Deepfake: ఇంత దారుణానికి తెగబడ్డా రేంట్రా..! సీమా హైదర్ డీప్‌ఫేక్ వీడియో వైరల్..
Seema Haider: పాకిస్థాన్ కు చెందిన మహిళ సీమా హైదర్ (Seema Haider), యూపీకి చెందిన సచిన్ మీనా (Sachin Meena) లవ్ సోర్టీ అందరికీ తెలిసిందే. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది.
Seema Haider: పాకిస్థాన్ కు చెందిన మహిళ సీమా హైదర్ (Seema Haider), యూపీకి చెందిన సచిన్ మీనా (Sachin Meena) లవ్ సోర్టీ అందరికీ తెలిసిందే. ఆన్లైన్ పబ్జీ గేమ్ (PUBG Game) ద్వారా పరిచయమైన సచిన్ కోసం సీమా తన నలుగురి పిల్లలతో సహా పాకిస్థాన్ నుంచి భారత్ వచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది. పాకిస్థాన్‌లో తన భర్తని వదిలేసి ప్రియుడి కోసం తన నలుగురు పిల్లలను పట్టుకుని వచ్చింది. అనంతరం సచిన్‌ని పెళ్లాడిన సీమా వైవాహిక జీవితాన్ని సాఫీగా కొనసాగిస్తోంది.
ఇలా తన ప్రేమికుడి కోసం అక్రమంగా భారత్‌కు వచ్చిన ఆమె ప్రస్తుతం ఓ సెలబ్రిటీ గా మారింది. తాజాగా ఆమె మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే ఇటీవలె సీమా, సచిన్ ల మధ్య గొడవలు అవుతున్నాయని వార్తలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే సీమా హైదర్ ముఖంపై గాయాలతో తన ఉన్న ఓ వీడియో వైరల్‌గా మారింది. సీమా హైదర్ ను తన భర్త సచిన్ చిత్ర హింసలు పెడుతున్నారనీ, వారి మధ్య గొడవలు అవుతున్నాయని, తరుచూ కొడుతున్నాడని చెప్పుతున్న ఓ వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఆమె కన్ను, పెదాలకు, మొఖంపై గాయాలను చూపిస్తోంది.
'డీఫ్ ఫేక్ వీడియో'
సీమా హైదర్ తరఫు న్యాయవాది ఏపీ సింగ్ మాట్లాడుతూ.. ఇది ఫేక్ వీడియో అని సీమా హైదర్ అన్నారు. ఇది పాకిస్థాన్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి తయారు చేయబడిందని తెలిపారు. సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానెల్‌లలో వైరల్ గా మారిన వీడియో పూర్తిగా ఫేక్ అనీ, ఈ వార్తలు తప్పుదారి పట్టించేవనీ తెలిపారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో తప్పుగా ప్రదర్శిస్తున్న తీరు, పాకిస్థాన్‌కు చెందిన కొన్ని సోకాల్డ్ ఛానెల్‌లు, యూట్యూబర్‌లు ఇందులో ఉన్నాయని లాయర్ ఏపీ సింగ్ చెప్పారు.
సీమా, సచిన్‌ల మధ్య ఎలాంటి గొడవలు లేవు. వారి మధ్య అపారమైన ప్రేమ ఉందనీ, గొడవలకు అవకాశం లేదని తెలిపారు.ఈ వీడియోల ద్వారా సచిన్, సీమా హైదర్ మధ్య సంబంధాన్ని చెడగొట్టే ప్రయత్నం జరుగుతోందని తెలిపారు. వైరల్ వీడియో ఫేక్ అని సీమా హైదర్‌తో సంభాషణ ఆధారంగా స్థానిక పోలీసులు కూడా తెలిపారు. తనపై దాడి జరగలేదని సీమా హైదర్ పోలీసులకు తెలిపారు.
డీప్ ఫేక్ అంటే ఏమిటీ?
డీప్‌ఫేక్ అనేది మల్టీమీడియా కంటెంట్. అందులో ఒక వ్యక్తి ముఖాన్ని లేదా బాడీని మరో వ్యక్తిగా చూపిస్తుంది. 2014లో దీన్ని సింథటిక్ మీడియాగా పిలుచుకునేవారు. 2017లో రెడ్డిట్ యూజర్ ఇలాంటి వీడియోలను చేసి డీప్‌ఫేక్ పేరుతో ప్లేలిస్టులో అప్‌లోడ్ చేశాడు. అప్పటి నుంచి డీప్‌ఫేక్ అనే పేరు స్థిరపడింది. తొలుత డీప్ ఫేక్ హాస్యభరిత వీడియోలకే ఉపయోగించారు. మలయాళం, మమ్మూట్టి, ఫాహద్ ఫాజిల్‌లను గాడ్ ఫాదర్ సినిమాలో పాత్రలకు పెట్టారు. ఈ వీడియో ఇన్‌స్టాలో వైరల్ అయింది. మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అయితే.. ఈ వీడియోలను గుర్తించగలిగేలా ఉన్నాయి. కానీ, జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ వీడియోలను మరింత మెరుగుపరిచాయి. నకిలీ వీడియోను గుర్తించడం కష్టంగా మారింది.