దటీజ్ చైనా.. ఒత్తిడికి తలొగ్గిన ఆపిల్.. ఆ యాప్ తొలగింపు ఇలా

హాంకాంగ్ ఉద్యమకారులకు మద్దతుగా నిలుస్తోందంటూ చైనా హెచ్చరికలతో దిద్దుబాటు చర్యలు చేపట్టింది అమెరికా టెక్ దిగ్గజం యాపిల్. యాపిల్ స్టోర్ నుంచి 'హెచ్కే మ్యాప్.లైవ్' రవాణా యాప్ను తొలగించింది. ఆందోళనకారులు.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ఈ యాప్ను వినియోగిస్తున్నట్లు పేర్కొంది.

Apple pulls Hong Kong app used by protesters after China warning

హాంకాంగ్‌: చైనా దెబ్బకు టెక్నాలజీ దిగ్గజం 'ఆపిల్‌` దిగి వచ్చింది. హాంకాంగ్‌లో 'హెచ్‌కే మ్యాప్.లైవ్' రవాణా యాప్ అందుబాటులోకి తీసుకొచ్చి ఆందోళనకారులకు ఆపిల్ సంస్థ మద్దతుగా నిలుస్తోందని చైనా ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు ఆపిల్‌ తీరుపై విదేశీ సంస్థలపై ఒత్తిడి తీసుకు వచ్చింది. ఆపిల్‌ అనుబంధ హై ప్రోఫైల్‌ బ్రాండ్స్‌ ఎన్బీఏతోపాటు హ్యుస్టన్‌ రాకెట్స్‌ ఫ్రాంచైసీపైనా ఒత్తిడి తెచ్చింది. 

దీంతో ఆపిల్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఆపిల్ స్టోర్ నుంచి ఆ యాప్‌ను తొలగించింది. హాంకాంగ్ ప్రజలకు, పోలీసులకు హాని చేకూరేలా ఆందోళనకారులు రవాణా యాప్‌ను వినియోగిస్తుండటంతో ఆపిల్ స్టోర్ నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొన్నది. ఈ మేరకు చైనా అధికార మీడియాలో వార్తలొచ్చాయి. దీంతో ఆపిల్ యాజమాన్యంపై ఒత్తిడి పెరిగింది.

'హెచ్‌ కే మ్యాప్‌. లైవ్‌ యాప్ పోలీసుల జాడను తెలుపుతోంది. పోలీసులను లక్ష్యంగా చేసుకుని దాడులు, ప్రజల రక్షణకు విఘాతం కలిగించటం వంటివి చేస్తున్నట్లు హాంకాంగ్ సైబర్ సెక్యూరిటీ, టెక్నాలజీ క్రైమ్ బ్యూరో ద్వారా నిర్ధారించుకున్నాం. పోలీసులు లేరని తెలుసుకుని ఆయా ప్రాంతాల్లోని ప్రజలపై నేరస్థులు దాడులకు పాల్పడుతున్నారు. దీని ఫలితంగా ఈ యాప్ ప్రజలకు తీవ్ర హాని చేస్తుంది` అని ఆపిల్ ఒఖ ప్రకటనలో పేర్కొంది.

గత నాలుగు నెలలుగా చైనాకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపడుతున్నారు హాంకాంగ్ వాసులు. ఈ సందర్భంగా నిరసనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణలు నెలకొన్నాయి. అయితే హాంకాంగ్లో పోలీసుల జాడను గుర్తించేందుకు నిరసనకారులు యాపిల్కు చెందిన 'హెచ్ కే మ్యాప్. లైవ్' యాప్ ద్వారా తెలుసుకుంటున్నారని కమ్యూనిస్ట్ పత్రిక పీపుల్స్ డైలీ సంపాదకీయం ప్రచురించింది. యాపిల్ సంస్థ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios