Asianet News TeluguAsianet News Telugu

స్వతంత్ర భారతంలో దళిత ముస్లింలకు ఆరు నెలలే రిజర్వేషన్లు లభించాయి. ఎందుకు?

స్వతంత్ర భారతంలో దళిత ముస్లింలకు రిజర్వేషన్లు లభించాయి. కానీ, ఆ రిజర్వేషన్లు కేవలం ఆరు నెలలు మాత్రమే అనుభవించగలిగారు. ఆ తర్వాత నెహ్రూ ప్రభుత్వ నిర్ణయంతో ముస్లిం దళితులను ఎస్సీ నుంచి తొలగించి రిజర్వేషన్లకు దూరం చేశారు.
 

why dalit musims enjoyed just six months of reservations in independent india kms
Author
First Published May 29, 2023, 3:53 PM IST

న్యూఢిల్లీ: స్వతంత్ర భారతంలో దళిత ముస్లింలకు రిజర్వేషన్లు దక్కాయి. అయితే, ఆ రిజర్వేషన్లు కేవలం ఆరు నెలలు మాత్రమే అమలయ్యాయి. ఆ తర్వాత రద్దయ్యాయి. 1950 ఆగస్టు 10న వాటిని అప్పటి రాష్ట్రపతి తొలగించారు. దీంతో పస్మాందా ముస్లింలు తీవ్రంగా నష్టపోయాయి. లక్షలాది భారత ముస్లింలు రిజర్వేషన్లకు నోచుకోకుండా పోయారు.

అప్పటి విద్యా శాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆదేశాలతో జవహర్ లాల్ నెహ్రూ ప్రభుత్వం ఈ రిజర్వేషన్లు రద్దు చేసిందని ఆల్ ఇండియా పస్మాందా ముస్లిం మహజ్ ఉత్తరప్రదేశ్ యూనిట్ అధ్యక్షుడు షమీమ్ అన్సారీ తెలిపారు. ఈ సంస్థ 85 నుంచి 90 శాతం భారత ముస్లింల గురించి మాట్లాడుతుంది.

పస్మాందా ముస్లింలతో దేశ స్వాంతంత్ర్యం కూడా అష్రఫ్‌ల తరహానే ప్రవర్తించింది. విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి పాలించిన ముస్లింల వారసులనే అష్రఫ్‌లు అని పిలుస్తారు. ఈ అష్రఫ్‌లు దేశ ముస్లిం జనాభాలో స్వల్ప సంఖ్యలో ఉన్నప్పటికీ ఆధిపత్యం వహిస్తున్నారు.

ఆవాజ్ ది వాయిస్‌తో షమీమ్ అన్సారీ మాట్లాడుతూ.. ఐదుగురు ముస్లిం సభ్యులు మౌలానా అబుల్ కలాం ఆజాద్, హుస్సేన్ భాయ్ లాల్జీ, తజమ్ముల్ హుస్సేన్, బేగం ఎజాజ్ రసూల్, మౌలానా హిఫ్‌జుర్ రహ్మన్‌లు దళిత ముస్లింలను ఎస్సీ లిస్టు నుంచి తొలగించాలని వాదించారు. మైనార్టీ హక్కుల సంరక్షణ సబ్ కమిటీ చర్చలో వీరు ఈ వాదనలు చేశారు. కానీ, ఈ కమిటీ చైర్మన్ సర్దార్ వల్లభాయ్ పటేల్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌లు మాత్రం దళిత ముస్లింలకు రిజర్వేషన్ ఉండాలనే నిర్ణయమే తీసుకున్నారు. అష్రఫ్ ముస్లిం సభ్యులు కచ్చితంగా ఈ రిజర్వేషన్లు అవసరమే లేదని కరాఖండిగా చెప్పేశారు.

Shamim Ansari Shamim Ansari

ముస్లింలు ఇతర మతస్తుల్లా కాదని, ఇందులో వర్గాలేవీ ఉండవని ఈ ఐదుగురు సభ్యులు వాదించారు. తమలో దళితులే లేరని తెలిపారు. ఇస్లాంలో కులాలే లేవని, దాని ఆధారంగా వివక్షా లేదని వీరు పటేల్, అంబేద్కర్‌లకు వివరించారు. కాబట్టి, రిజర్వేషన్లలో వారిని చేర్చాల్సిన అవసరం లేదని తెలిపినట్టు షమీమ్ అన్సారీ పేర్కొన్నారు. 

హిందు, ముస్లిం దళితుల మధ్య అంబేద్కర్ ఎలాంటి గోడలు పెట్టలేదని, కాబట్టి, చివరకు దళిత ముస్లింలును ఎస్సీల్లో చేర్చి రిజర్వేషన్లకు లబ్దిదారులను చేశారు. కానీ, ఈ రిజర్వేషన్లు దళిత ముస్లింలైన పస్మాందాలకు కొంత కాలమే లభించింది. మలానా ఆజాద్ ఆదేశాలతో 1950 ఆగస్టు 10న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దళిత ముస్లింలకు రిజర్వేషన్లను ఎత్తేసింది.

ఆ సబ్ కమిటీలోని ఐదుగురు ముస్లిం సభ్యుల్లో ఒకరైన బేగం ఎజాజ్ రసూల్‌ను 2000 శీతాకాలంలో కలిసే అవకాశం లభించిందని షమీమ్ తెలిపారు. అప్పుడు ఎందుకు రిజర్వేషన్లు రద్దు చేయాలని అడిగారని ప్రశ్నించగా.. ఈ పాపాలకే అల్లా తమకు శిక్ష విధించాడని, అందుకే తాము బాధ పడుతున్నామని చెప్పారని పేర్కొన్నారు.

Also Read: యూట్యూబ్‌లో నకిలీ ముల్లాల బోధనలు ప్రమాదకరం.. ఊహా ప్రపంచంతో వాస్తవ సమస్యలు పరిష్కృతమవుతాయా?

నేటి పస్మాందా విద్యావంతులైన యువత తమ చరిత్రను తవ్వి తీస్తున్నారని, దేశ విభజనను తీవ్రంగా విభజించిన పస్మాందా ముస్లింలకు వ్యతిరేకంగా ఎందుకు ఓ ముస్లిం వర్గం ముస్లిం లీగ్, పాకిస్తాన్ పుట్టుకను సమర్థించిందని ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు.

కొన్ని ఉదాహరణలను ఆయన పేర్కొంటూ.. 1946లో చాంద్‌పుర్‌కు చెందిన (ఇప్పటి పశ్చిమ యూపీ) చౌదరి మొఖా అన్సారీ అనే వ్యక్తి కాంగ్రెస్‌కు ఓటు వేశారు. చాలా మంది ముస్లిం భూస్వాములు జిన్నా ముస్లిం లీగ్‌కు ఓటేశారు. దీంతో ఆగ్రహంతో ఆ సంపన్న భూస్వాములు ఆ పస్మందా ఓటర్‌ను బహిష్కరించారు.

1946 భారత దేశం భిన్నమైనది. అప్పుడు అందరు ఓటేయలేరు. కేవలం సంపన్న భూస్వాములు, భూస్వామ అధినేతలు, యేటా రూ. 64 పన్ను చెల్లించే, చౌకీదారి రుసుం రూ. 1.25 కట్టేవారు, మెట్రిక్యులేట్ పూర్తి చేసిన వారు మాత్రమే ఓటు వేయడానికి అర్హులు. అలాగే, హిందువులు, ముస్లింలకు వేర్వేరు నియోజకవర్గాలు ఉండేవి.

ఈ వ్యవస్థలో పస్మాంద నిస్సహాయులు. రాజకీయంలో వారికి దారే లేదు. నేను పస్మాంద. సంపన్నుడిని కానీ, విద్యావంతుడిని కాను. నాకంటూ సొంత భూమీ లేదు. రోడ్లు పక్కనే వినీలాకాశం కింద జీవించే వాడిని. కాబట్టి, నా లాంటి వ్యక్తి రాజకీయాలకు బలవంతంగా దూరంగా ఉండాల్సి వచ్చేదని షమీమ్ చెప్పారు.

అందుకే తమకు కాంగ్రెస్ అంటే ఒక రకమైన భయాలు, అనుమానాలు ఉంటాయని తెలిపారు. ఆ పార్టీకి తమ ఓట్లు కావాలి కానీ, తాము అవసరం లేదని పస్మాందా వర్గీయులు తెలుసుకుంటున్నారని వివరించారు. ఇప్పుడు పస్మాంద నేతలు వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుని అందుకు అనుగుణంగా నడుచుకుంటున్నారని పేర్కొన్నారు. పస్మాంద అభ్యర్థుల ప్రాతినిధ్యానికి అవకాశం ఇచ్చే పార్టీకి మాత్రమే తాము ఓటేస్తామని ఇప్పుడు వారు స్పష్టంగా చెబుతున్నారని చెప్పారు.

why dalit musims enjoyed just six months of reservations in independent india kms

ముస్లింలను విభజించడానికి బీజేపీ పస్మాందాలను ఉపయోగించడం లేదా?

ఈ ప్రశ్నకు షమీమ్ సమాధానం ఇస్తూ.. పస్మాందా ముస్లింలు ప్రధాని మోడీకి కృతజ్ఞులై ఉన్నారని తెలిపారు. తమ సమస్యలను ఆయన జాతీయ అంశంగా మలిచారని వివరించారు. ముస్లిం అభ్యర్థులుగా పస్మాందా ముస్లింలనూ తీసుకోవాలని సవరణలు బీజేపీ చేసుకుంది. యూపీలో బీజేపీ ప్రభుత్వం పస్మాందాల కోసం ద్వారాలు తెరుస్తున్నదని వివరించారు. 

ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోడీతో కలిసి ఒక భేటీని ప్రస్తావించారు. నరేంద్ర మోడీ ఇంకా ప్రధాని కాకముందు.. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఆయనను తాను అహ్మదాబాద్‌లో కలుసుకున్నానని తెలిపారు. పస్మాందా కమ్యూనిటీ ఎవరో తెలియదని మోడీ నిజాయితీగా అంగీకరించాడని వివరించారు. ఆయన తాను చెప్పిన విషయాలను శ్రద్ధగా ఆలకించాడని, పస్మాందాలపై చేసిన అధ్యయన కాపీలను అడిగి తీసుకున్నారని తెలిపారు.

2022 జులై 2వ తేదీన హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహించినప్పుడు అందులో మోడీ పస్మాందా ముస్లిం సంక్షేమం గురించి మాట్లాడారు. ప్రధాని మోడీ తమ గురించి మాట్లాడారని, ఇది తమ పోరాటంపై గణనీయమైన ప్రభావం వేసిందని వివరించారు. 

సెక్యులర్ పార్టీలకు తమ ఓట్లు కావాలని, కానీ, అధికారంలో వాటాను మాత్రం నిరాకరిస్తాయని ఆయన అన్నారు. తాము ఇప్పుడు ఎంతమాత్రం విద్వేష రాజకీయాలను పట్టించుకోబోమని చెప్పారు. సంఘటితం, పాజిటివ్ రాజకీయాలే తాము చేస్తామని, మోడీ హఠావో, బీజేపీ హఠావో వంటి నెగెటివ్ పాలిటిక్స్ చేయబోమని స్పష్టం చేశారు. తమ యువత విద్వేష రాజకీయాలు చేయాలని అనుకోవడం లేదని, హిందు వర్సెస్ ముస్లిం విధానాలను పాటించడం లేదని వివరించారు.

 

--- ఆశా ఖోసా

Follow Us:
Download App:
  • android
  • ios