ఈ దేశంలో ఆడవారికి రక్షణ లేదా..? కాబోయే భర్త కళ్ల ముందే యువతి గ్యాంగ్ రేప్.. ఆపై..
మన దేశంలో ఆడవారికి రక్షణ లేకుండా పోయింది. అర్థరాత్రి కాదు కదా పట్టపగలు ఆడవాళ్లు బయటకు రాలేని పరిస్థితి. కామపిశాచుల చేతుల్లో ఆడవాళ్లు బలైపోతునే ఉన్నారు.
మన దేశంలో నిర్భయ, దిశ లాంటి కఠిన చట్టాలు అమల్లోకి వచ్చిన కామాంధుల ఆగడాలు ఆగడం లేదు. దేశంలో నిత్యం ఎదొక చోట మహిళలపై, చిన్నారులపై లైంగికదాడులు జరుగుతూనే ఉన్నాయి. వావీ వరుసలు మరిచి రెచ్చిపోతున్నారు. అదేసమయంలో చిన్నా.. పెద్ద అనే తేడా లేకుండా మృగాల్లా చెలరేగిపోతున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఓ యువతిపై ఐదుగురు కామాంధులు మూకుమ్మడిగా అత్యాచారం చేశారు. అది కూడా ఆ యువతికి కాబోయే భర్తపై దాడి చేసి మరి. సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటన జార్ఖండ్ పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బరిజాల్ గ్రామ సమీపంలో గురువారం సాయంత్రం ఓ యువతి తన కాబోయే భర్తతో కలిసి షికారుకు వెళ్లింది. ఈ సమయంలో వారిని గమనించిన ఓ ఐదుగురు సభ్యుల గ్యాంగ్ వారిని వెంబడించారు. వారిని కామెంట్ చేసుకుంటూ వారిపై దాడికి పాల్పడ్డారు. ఆ క్రమంలో ఆ యువకుడి పట్టుకుని కొట్టారు. గుంపు వచ్చి మీద పడ్పడటంతో ఆ యువకుడు కూడా ఏమీ చేయలేకపోయాడు. నిందితులు కర్రలు, రాడ్లతో దౌర్జన్యం చేశారు. తమను వదిలేయాలని ఆ జంట ఎంతగానో ప్రాధేయపడినా వినలేదు. ఆ యువకుడి కండ్ల ముందే ఆ యువతిపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఐదుగురు కామాంధులు ఈ దారుణానికి ఒడిగట్టారు. నొప్పి తట్టుకోలేక ఆ మహిళ అరుస్తున్నా.. అందులో ఒక్కరికి కూడా కనికరం కలుగలేదు. ఒకరి తర్వాత ఒకరు.. ఆ యువతిపై రేప్ చేశారు. కామాంధుడుల ఉదంతంతో ఆ యువతి స్పృహ తప్పి పడిపోయింది.
మరోవైపు.. ఆ దుండగుల నుంచి తప్పించుకున్న ఆ యువతికి కాబోయే భర్త ఎలాగోలా గ్రామస్తుల సహాయంతో చైబాసా మోఫుసిల్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్యాంగ్ రేప్ లో తీవ్రంగా గాయపడిన ఆ యువతిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా పోలీసులు దాడులు నిర్వహించి సామూహిక అత్యాచారం కేసులో 5 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి యువతి పర్సు, బ్యాగ్, డబ్బు, మొబైల్ ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ అశుతోష్ శేఖర్ తెలిపారు.