‘మెగా పిక్సెల్ వార్’: రెండేళ్లలో 50 శాతం స్మార్ట్‌ఫోన్లు ఇలా!

ఇప్పుడు అంతా స్మార్ట్ ఫోన్ల ప్రపంచమే. ఇప్పుడిప్పుడే మూడు కంటే ఎక్కువ కెమెరాలు ఉన్న స్మార్ట్ ఫోన్లపై మోజు పెరుగుతున్నది. 2021 నాటికి అది 50 శాతానికి చేరుతుందని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ వెల్లడించింది. 

50% smartphones to have 3 cameras or more by 2021

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ‘మెగాపిక్సెల్ వార్’ జరుగుతోంది. స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలన్నీ కెమెరా ప్రధానంగా ఉండే ఫోన్లను తయారు చేయడంపైనే దృష్టిసారించాయి. ఒక కెమెరా స్థానంలోకి రెండు, మూడు వచ్చి చేరాయి. కొన్ని కంపెనీలైతే ఐదు, ఆరు కెమెరాలు ఉన్న ఫోన్లనూ ఉత్పత్తి చేస్తున్నాయి. 

స్మార్ట్ ఫోన్ల భవితవ్యంపై కౌంటర్ పాయింట్ ఇలా
వచ్చే రెండేళ్లలో అంటే 2021 నాటికి ప్రపంచవ్యాప్తంగా అమ్ముడయ్యే ఫోన్లలో 50 శాతం మూడు, అంతకంటే ఎక్కువ కెమెరాలు కలిగిన ఫోన్లే ఉంటాయని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ సంస్థ తెలిపింది. ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ (ఓఈఎంఎస్) మూడు కెమెరాలు ఉన్న ఫోన్లను ఉత్పత్తి చేస్తోంది. 

మూడు కెమెరాలు ఉన్న స్మార్ట్ ఫోన్లు చాలా పాపులర్
ఇప్పుడు మూడు కెమెరాలు ఉన్న స్మార్ట్ ఫోన్లు బాగా పాప్యులర్ అయ్యాయి. గతేడాది నాటికే ప్రపంచవ్యాప్తంగా అమ్ముడైన ఫోన్లలో మూడు, అంతకంటే ఎక్కువ కెమెరాలు ఉన్న ఫోన్లు ఆరు శాతం దాటాయి. ఈ ఏడాది చివరికల్లా ఇది 15 శాతానికి చేరుకోనుండగా, 2020 నాటికి అది 35 శాతానికి చేరనుంది.

మూడుకంటే ఎక్కువ కెమెరాలు ఉన్న ఫోన్లు 40%
ఇక, ఈ ఏడాది ఇప్పటి వరకు విడుదలైన స్మార్ట్‌ఫోన్లలో 40 శాతానికి పైగా ఫోన్లు మూడు, అంతకంటే ఎక్కువ కెమెరాలు ఉన్నాయి. హువావే మేట్, పి సిరీస్, శామ్‌సంగ్ గెలాక్సీ ఎ సిరీస్, వివో వి15 ప్రొ వంటివి వీటిలో కొన్ని. యాపిల్, వన్‌ప్లస్‌ కూడా వచ్చే ఏడాది ఈ రేస్‌లోకి దిగనున్నాయి. 

అధిక రిజల్యూషన్ సామర్థ్యం గల ఫోన్లపై నజర్
ఇక, ఈ ఏడాది ద్వితీయార్ధ భాగంలో విడుదలయ్యే ఫోన్లలో 64 ఎంపీ, అంతకంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన కెమెరాతో వచ్చే అవకాశం ఉందని సమచారం. 2020 నాటికి కెమెరా రిజల్యూషన్ 100 ఎంపీకి పెరిగే అవకాశం ఉందని కౌంటర్ పాయింట్ తెలిపింది.

రూ.4,999లకే డ్యూయల్ కెమెరా ఐటెల్ స్మార్ట్‌ఫోన్ 
న్యూఢిల్లీ: చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ ఐటెల్ అదిరిపోయే ఫీచర్లతో, అతి తక్కువ ధరకే అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఐటెల్ ఎ46 పేరుతో విపణిలోకి విడుదల చేసిన ఈ ఫోన్ ధర రూ.4,999 మాత్రమే. దీంతోపాటు రిలయన్స్ జియో నుంచి 50 జీబీ వరకు 4జీబీ డేటా, రూ.198, రూ.299 అంతకుపైన రీచార్జ్‌లపై 24 నెలల వరకు రూ.1,200 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
 
ఇవీ ఐటెల్ ఎ46 స్పెసిఫికేషన్లు
5.45 అంగుళాల ఫుల్‌స్క్రీన్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లే, 1.6 జీహెచ్‌జడ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 9పీ ఆపరేటింగ్ సిస్టం, 2జీబీ ర్యామ్+16జీబీ అంతర్గత స్టోరేజీ, మైక్రోఎస్డీ కార్డు ద్వారా 128 జీబీ రామ్ వరకు స్టోరేజీ సామర్థ్యం పెంచుకునే వెసులుబాటు ఉన్న ఈ ఫోన్‌లో 1జీబీ ర్యామ్+16జీబీ స్టోరేజీ వేరియంట్ కూడా ఉంది. 8 ఎంపీ+వీజీఏ ఏఐ రియర్ డ్యూయల్ కెమెరా, 5 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, డ్యూయల్ సిమ్, 2400 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios