స్కూల్ లో టెన్త్ విద్యార్థినీపై గ్యాంగ్ రేప్, ఆపై మర్డర్.. ప్రిన్సిపాల్ తో సహా ముగ్గురిపై కేసు..
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో దారుణం జరిగింది. 10వ తరగతి విద్యార్థినిపై స్కూల్ మేనేజర్, స్పోర్ట్స్ టీచర్ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం పాఠశాల భవనం మూడో అంతస్తు నుంచి తోసివేశారు.
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో దారుణం జరిగింది. 10వ తరగతి విద్యార్థినిపై స్కూల్ మేనేజర్, స్పోర్ట్స్ టీచర్ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం పాఠశాల భవనం మూడో అంతస్తు నుంచి తోసివేశారు. దీంతో ఆ బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. ఈ మేరకు పోలీసులు సమాచారం అందించారు. శనివారం మధ్యాహ్నం భారీ పోలీసు బలగాల సమక్షంలో బాలిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, పోస్టుమార్టం అనంతరం మృతదేహానికి భారీ పోలీసు బలగాల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు. చనిపోయిన కుమార్తెకు ఆమె తండ్రి అంత్యక్రియలు నిర్వహించారు.
కేసు వివరాలిలా ఉన్నాయి.. అయోధ్యలో సీబీఎస్‌ఈ బోర్డుకు అనుబంధంగా ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాలలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఊయల నుంచి పడి 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని మృతి చెందిందని స్కూల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. అయితే సీసీటీవీ ఫుటేజీలో పాఠశాల భవనంపై అంతస్తు నుంచి బాలిక పడిపోయినట్లు పోలీసులు గుర్తించారు.
15 ఏళ్ల బాలిక తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వేసవి సెలవుల కోసం పాఠశాల మూసివేయబడిన తర్వాత కూడా ప్రధానోపాధ్యాయుడు రష్మీ భాటియా తన కుతూరుని పాఠశాలకు పిలిచారని, ఉదయం 9.50 గంటలకు ప్రిన్సిపాల్ తనకు ఫోన్ చేశారనీ, తన కుతూరు ఊయల నుండి పడిపోవడంతో తీవ్ర గాయాలు అయ్యాయని తెలిపారు. తాను పాఠశాలకు చేరుకున్నప్పుడు.. తన బిడ్డను ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారనీ, ఆమె శరీరంపై గాయాలు, ఇతర గుర్తులు ఉన్నాయని, ఉయల నుంచి పడిపోయడం వల్ల ఇలాంటి ఘోరం జరగదని, కావాలనే తన బిడ్డను హత్య చేశారని ఆరోపించారు.
అయితే.. పోలీసుల కథనం ప్రకారం.. పదో తరగతి విద్యార్థిని పాఠశాల చేరుకున్న తరువాత పాఠశాల మేనేజర్ బ్రిజేష్ యాదవ్, స్పోర్ట్స్ టీచర్ అభిషేక్ కన్నౌజియా ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారనీ, ఈ విషయం వెలుగులోకి రాకుండా.. ఆ చిన్నారిని పాఠశాల పై అంతస్తు నుంచి తోసేశారు. ఈ ఘటనలో స్కూల్ మేనేజర్ బ్రిజేష్ యాదవ్, ప్రధానోపాధ్యాయుడు రష్మీ భాటియా, స్పోర్ట్స్ టీచర్ అభిషేక్ కన్నౌజియాపై ఐపీసీ సెక్షన్లు 376డి (గ్యాంగ్ రేప్), 302 (హత్య), 201 (నేరానికి సంబంధించిన ఆధారాలు అదృశ్యం కావడం) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. బాలిక మైనర్ కావడంతో పాస్కో కింద కూడా కేసు నమోదు చేశారు.
ఈ ఘటనకు సంబంధించి పాఠశాల యాజమాన్యం కుటుంబ సభ్యులను, పోలీసులను వేర్వేరుగా, తప్పుడు వాంగ్మూలాలు ఇచ్చి మోసం చేసిందని, రక్తపు ఆనవాళ్లు ఉన్న ప్రాంతాన్ని శుభ్రం చేశారనీ పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. దానికి సంబంధించిన ఇతర ఆధారాలను కూడా ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు.
అయోధ్య పోలీసు సూపరింటెండెంట్ (నగరం) మధుబన్ సింగ్ మాట్లాడుతూ.. "అమ్మాయి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు శనివారం మధ్యాహ్నం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, స్కూల్ మేనేజర్, స్పోర్ట్స్ టీచర్‌పై మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం కేసు నమోదు చేయబడింది. ఈ విషయమై విచారణ జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. పోస్ట్‌మార్టం నివేదిక అత్యాచారాన్ని నిర్ధారించిందా అని అడిగిన ప్రశ్నకు.. మధుబన్ సింగ్ మాట్లాడుతూ.. "మాకు చేరిన పోస్ట్‌మార్టం నివేదిక కాపీ చదవడం లేదు . మేము నివేదికను చదవడానికి ప్రయత్నిస్తున్నాము. అధికారిక పోస్ట్‌మార్టం నివేదిక ఇంకా అందలేదు తెలిపారు. మరోవైపు సోషల్ మీడియాలో నెటిజన్లు.. నిందితులను అరెస్టు చేసి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఇప్పటి వరకు నిందితుల్లో ఎవరినీ పోలీసులు అరెస్టు చేయలేదు.