న్యూఢిల్లీ: వాల్‌మార్ట్ అనుబంధ ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ బిలియన్ డేస్’తో డిస్కౌంట్లతో మరోమారు వినియోగదారుల ముందుకు వచ్చింది. సెప్టెంబర్ 29వ తేదీ నుంచి అక్టోబర్ నాలుగో తేదీ వరకు ఆరు రోజుల పాటు ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్స్ సేల్స్ నిర్వహిస్తోంది. అన్ని క్యాటగిరీల ఉత్పత్తులపై ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్లు అందిస్తోంది.

మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతర యాక్సెసరీస్‌పై డిస్కౌంట్లు ప్రారంభమైన తరువాత రోజు అంటే సెప్టెంబర్ 30వ తేదీన సదరు డిస్కౌంట్లను ప్రకటించనున్నది. యాక్సిస్ బ్యాంక్ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డులతోపాటు ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులపై 10 శాతయం డిస్కౌంట్ అందిస్తోంది. 

కార్డు లెస్ క్రెడిట్, ఫ్లిప్ కార్ట్ పే లెటర్‌తోపాటు ప్రముఖ బ్యాంకుల క్రెడిట్, డెబిట్ కార్డులపై ‘నో కాస్ట్’ ఈఎంఐని ఫ్లిప్ కార్ట్ అందించనున్నది. ముఖ్యంగా ఫోన్లు, గాడ్జెట్లు, టీవీలు, గృహోపకరణాలు, ఫర్నీచర్​ వంటివి ప్రత్యేక తగ్గింపుతో విక్రయించనున్నట్లు ఫ్లిప్​కార్ట్​ వెల్లడించింది. 

ఇక ఫ్లిప్ కార్ట్ + వినియోగదారులు ‘బిగ్ బిలియన్ డేస్’ ఆఫర్లను నాలుగు గంటల ముందే పొందొచ్చు. ఈ సేల్‌లో ఉత్పత్తులు కొనుగోలు చేసే వారు, వాటితోపాటు ఇన్సూరెన్స్ ప్లాన్లను కూడా కొనుగోలు చేసే సౌకర్యాన్ని తొలిసారి ఫ్లిప్ కార్ట్ అందిస్తోంది. 

సేల్స్ సమయంలో గంట గంటకు మారే డీల్స్, లైట్నింగ్ డీల్స్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. సేల్ సందర్భంగా గేమ్స్, కాంటెస్ట్‌లు నిర్వహించి బహుమతుల రూపంలో సుమారు రూ. 100 కోట్లు అందించనున్నది.

కొన్ని వస్తువుల కొనుగోలుపై నాలుగు రెట్ల సూపర్ కాయిన్లను కూడా అందిస్తామని ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. ఈ సారి సేల్స్‌లో తొలిసారి హ్యాండీక్రాఫ్ట్స్, చేనేత కళాకారులు కూడా తమ ఉత్పత్తులను తన వేదిక నుంచి విక్రయించే సదుపాయాన్ని ఫ్లిప్ కార్ట్ అందుబాటులోకి తీసుకొస్తున్నది. 

బిగ్ బిలియన్ డే సేల్స్‌లో భాగంగా 200 కేటగిరీల్లో పది వేలకు పైగా ఉత్పత్తులను ఫ్లిప్ కార్ట్ తన కస్టమర్లకు అందుబాటులోకి తేస్తున్నది. ఐదు కోట్ల మందికి పైగా భారతీయులకు కార్డు లెస్ క్రెడిట్, ఫ్లిప్ కార్ట్ పే లేటర్ తోపాటు అన్ని బ్యాంకుల డెబిట్, క్రెడిట్ కార్డులపై నో కాస్ట్ ఈఎంఐ వసతులు లభిస్తాయి.