భారత్ బయోటెక్ గుడ్‌న్యూస్: జూలైలో హ్యుమన్ క్లినికల్ ట్రయల్స్
కరోనా నివారణకు ఇప్పటికే రెండు కంపెనీలు డ్రగ్స్ తయారు చేశాయి. హైద్రాబాద్ కు చెందిన మరో సంస్థ కరోనా రాకుండా నిరోధించే వ్యాక్సిన్ తయారీలో మరో ముందడుగు వేసింది.
హైదరాబాద్: కరోనా నివారణకు ఇప్పటికే రెండు కంపెనీలు డ్రగ్స్ తయారు చేశాయి. హైద్రాబాద్ కు చెందిన మరో సంస్థ కరోనా రాకుండా నిరోధించే వ్యాక్సిన్ తయారీలో మరో ముందడుగు వేసింది. జూలైలో దేశంలో ఈ వ్యాక్సిన్ హ్యుమన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆప్ ఇండియా అనుమతి ఇచ్చింది.
హైద్రాబాద్ కు చెందిన హెటిరో సంస్థ కోవిఫర్ పేరుతో ఇంజక్షన్ ను తయారు చేసింది. గ్లెన్ మార్క్ అనే కంపెనీ కరోనా రోగుల కోసం టాబెట్లను మార్కెట్లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా హైద్రాబాద్ కు చెందిన మరో పార్మాసూటికల్స్ సంస్థ భారత్ బయోటెక్ కరోనా నివారణకు వ్యాక్సిన్ తయారీలో మరో ముందడుగు వేసింది.
also read:కరోనాకు మందు కనిపెట్టిన హైద్రాబాద్ హెటిరో: కోవిఫోర్ పేరుతో మార్కెట్లోకి విడుదల
కో వ్యాక్సిన్, ఫేజ్-1 ఫేజ్-2 పరీక్షలకు ప్రభుత్వం నుండి అనుమతులను సాధించింది. ఈ మేరకు ఈ ఏడాది జూలై మాసంలో ఈ డ్రగ్ ను మనుషులపై ప్రయోగించనుంది. ఈ మేరకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) నుండి అనుమతిని సాధించింది.
కరోనా వైరస్ ను నియంత్రించేందుకు గాను ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సహకారంతో ఈ సంస్థ ఈ వ్యాక్సిన్ తయారీలో ప్రయోగాలు చేస్తోంది. ఈ టీకాను అభివృద్ధి చేయడంలో ఐసీఎంఆర్, ఎణ్ఐవీ సహకారం ఎంతో ఉందని భారత్ బయోటెక్ ఛైర్మెన్ , మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ఎల్లా ప్రకటించారు.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా నివారణకు వ్యాక్సిన్ తయారీలో పలు సంస్థలు తమ వంతు పరిశోధనలు చేస్తున్నాయి. ఇందులో ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీకి శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోదనలు కీలక దశకు చేరుకొన్నాయి. చింపాంజీలపై చేసిన ప్రయోగాలు సక్సెస్ అయ్యాయి. ఇక మనుషులపై ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ను ప్రారంభిస్తోంది ఆ సంస్థ.