మిస్డ్‌కాల్ చీటింగ్‌పై జియో వర్సెస్ ఎయిర్ టెల్ మాటల యుద్ధం
రిలయన్స్ జియో మిస్డ్ కాల్స్ ఇవ్వడంతో వినియోగదారులను మోసగిస్తోందని ఎయిర్‌టెల్ ఆరోపించింది. అదేం లేదని జియో కొట్టి పారేసింది. మరోవైపు కస్టమర్ల సంఖ్య పెంచుకునేందుకు ఎయిర్ టెల్.. భారతీ ఎక్సా లైఫ్ సంస్థ అనుబంధంతో రూ.4 లక్షలకు బీమా అందుబాటులోకి తీసుకోవచ్చు.
న్యూఢిల్లీ: టెలికాం సంస్థలు ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. జియో తన ఔట్ గోయింగ్ కాల్స్ రింగయ్యే సమయాన్ని కేవలం 20 సెకన్లు మాత్రమే ఉంచి మోసగిస్తుందని ఎయిర్‌టెల్ ఆరోపించింది. రిలయన్స్ జియో పేరును ఎయిర్ టెల్ నేరుగా ప్రస్తావించకుండానే ఆరోపణలు గుప్పించింది.
కొత్తగా వచ్చిన 4జీ నెట్‌వర్క్’ అని జియోపై ఎయిర్ టెల్ పరోక్ష విమర్శలు ‘కొత్తగా వచ్చిన ఒక 4జీ నెట్‌వర్క్’ అని పేర్కొంటూ ఎయిర్ టెల్ ఆరోపణల్ని గుప్పించింది. ఒక నెట్‌వర్క్ నుంచి మరో నెట్‌వర్క్‌కు ఫోన్ వెళ్లిన ప్రతిసారీ.. కాల్ చేసిన నెట్‌వర్క్ నుంచి కాల్ తీసుకున్న నెట్‌వర్క్‌కు నిముషానికి ఆరు పైసలు చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
ఇంటర్ కనెక్ట్ యూసేజ్ చార్జీ అంటే దీన్ని ఇంటర్‌కనెక్ట్ యూసేజ్ చార్జ్ (ఐయూసీ) అంటారు. అయితే.. జియో రింగ్ సమయాన్ని తగ్గించి అవతలి వారికి కేవలం మిస్డ్ కాల్ వెళ్లేలా చేసి.. తిరిగి తనకు ఫోన్లు వచ్చేలా చేసుకుంటున్నదని, తద్వారా మోసపూరితంగా ఐయూసీ చార్జీలు వసూలు చేస్తోందని ఎయిర్‌టెల్ ఆరోపించింది.
ఎయిర్ టెల్ ఆరోపణలను ఇలా తిప్పికొట్టిన జియో భారతీ ఎయిర్ టెల్ ఆరోపణల్ని రిలయన్స్ జియో తిప్పికొట్టింది. వాస్తవంగా ఎయిర్‌టెల్ ఆరోపణలకు విరుద్ధంగా జరుగుతోందని తెలిపింది. ఇతర నెట్‌వర్క్‌ల వినియోగదారులు జియోకు మిస్‌కాల్ ఇచ్చి వెనక్కి చేయమంటున్నారని చెప్పింది.
తమకే ఎక్కువ మిస్డ్ కాల్స్ వస్తున్నాయని జియో వ్యాఖ్య భారీ చార్జీలతో ఇతర సర్వీస్ ప్రొవైడర్లు కస్టమర్ల నడ్డి విరుస్తుండటంతో, జియోకే మిస్‌కాల్స్ ఎక్కువ వస్తున్నాయని జియో పేర్కొన్నది. ప్రపంచవ్యాప్తంగా టెలికాం సంస్థలు 15నుంచి 20 సెకన్ల సమయాన్నే కేటాయించారని స్పష్టం చేసింది.
ఎయిర్‌టెల్ నుంచి అదిరిపోయే ఆఫర్! ప్రీ పెయిడ్ వినియోగదారుల కోసం భారతీ ఎయిర్‌టెల్ అదిరిపోయే ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. భారతీ ఏఎక్స్ఏ లైఫ్ ఇన్సూరెన్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్న ఎయిర్‌టెల్.. దేశవ్యాప్తంగా ఉన్న తమ ప్రీపెయిడ్ ఖాతాదారులకు ఆ ప్రయోజనాలు అందించేందుకు సిద్ధమైంది. ఇందుకు కొత్తగా రూ.599 ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది.
భారతి ఎఎక్స్ఏ లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి బీమా ఇందులో రోజుకు 2జీబీ డేటాతోపాటు ఏ నెట్‌వర్క్‌కు అయినా అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. దీంతో పాటు భారతి ఏఎక్స్ఏ లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి రూ.4 లక్షల జీవిత బీమా ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఈ ప్లాన్ కాలపరిమితి 84 రోజులు.
త్వరలో దేశవ్యాప్తంగా అమలుకు ఎయిర్ టెల్ వ్యూహం ఒకసారి రీచార్జ్ చేయించుకున్న తర్వాత లభించే జీవిత బీమా.. రీచార్జ్ చేసిన ప్రతిసారీ దానంతట అదే రెన్యువల్ అవుతుంది. ప్రస్తుతం ఈ ఆఫర్ తమిళనాడు, పాండిచ్చేరిలోని ఖాతాదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే దీనిని దేశమంతా విస్తరించనున్నట్టు ఎయిర్‌టెల్ తెలిపింది.
18-54 ఏళ్ల మధ్య వయస్కులకు ఈ బీమా వసతి ఎయిర్‌టెల్ అందించే జీవిత బీమా 18-54 వయసున్న ఖాతాదారులందరికీ లభిస్తుంది. అయితే, ఇందుకోసం ఎటువంటి పేపర్ వర్క్, వైద్య పరీక్షలు అవసరం లేదు. ఇన్సూరెన్స్‌కు సంబంధించిన సర్టిఫికెట్ డిజిటల్‌గా డెలివరీ అవుతుందని కంపెనీ తెలిపింది. అవసరం అనుకుంటే ఫిజికల్‌గా కూడా ఓ సర్టిఫికెట్ ఇంటి అడ్రస్‌కు వస్తుంది. ఇన్సూరెన్స్ ఆఫర్ పొందాలంటే ఖాతాదారుడు తొలుత రూ.599 ప్లాన్ రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇలా ఎయిర్ టెల్ రిటైలర్ ద్వారా ఎన్రోల్ చేయించుకోవాలి తర్వాత జీవిత బీమా కోసం ఎస్సెమ్మెస్, ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా కానీ, ఎయిర్‌టెల్ రిటైలర్ ద్వారా కానీ ఎన్‌రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. విచిత్రం ఏమిటంటే.. దేశంలోని మొత్తం జనాభాలో జీవిత బీమా చేయించుకున్న వారి సంఖ్య 4 శాతం లోపే ఉండగా, మొబైల్స్ కలిగిన వారి సంఖ్య 90 శాతంగా ఉండడం గమనార్హం. 2022 నాటికి దేశంలో మొబైల్ వినియోగించేవారి సంఖ్య 830 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా.