Madhave Madhusudana : ‘మాధవే మధుసూదన’ మూవీ రివ్యూ.!
బ్యూటీఫుల్ లవ్ స్టోరీని చూపించేందుకు ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘మాధవే మధుసూదన’ (Madhave Madhusudana). ఈ చిత్రం ఎలా ఉందనేది రివ్యూ లో తెలుసుకుందాం..
యూత్ తోపాటు ఇతర వర్గాల ప్రేక్షకుల నుంచి ప్రేమ కథా చిత్రాలకు ఎల్లప్పుడూ మంచి ఆదరణ దక్కుతుంటుంది. ప్రస్తుతం వస్తున్న చిత్రాలన్నీంటిలోనూ ప్రేమ కథ కచ్చితంగా ఉంటుందనే విషయం తెలిసిందే. ఇక పూర్తిగా ప్రేమ నేపథ్యంలోనే వచ్చిన చిత్రమే ‘మాధవే మధుసూదన’. తేజ్ బొమ్మదేవర హీరోగా పరిచయమవుతూ వచ్చిన ఈ చిత్రంలో రిషికి లొక్రే హీరోయిన్గా నటించారు. సాయి రత్న క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తూ దర్శకత్వం వహించారు బొమ్మదేవర రామచంద్ర రావు. ఈరోజు (నవంబర్ 24న) ఈ ప్రేమకథా చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇంతకీ సినిమాల ఎలా ఉంది? కథేంటీ? అనే విషయాలు సమీక్షలో చూద్దాం.
కథ :
ముగ్గురు స్నేహితులు మాధవ్ (తేజ్ బొమ్మదేవర), రవి (జోష్ రవి), శివ (శివ) ఎలాంటి లక్ష్యం అంటూ లేకుండా రోజూ కలిసి తిరుగుతుంటారు. జాలీగా లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంటాడు. గాలికి తిరుగుతున్న కొడుకు మాధవ్ ను చూసి తల్లిదండ్రులు బాధపడుతుంటారు. ఆఫీస్ బాధ్యతలు చూసుకోమని మాధవ్‌ను బెంగళూరు వెళ్లమని చెబుతుంది తల్లి (ప్రియ). తండ్రి (జయ ప్రకాష్) కూడా అదే సలహాగా ఇస్తాడు. దాంతో బెంగళూరుకు బయల్దేరుతాడు. కానీ మాధవ్ వైజాగ్ ట్రైన్ ఎక్కి అరుకు చేరుతాడు. మార్గమధ్యంలో ఓ రైల్వే స్టేషన్లో అమ్మాయి (రిషికి లొక్రే)ని చూస్తాడు. కానీ ఆమె ఎవరికీ కనిపించదు. కేవలం మాధవకే కనిపిస్తుంది? బెంగళూరు వెళ్లేవాడు అరుకు ఎందుకు వెళ్లాడు? ఆమె అలా అతకే ఎందుకు కనిపిస్తుంది? ఆమెకు మాధవ్ కు ఉన్న సంబంధం ఏంటి? ఆ అమ్మాయి వెనకాల ఎందుకు వెళ్తాడు? తర్వాత ఏం జరిగిందనేది మిగితా కథ.
విశ్లేషణ :
టైటిల్ ను చూస్తేనే దర్శకుడు చాలా నీట్ సినిమాను అందించాలని ప్రయత్నించారనేది అర్థం అవుతుంది. మాధవే మధుసూదన అనే టైటిల్లో ఎంత పాజిటివిటీ ఉందో సినిమాలోనూ అంతే పాజిటివిటీ ఉంది. ఎక్కడా వల్గారిటీని చూపించలేదు. తనకేం కావాలో అది మాత్రమే తీశాడు దర్శకుడు. ఆ విషయంలో డైరెక్టర్‌ను మెచ్చుకోవాల్సిందే. కథ, కథనాలు ఎలా ఉన్నా కూడా వాటి నుంచి గాడి తప్పకుండా చూసుకున్నాడు. అయితే చూపించే సన్నివేశాలను అంత ఎఫెక్టివ్ గా చూపిస్తే బాగుండేది. చిన్న సినిమా అయినా సరైనా స్క్రిన్ ప్లే ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారనేది తెలిసిందే. ఆవిషయంలో దర్శకుడు కాస్తా వర్క్ చేస్తే బాగుండేది. ప్రేమ అంటే సమస్యలు, సంఘర్షణలు కామన్. కానీ ఆ సమస్యలు, సంఘర్షణలు ఎవరితో.. ఎవరి మధ్య అన్నదే ఇంపార్టెంట్. అక్కడే సినిమా సినిమాకు తేడా ఉంటుంది. అన్ని చిత్రాల్లో ప్రేమ ఉన్నా కూడా.. అన్ని ప్రేమ కథలు ఒకేలా ఉండవు. కానీ ఈ చిత్రం కథ కూడా రోటీన్ గానే అనిపిస్తుంది. ప్రథమార్దం కాస్త జాలీగా సాగుతుంది. ఎక్కడా బోర్ కొట్టించకుండా నడిపించినట్టు అనిపిస్తుంది. కానీ సెకండాఫ్ మాత్రం కొంచెం నీరసంగా, నిదానంగా సాగినట్టు కనిపిస్తుంది. సెకండాఫ్ కాస్త తగ్గించినా బాగుండేది. నిడివి సమస్య కూడా అక్కడే వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఈ సినిమాలో విలన్ అంటూ ప్రత్యేకంగా ఉండడు. విధి విలన్‌గా కనిపిస్తుంది. ఇది కొత్త అంశంగా కనిపిస్తుంది. ఇక ప్రేయసికి ఇచ్చిన మాట కోసం ప్రియుడు ఏం చేశాడు? ఏం చేయగలడు.. ప్రియుడు లేకుండా ప్రేయసి ఎలా ఉంటుంది? అనేది చక్కగా చూపించారు. పాటలు వినడానికి, చూడటానికి బాగున్నాయి. మాటలు కొన్ని చోట్ల గుండెల్ని తాకేలా ఉన్నాయి. హీరో తేజ్ డాన్స్, ఫైట్స్ చేయటంలొ చాలా కష్ట పడ్డాడు. విజువల్స్ సినిమాకు తగట్టుగానే ఉన్నాయి. నిర్మాణ విలువలూ అదే స్థాయిలో ఉన్నాయి.
నటీనటులు :
హీరోగా నటించిన తేజ్ బొమ్మదేవరకు ఇది మొదటి సినిమా. అయినా ఎక్కడా ఆ తేడాను చూపించలేదు. రెండు బాధ్యతలు తీసుకోవడంతో కాస్తా పర్ఫెక్షన్ పోయినట్టు అనిపిస్తుంది. అయినా నేచురల్‌గా నటించినట్టు అనిపిస్తుంది. ప్రేమికుడిగా, జాలీగా తిరిగే యువకుడిగా, పక్కింటి అబ్బాయిలా కనిపించి మెప్పించాడు. డ్యాన్సులు, డైలాగ్ డెలివరీలో మంచి నటనను కనబర్చాడు. ఇక హీరోయిన్గా కనిపించిన రిషికి అందరినీ ఆకట్టుకుంటుంది. తెరపై చలాకీగా కనిపించింది. అందంగానూ కనిపించింది. హీరోయిన్ తండ్రిగా కనిపించిన బొమ్మదేవర రామచంద్ర రావు ఎమోషనల్ సీన్లతో ఏడిపిస్తాడు. ఫ్రెండ్స్ పాత్రలు నవ్విస్తాయి.
Rating-2.5