింది. 

ఎలక్ట్రానిక్స్ కేటగిరీలో టాప్ సెల్లింగ్ ప్రొడక్టులపై 90 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. వీటిలో హెడ్‌ఫోన్లు, స్పీకర్లు, ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, స్మార్ట్‌వాచ్‌లు, ఇతర ఉత్పత్తులు ఉన్నాయి. ఎస్బీఐ కార్డు హోల్డర్లపై 10 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. కొన్ని ఉత్పత్తులపై బైబ్యాక్ గ్యారంటీ ఆఫర్ కూడా ఉంది.

‘ధమాకా డీల్స్’ పేరుతో సేల్ మధ్యలో ఫ్లాష్‌సేల్ కూడా నిర్వహించనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఇందులో భాగంగా మొబైల్ ఫోన్లు, టీవీలు, ఎలక్ట్రానిక్స్ అదనపు డిస్కౌంట్ ఇవ్వనుంది. అర్ధరాత్రి 12 గంటలు, ఉదయం 8 గంటలు, సాయంత్రం 4 గంటలకు ఫ్లాష్‌సేల్ నిర్వహించనుంది.