ఫేస్‌బుక్‌ ఛైర్మన్‌ కం సీఈఓ మార్క్ జుకర్ బర్గ్‌కు ఒక గండం తప్పింది. సంస్థను విమర్శలు, ఆరోపణలకు అతీతంగా ముందుకు నడిపించడంలో విఫలమవుతున్న మార్క్ జుకర్ బర్గ్ చైర్మన్ పదవి నుంచి వైదొలుగాల్సిందని పలువురి నుంచి డిమాండ్లు వచ్చాయి.

కానీ అందరి అంచనాలకు భిన్నంగా గురువారం జరిగిన సంస్థ వార్షిక సమావేశంలో లీడర్‌షిప్‌ ఓటు ద్వారా మార్క్‌ జుకర్‌బర్గ్‌కు ఈ సవాల్ ఎదురు కాలేదు. విమర్శలు వచ్చినా తాజా వార్షిక సమావేశంలో సంస్థ నియంత్రణపై 58 శాతం అధికారాలు జుకర్ బర్గ్‌కు లభించడం గమనార్హం.

గోప్యత నిబంధనల ఉల్లంఘనలను జుకర్‌బర్గ్‌ నాయకత్వంలో ఎఫ్‌బీ దీటుగా ఎదుర్కోలేకపోతోందని వాటాదారుల్లో అసంతృప్తి ఎటు దారితీస్తుందోననే ఉత్కంఠ నెలకొంది. కాగా కంపెనీ షేర్లలో జుకర్‌బర్గ్‌కు 60 శాతం వాటా ఉండటంతో లీడర్‌షిప్‌ ఓటులో ఆయన నాయకత్వానికి ఎటువంటి ఇబ్బందులూ ఎదురుకావని బీబీసీ పేర్కొంది.

పలువైపుల నుంచి సంస్థ చైర్మన్‌గా తాను వైదొలుగాలని వచ్చిన డిమాండ్లను జుకర్ బర్గ్ తోసిపుచ్చారు. చైర్మన్ గా వైదొలుగాలని చేసిన ప్రతిపాదనను లీడర్ షిప్ ఇన్వెస్టర్లు కొట్టి పారేశారు. 

జుకర్‌బర్గ్‌కు వ్యతిరేకంగా ఎంతశాతం వాటాదారులు ఓటు వేశారనేది ఆయన నాయకత్వానికి గీటురాయి కానుందని తెలిపింది. జుకర్‌బర్గ్‌ చైర్మన్‌గా వైదొలగాలని 70 లక్షల డాలర్ల విలువైన షేర్లు కలిగిన ట్రిలియమ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రతిపాదించింది.

ఫేస్‌బుక్‌ సెక్యూరిటీ మాజీ చీఫ్‌ అలెక్స్‌ స్టామోస్‌ కూడా జుకర్‌బర్గ్‌ చైర్మన్‌గా వైదొలగాలని కోరుతున్నారు. సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌పై నియంత్రణను జుకర్‌బర్గ్ కొంత వదులుకుని, నూతన సీఈఓను నియమించాలని కోరారు.

ఈ సమావేశానికి హాజరైన పెన్సిల్వేనియా ట్రెజర్ జాయ్ టోర్ సెల్లా బోర్డు చైర్మన్, సీఈఓ పొజిషన్లను సెపరేట్ చేయాలని కోరుతూ ప్రతిపాదించిన‘కామన్-సెన్స్ పాలసీ’తో ఏకీభవించారు.

తీవ్రమైన మిస్ మేనేజ్మెంట్, కుంభకోణాలు, వివాదాలతో ఫేస్ బుక్ ప్రతిష్ఠ దెబ్బ తింటుందని జాయ్ టోర్ సెల్లా ఆందోళన వ్యక్తం చేశారు. ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ రిస్కులో పడుతుందన్నారు.

ఫైట్ ఫర్ ది గ్రూప్ ప్రతినిధి స్పందిస్తూ పదేపదే జుకర్ బర్గ్‌ను పదేపదే వైదొలగాలని కోరారు. కంపెనీ వ్యక్తిగత రహస్యాలు బహిర్గం అవుతూ, ఫైర్ జంక్ గా మారుతున్నందున జుకర్ బర్గ్ వైదొలగడం శ్రేయస్కరం అని చెప్పారు.

ఫేక్ న్యూస్, ద్వేష పూరిత ప్రసంగాలపై ఆన్ లైన్ వీడియో ద్వారా ప్రసారాలు జరుగడంతో సమస్యలు మరింత పెరుగుతున్నాయని వాటాదారులు చెబుతున్నారు. పలువురు ఆందోళనకారులు ఈ సమావేశ ప్రాంగణం ముందు నిరసన తెలిపారు. 

జుకర్ బర్గ్ ఒక్కరే కాదు. పలు సంస్థల సీఈఓలు కూడా గతంలో ఇటువంటి పరిస్థితులనే ఎదుర్కొన్నారు. జారా ఓనర్ ఇండిటెక్స్ కూడా ఒకసారి ఇదే తరహా పరిస్థితిని ఎదుర్కొన్నది.

బోయింగ్ లో సీఈఓగా కార్లోస్ క్రెస్పో నియామకం, చైర్మన్, సీఈఓ పాత్రలను విడదీయడంపై నూతన విండో ఏర్పాటు చేసింది. డెన్నిస్ ములిన్ బర్గ్ రెండు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా ఇటీవలి బోయింగ్ 737 మాక్స్ విమానాల క్రాష్ కు పరిష్కారం కనుగొన్నారు.