Manipur: నీ బిడ్డ ప్రాణాలతో కావాలా? శవమై రావాలా? అని ఆమె అడిగింది: హత్యాచారానికి గురైన యువతి తల్లి ఆవేదన

మణిపూర్‌లో ఓ ఇద్దరు యువతులను రేప్ చేసి చంపేసిన ఘటనను ఓ తల్లి ఆవేదనతో మీడియాకు చెప్పింది. మే 4వ తేదీన కాంగ్‌పోక్పి ఏరియాకు చెందిన తన కూతురును రేప్ చేసి చంపేశారని వివరించింది. బిడ్డకు ఫోన్ చేస్తే ఓ మైతేయి మహిళ ఫోన్ లిఫ్ట్ చేసి తన బిడ్డ ప్రాణాలతో కావాలా? విగత జీవై కావాలా? అని ప్రశ్నించి ఫోన్ కట్ చేసిందని ఆ మహిళ తెలిపింది.
 

she asked if i want my daughter dead or alive by a meitei woman, says mother of rape murder victim in manipur kms

న్యూఢిల్లీ: మణిపూర్‌లో మరో తల్లి తన గర్భశోకాన్ని వివరిస్తూ కన్నీరైంది. ‘నీ బిడ్డ ప్రాణాలతో కావాల? శవమై రావాలా? అని ఓ మైతేయి మహిళ అడిగింది. ఆ వెంటనే ఫోన్ పెట్టేసింది. ఆ తర్వాత నా బిడ్డను రేప్ చేసి చంపేశారని తెలిసింది.’ అని ఓ తల్లి ఆక్రందనతో అన్నమాటలివి. మణిపూర్‌లోని కాంగ్‌పోక్పి ఏరియాలో ఈ ఘటన మే 4వ తేదీన జరిగింది. అదే రోజున ఇదే జిల్లాలో ఇద్దరు యువతులను నగ్నంగా ఊరేగించి గ్యాంగ్ రేప్ చేసిన ఘటన వైరల్ వీడియో ద్వారా బయటికి వచ్చిన సంగతి తెలిసిందే.

ఇదే గ్రామానికి చెందిన 21 ఏళ్లు, 24 ఏళ్ల ఇద్దరు యువతులు ఇంఫాల్‌లో ఓ కార్ వాష్ ఫెసిలిటీలో పని చేస్తున్నారు. వారిని కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ చేసి ఓ మూక మే 4వ తేదీన దారుణంగా హత్య చేసింది.

ఈ ఘటన తర్వాత మృతి చెందిన ఇధ్దరు యువతుల్లో ఒకరి తల్లి మే 5వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ, మే 16వ తేదీన ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఆ తల్లి ఇండియా టుడేతోమాట్లాడుతూ.. గుండె చెరువయ్యే బాధలను చెప్పింది.

Also Read: Manipur Gangrape: మహిళలను నగ్నంగా కొడుతూ పొలాల్లోకి తీసుకెళ్లిన రోజు అక్కడ ఏం జరిగింది?

‘ఇల్లు గడవడానికి, ఆర్థిక సహాయపడటానికి నా కూతురు ఇంఫాల్‌లోని ఓ కార్ వాష్ ఫెసిలిటీలో పని చేసేది. మా గ్రామానికే చెందిన మరో యువతితో కలిసి అక్కడే ఓ అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉండేది’ అని ఆమె చెప్పింది. ‘హింస చెలరేగడంతో నేను భయాందోళనలకు గురయ్యాను. నా బిడ్డకు తరుచూ ఫోన్ చేశాను. కానీ, ఆమె నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఆ తర్వాత నా ఫోన్‌ను ఓ మైతేయి మహిళ లిఫ్ట్ చేసింది. నీ బిడ్డ నీకు ప్రాణాలతో కావాలా? విగత జీవై కావాలా? అని అడిగింది. ఫోన్ కట్ చేసింది’ అని ఆ తల్లి కన్నీరు రాలుతుండగా చెప్పింది. ఆ సమయంలో తన గుండె బద్ధలైందని పేర్కొంది.

‘ఆ తర్వాత తెలిసింది నా బిడ్డను చంపేశారని.. నా కేసు గురించి కూడా పోలీసులు లేదా ఇతర ఏ అధికారుల నుంచీ సమాచారం రాలేదు’ అని ఆమె చెప్పింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios