లోక్‌సభ ఎన్నికలు: పార్లమెంట్ కమిటీ విచారణకు ఫేస్‌బుక్

వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం తీసుకునే చర్యలను వివరించేందుకు బుధవారం అనురాగ్ ఠాకూర్ సారథ్యంలోని పార్లమెంట్ స్థాయీసంఘం ముందు ఫేస్‌బుక్ ఉపాధ్యక్షుడు జోయల్ కప్లాన్ హాజరు కానున్నారు. 
 

Facebook Vice President To Appear Before Parliamentary Panel On March 6

 

న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో వినియోగదారుల హక్కుల పరిరక్షణకు ఆయా మాధ్యమాలు తీసుకుంటున్న చర్యలను తమకు తెలపాలని పార్లమెంటరీ స్థాయీ కమిటీ గతంలో నోటీసులు జారీచేసింది. ఈ మేరకు ఫేస్‌బుక్‌ ఉపాధ్యక్షుడు జోయల్‌ కప్లాన్‌ ఈ నెల ఆరో తేదీన కమిటీ ఎదుట హాజరు కానున్నారు.

అనురాగ్ ఠాకూర్ సారథ్యంలోని పార్లమెంటరీ స్థాయీ కమిటీ నోటీసులు పంపిన వాటిలో వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌ కూడా ఉన్నాయి. ఇప్పటికే పార్లమెంటరీ స్థాయీ కమిటీ ముందు ట్వీట్టర్ ప్రతినిధులు హాజరయ్యారు.

కమిటీ అడిగిన కొన్ని ప్రశ్నలకు వారు జవాబులు చెప్పలేక పోయారు. రాత పూర్వకంగా సమాధానమిచ్చేందుకు కమిటీ వారికి 10 రోజుల గడువు ఇచ్చింది. పేస్‌బుక్‌ సీఈఓ మార్క్ జూకర్‌ బర్గ్ గానీ, సీఓఓ షేర్ల్య్ శాండర్ బర్గ్ పార్లమెంటరీ కమిటీ ముందుకు రావడం లేదు. 

జూకర్‌బర్గ్‪కు బదులు ఫేస్‌బుక్‌ ఉపాధ్యక్షుడు జోయల్‌ కప్లాన్‌ను పంపుతున్నారు. భారతదేశంలో ఫేస్‌బుక్‌కు దాదాపు 300 మిలియన్లు, వాట్సాప్‌కు 200 మిలియన్లు, ఇన్‌స్టాగ్రామ్‌కు 75 మిలియన్ల మంది వినియోగదారులు ఉన్నట్లు అంచనా.

సార్వత్రిక ఎన్నికలు రానున్నందున ఫేస్‌బుక్‌లో పార్టీలు, రాజకీయ నాయకుల ప్రకటనల విషయంలో పారదర్శకతను పాటించేందుకు ఫేస్‌బుక్‌ ముందుకు వచ్చింది. ప్రకటన ఎవరు ఇచ్చారు? ఎంత రుసుం చెల్లించారు? అనే విషయాలన్నీ ప్రకటన కింద తెలియజేయడానికి అంగీకరించింది.

ఫేస్‌బుక్‌ ఉపాధ్యక్షుడు జోయల్‌ కప్లాన్‌తోపాటు ఫేస్ బుక్ ఇండియా ఉపాధ్యక్షుడు కం మేనేజింగ్ డైరెక్టర్ అజిత్ మోహన్, సంస్థ పబ్లిక్ పాలసీ ప్రోగ్రామ్స్ డైరెక్టర్ అంకిదాస్ తదితరులు హాజరవుతారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios