Asianet News TeluguAsianet News Telugu

Indian democracy: ఐదేండ్ల‌లో పార్టీలు మారిన 60 శాతం ఎమ్మెల్యేలు !

Indian democracy: దేశంలో ప్ర‌జాస్వామ్య విలువ‌లు ప‌డిపోతున్నాయ‌ని ఇప్ప‌టికే ప‌లు అంత‌ర్జాతీయ నివేదిక‌లు పేర్కొన్నాయి. దీనికి కార‌ణాల్లో ప్ర‌జాప్ర‌తినిధులుగా ఎన్నికైన త‌ర్వాత చాలా మంది నేత‌లు ఇత‌ర పార్టీల్లోకి జంప్ కావ‌డం కూడా ఒక‌ట‌ని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, గోవాలో గ‌త ఐదేండ్ల‌లో ఏకంగా 60 శాతం ఎమ్మెల్యేలు పార్టీలు మారార‌ని ఏడీఆర్ నివేదిక పేర్కొంది. ఓటర్ల నిర్ణయాన్ని స్పష్టంగా అగౌరపర్చారని తెలిపింది. 

60 per cent Goa MLAs switched parties in last five years, 'record' in India: ADR report
Author
Hyderabad, First Published Jan 23, 2022, 3:01 AM IST

Indian democracy: దేశంలో ప్ర‌జాస్వామ్య విలువ‌లు ప‌డిపోతున్నాయ‌ని ఇప్ప‌టికే ప‌లు అంత‌ర్జాతీయ నివేదిక‌లు పేర్కొన్నాయి. దీనికి కార‌ణాల్లో ప్ర‌జాప్ర‌తినిధులుగా ఎన్నికైన త‌ర్వాత చాలా మంది నేత‌లు ఇత‌ర పార్టీల్లోకి జంప్ కావ‌డం కూడా ఒక‌ట‌ని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, గోవాలో గ‌త ఐదేండ్ల‌లో ఏకంగా 60 శాతం ఎమ్మెల్యేలు పార్టీలు మారార‌ని ఏడీఆర్ నివేదిక పేర్కొంది. మొత్తం 40 మంది సభ్యుల రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం బలంలో 60 శాతం ఉన్న గోవాలో 24 మంది శాసనసభ్యులు గత ఐదేళ్లలో పార్టీ మారారని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తన నివేదికలో పేర్కొంది. దీంతో భారత ప్రజాస్వామ్య చరిత్రలో కొత్త‌ రికార్డును గోవా నెలకొల్పిందని ఏడీఆర్ తెలిపింది. 

"ప్రస్తుత గోవా అసెంబ్లీ ఐదేళ్ల కాలంలో (2017-2022), 24 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలు మారారు, ఇది సభ మొత్తం బలంలో 60 శాతం. ఇది భారతదేశంలో మరెక్కడా జరగలేదు. ఓట‌ర్ల తీర్పును స్ప‌ష్టంగా నాయ‌కులు తుంగ‌లో తొక్కుతూ ఓట‌ర్ల‌ను అగౌర‌వప‌రుస్తున్నారు" అని ఏడీఆర్ నివేదిక పేర్కొంది. అయితే, 24 మంది ఎమ్మెల్యేల జాబితాలో 2017లో కాంగ్రెస్ ఎమ్మెల్యే ప‌ద‌వుల‌కు రాజీనామా చేసి, అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరిన విశ్వజిత్ రాణే, సుభాష్ శిరోద్కర్, దయానంద్ సోప్టే పేర్లు లేవని పేర్కొంది.

కాంగ్రెస్ నుంచి ఎన్నిక‌ల బ‌రిలో నిలిచి గెలిచిన వారిలో 2019లో పది మంది కాంగ్రెస్ శాసనసభ్యులు బీజేపీలో చేరారు. వీరిలో అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రకాంత్ కవ్లేకర్ (క్యూపెం నియోజకవర్గం) కూడా ఉన్నారు. బీజేపీలోకి దూకిన ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు - జెన్నిఫర్ మోన్సెరేట్ (తాలిగావ్), ఫ్రాన్సిస్కో సిల్వేరియా (సెయింట్ ఆండ్రీ), ఫిలిప్ నెరీ రోడ్రిగ్స్ (వెలిమ్), విల్‌ఫ్రెడ్ నజరెత్ మెనినో డి'సా (నువెం), క్లాఫాసియో డయాస్ (కుంకోలిమ్), ఆంటోనియో కారనో ఫెర్నాండెజ్ (సెయింట్ క్రూజ్), నీల్ కాంత్‌ హలర్ంకర్ (టివిమ్), ఇసిడోర్ ఫెర్నాండెజ్ (కాంకోనా), అటానాసియో మోన్సెరేట్ (మనోహర్ పారికర్ మరణం తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో పనాజీలో గెలుపొందారు)లు ఉన్నారు. 

ఇదే స‌మ‌యంలో మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (ఎంజీపీ) ఎమ్మెల్యేలు దీపక్ పౌస్కర్ (సంవోర్డెం), మనోహర్ అజ్‌గావ్‌కర్ (పెర్నెం)లు కూడా బీజేపీ కండువా క‌ప్పుకున్నారు. సాలిగావ్‌కు చెందిన గోవా ఫార్వర్డ్ పార్టీ (జిఎఫ్‌పి)కి చెందిన జయేష్ సల్గోంకర్ కూడా క‌మ‌లం గూటికి చేరారు. గోవా మాజీ ముఖ్యమంత్రి, పోండా నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన రవి నాయక్ సైతం ఇటీవ‌ల అధికార కాషాయ పార్టీలో చేరారు. అలాగే, గోవా రాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి, కాంగ్రెస్ నాయ‌కుడు లూయిజిన్హో ఫలేరో (నవేలిమ్).. మొద‌టిసారి గోవా ఎన్నిక‌ల బ‌రిలో నిలుస్తున్న తృణ‌మూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో చేరారు. 2017లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) టికెట్‌పై గెలిచిన మాజీ సిఎం చర్చిల్ అలెమావో కూడా ఇటీవల టీఎంసీలో చేరారు. ఆయ‌న‌తో పాటు కర్టోరిమ్ నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన అలెక్సో రెజినాల్డో లౌరెన్కో సైతం టీఎంసీ కండువా క‌ప్పుకున్నారు. 

2019లో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన మరో ఎమ్మెల్యే విల్‌ఫ్రెడ్ డిసా అధికార పార్టీకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మ‌రో నేత దీపక్ పౌస్కర్ కూడా బీజేపీని వీడారు. స్వతంత్ర ఎమ్మెల్యేలు రోహన్ ఖౌంటే (పోర్వోరిమ్), గోవింద్ గౌడే (ప్రియోల్)లు బీజేపీలో చేర‌గా, మరో స్వతంత్ర శాసనసభ్యుడు ప్రసాద్ గాంకర్ కాంగ్రెస్‌లో చేరారు. పార్టీలు ఫిరాయింపుల త‌ర్వాత స‌భ‌లో కాంగ్రెస్ బ‌లం రెండుకు చేర‌గా, బీజేపీ బ‌లం 27కు పెరిగింది. అయితే, ఈ సారి తృణ‌మూల్ గోవా ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని AAP దూకుడుగా ముందుకు సాగుతున్న ప‌రిస్థితులు గ‌మ‌నిస్తే.. ఈ సారి ఎన్నిక‌ల యుద్ధం బ‌హుముఖ పోరుగా మారిందిని స్ప‌ష్టం తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios