సారాంశం
Karnataka Election: కర్ణాటక ఎన్నికలు 2023 పోలింగ్ షురూ అయింది. ప్రధాన రాజకీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లు హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. ఇదే సమయంలో కింగ్ మేకర్ రోల్ పోషించే విధంగా జేడీ(ఎస్) ముందుకు సాగుతోంది. బీజేపీ వరుసగా మరోసారి విజయం సాధించాలని భావిస్తుండగా, కాంగ్రెస్ సైతం ఎలాగైన అధికారం దక్కించుకోవాలని చూస్తోంది.
Karnataka Assembly Election: కర్ణాటక ఎన్నికలు 2023 పోలింగ్ షురూ అయింది. ప్రధాన రాజకీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లు హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. ఇదే సమయంలో కింగ్ మేకర్ రోల్ పోషించే విధంగా జేడీ(ఎస్) ముందుకు సాగుతోంది. బీజేపీ వరుసగా మరోసారి విజయం సాధించాలని భావిస్తుండగా, కాంగ్రెస్ సైతం ఎలాగైన అధికారం దక్కించుకోవాలని చూస్తోంది. ఇప్పటికే ఓటింగ్ ప్రారంభం కాగా, ఉదయం 9 గంటల వరకు 13 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం (ఈసీ) అధికారులు తెలిపారు.
కర్ణాటకలో 224 అసెంబ్లీ స్థానాలకు సభ్యులను ఎన్నుకునేందుకు పోలింగ్ షురూ అయింది. బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. బీజేపీ మరోసారి వరుసగా అధికారంలోకి రావాలని భావిస్తుండగా, కాంగ్రెస్ మాత్రం రాష్ట్రాల రివాల్వింగ్ డోర్ ట్రెండ్ పై దృష్టి సారించింది. 61 సీట్లకు పైగా బలం ఉన్న జేడీఎస్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడనున్నాయి.
కర్నాటక ఎన్నికల పోలింగ్-తాజా టాప్-10 పాయింట్స్
- శివమొగ్గలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 75 నుంచి 80 శాతం ఓటర్లు బీజేపీకి మద్దతిస్తారని ఆశిస్తున్నట్లు యడ్యూరప్ప తెలిపారు. తమకు పూర్తి మెజారిటీ వస్తుందనీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. 130-135 సీట్లు గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
- తమ పార్టీ ప్రచారం నిర్వహించిన తీరు, ప్రజలు స్పందించిన తీరు చాలా సంతోషంగా ఉందని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అన్నారు. కర్ణాటక అభివృద్ధి కోసం వచ్చి ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానని బొమ్మై అన్నారు.
- ప్రగతిశీల, 40 శాతం కమీషన్ రహిత రాష్ట్రాన్ని నిర్మించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు వేయాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కోరారు. హిందీలో రాహుల్ గాంధీ ట్వీట్ చేస్తూ.. "కర్ణాటక ఓటు... మహిళల హక్కుల కోసం, యువత ఉపాధి కోసం, పేదల అభ్యున్నతి కోసం ఐదు 5 హామీలు.. రండి, పెద్ద సంఖ్యలో ఓటు వేయండి" అని పేర్కొన్నారు.
- రెండు పార్టీలు జోరుగా ప్రచారం నిర్వహించాయి. ప్రధాని నరేంద్ర మోడీ 19 బహిరంగ సభలు, ఆరు రోడ్ షోలు నిర్వహించగా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ 12 రోజుల పాటు రాష్ట్రంలో మకాం వేశారు.
- ఎన్నికలకు ముందు, అనేక అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న అధికార బీజేపీ- రిజర్వేషన్ కోటాను సవరించడంతో సహా తన అన్ని అంశాలపై దృష్టి సారించి ముందుకు సాగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. బీజేపీ ఈ నిర్ణయం వొక్కలిగ, షెడ్యూల్డ్ కులాలు, తెగల ఓట్లను తీసుకువస్తుందని ఆ పార్టీ భావిస్తోంది.
- ఇప్పటికే లింగాయత్ ల మద్దతు ఉన్న ఆ పార్టీ ఆ సామాజికవర్గం మద్దతును కూడగట్టి, రద్దు చేసిన ముస్లింలకు ఉన్న నాలుగు శాతం ఓబీసీ (ఇతర వెనుకబడిన తరగతులు) ఓట్లలో కొంత భాగాన్ని వారికి ఇచ్చింది.
- బీజేపీకి చెందిన పలువురు సీనియర్ లింగాయత్ నేతలు - మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్ సహా పార్టీ టికెట్ నిరాకరించడంతో కాంగ్రెస్ శిబిరంలో చేరారు. దీంతో 90 నుంచి 100 సీట్ల ఫలితాన్ని నిర్ణయించే లింగాయత్ ఓట్ల చీలికకు బీజేపీ తెరతీసింది.
- జనతాదళ్ సెక్యులర్ అధినేత కుమారస్వామితో కలిసి నడుపుతున్న సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడంతో అధికారానికి దూరమైన కాంగ్రెస్ కు రెండోసారి పొత్తు అవసరం లేదని తేల్చిచెప్పింది.
- మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డీకే శివకుమార్ మధ్య విభేదాలు తలెత్తాయి. అయితే టికెట్ల పంపిణీ విషయంలో వారి మధ్య వైరం అంతర్గత విభేదాలకు అద్దం పట్టింది.
- కుమారస్వామి నేతృత్వంలోని జనతాదళ్ సెక్యులర్ పార్టీకి ఇది కీలకమైన ఎన్నికలని, 90 ఏళ్ల వయసులో ఉన్న ఆ పార్టీ అధినేత హెచ్ డీ దేవెగౌడ తన ఈ ఎన్నికల మంచి ఫలితాలో రాజకీయల్లో చెరగని ముద్రవేయాలని చూస్తున్నారు. హసన్, మాండ్యలను దాటి తన పునాదిని విస్తరించాలని భావించిన ఆ పార్టీ ఇప్పుడు పాత మైసూరు ప్రాంతంలో తన సంప్రదాయ పునాదిని నిలుపుకోవడానికి ప్రయత్నిస్తోంది.