హన్సిక `105 మినిట్స్` మూవీ రివ్యూ, రేటింగ్..
హన్సిక నటించిన `105 మినిట్స్` మూవీ నేడు విడుదలైంది. సింగిల్ షాట్‌లో రూపొందిన ప్రయోగాత్మక చిత్రమిది. మరి ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యిందా అనేది రివ్యూలో తెలుసుకుందాం.
హన్సిక ఒకప్పుడు గ్లామర్ బ్యూటీ. కానీ ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తుంది. అందులో భాగంగా ఇప్పుడు ఆమె `105 మినిట్స్` అనే సినిమాతో వచ్చింది. ఇది సింగిల్ షాట్ మూవీ కావడం విశేషం. ఒకే పాత్ర ప్రధానంగా నడిచే కథ. ఇదొక ప్రయోగాత్మక మూవీ అని చెప్పాలి. చాలా సాహసంతో ఈ సినిమాని తెరకెక్కించారు. రాజు దుస్సా దర్శకత్వం వహించారు. బొమ్మక శివ నిర్మించిన ఈ చిత్రం నేడు(జనవరి 26) విడుదలైంది. మరి ఈ ప్రయోగం ఫలించిందా? సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో తెలుసుకుందాం.
కథః
జాను(హన్సిక) పాత్ర చుట్టూత సాగే కథ. ఇందులో మరే పాత్ర ఉండదు. జాను బయట నుంచి ఇంటికి వస్తుంది. ఇంట్లోకి రాగానే ఏదో శక్తి తనని గొలుసుతో బంధిస్తుంది. కట్ చేస్తే ఆమె పిల్లర్‌కి ఇనుప గొలుసుతో బంధించబడి ఉంటుంది. అంతా అయోమయం ఏం జరుగుతుందో అర్థం కాదు, ఎవరు చేశారో తెలియదు. కొన్ని భయానక శబ్దాలు వస్తుంటాయి. జాను అంటూ భయపెట్టే మేల్ వాయిస్ వినిపిస్తుంటుంది. ఆ శక్తి ఎవరు? ఎందుకు చేస్తున్నారో తెలియదు. అనేక కష్టాలు పడి ఆ పిల్లర్ నుంచి విడిపించుకుంటుంది. కానీ గొలుసు మాత్రం పోదు. ఎంత ప్రయత్నించినా లాభం లేదు, పైగా తనకే దెబ్బలు తగులుతుంటాయి. ఇనుప సువ్వలు గుచ్చుకుని కాలుకి గాయమవుతుంది. ఇంట్లో నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి, డోర్ లాక్ అయిపోతుంది. మేల్ వాయిస్ మధ్య మధ్యలో తన మరణానికి నువ్వే కారణమని, అందుకే ఇదంతా అనుభవించాలంటూ వినిపిస్తుంది. దీంతో మరింతగా భయపడుతుంది జాను. మరి దాన్నుంచి బయటపడిందా? జాను ఏం చేసింది? ఆ మేల్ వాయిస్ ఎవరు? చివరికి ఏం జరిగిందనేది మిగిలిన సినిమా.
విశ్లేషణః
సింగిల్ షాట్ తో సినిమా తీయడం, అది కూడా రెండు గంటలు గ్యాప్ లేకుండా తీయడమంటే మామూలు విషయం కాదు, పెద్ద సాహసం, ఇదొక పెద్ద ప్రయోగం. ఇలాంటి ఆలోచన వచ్చిన మేకర్స్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఈ సినిమా చేసిన హీరోయిన్ హన్సిక అభినందించాలి. ఇలాంటి సినిమాని నిర్మించాలంటే చాలా గట్స్ కావాలి. నిర్మాతలకు ఆ డేర్ ఉందని అర్థమవుతుంది. వారి అభిరుచి తెలుస్తుంది. అయితే ఇలాంటి సినిమాని కన్విన్సింగ్‌గా, ఆడియెన్స్ ని ఎంగేజ్ చేసేలా చేయడం పెద్ద సాహసం. ఆ విషయంలో `105 మినిట్స్` మూవీ డైరెక్టర్ రాజు దుస్సాని అభినందించాల్సిందే. ఆయన పడ్డ కష్టం ఏంటో ఈ మూవీలో కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాకి కెమెరా వర్క్ ప్రధానం. కిషోర్ బీ కెమెరామెన్ గా అదరగొట్టాడు. చాలా మ్యాజికల్‌గా మూవీని షూట్ చేశాడు.
ఈ సినిమా మొత్తం ఒక ఇంట్లోనే సాగుతుంది. గుర్తుతెలియని శక్తి హీరోయిన్ హన్సికని బంధించి భయపెడుతుంది. బయటకు వెళ్లనివ్వదు, ఇంట్లో ఉండనివ్వదు, ఇలాంటి పరిస్థితులో అందులో ఉండటం పెద్ద టాస్క్. చాలా భయంతో కూడినది. ప్రాణాలతో పోరాటమే. అదే సమయంలో సినిమా ఎంగేజింగ్‌గా సాగాలి, ఆడియెన్స్ దృష్టి పక్కకు వెళ్లకుండా తీయాలి. ఈ మేకర్స్ ఆ విషయంలో చాలా శ్రమించారని తెలుస్తుంది. దీనికితోడు బీజీఎం బాగా వర్కౌట్ అయ్యింది. ఆడియెన్స్ లోనూ ఆ ఉత్కంఠని, భయాన్ని సస్టెయిన్ చేస్తూ సినిమాని కొనసాగించడంలో వాళ్లు సక్సెస్ అయ్యారు. అయితే సినిమా మొత్తం హీరోయిన్ హన్సిక ఏడుస్తూనే ఉంటుంది? ఆమె నుంచి అదే సౌండ్ పదే పదే వస్తుంది. అది వినివిని బోర్ కొడుతుంది. సినిమాలో ఎంత సేపు ఆమె ఎలా బయటపడాలి అనేది చూపించారు, ఎలా ఎదుర్కోవాలనేది సరిగా చూపించలేకపోయారు. లైఫ్ రిస్క్ లో ఉంది, ఇక ప్రాణాలతో పోరాటం అన్నప్పుడు ఏం చేయాలని, ఏం చేస్తే బాగుంటుందో చూపిస్తే బాగుండేది.
చివర్లో క్లైమాక్స్ చూపించిన విధానం కూడా కన్విన్సింగ్‌గా లేదు. తేలిపోయినట్టు ఉంది. అక్కడ మరింత ఇంట్రెస్టింగ్‌గా, ట్విస్ట్ లు పెడితే అదిరిపోయేది. కానీ ఫినిషింగ్ మాత్రం వాహ్ అనిపించింది. అయితే హన్సిక ఇంట్లో ఎందుకు ఇరుక్కుంది, ఇంట్లో ఉన్న శక్తి ఉద్దేశ్యం ఏంటి? ఏం చెప్పదలుచుకున్నారనేది క్లారిటీ లేదు. ఆ విషయాల్లో క్లారిటీ ఉంటే, ఏదైనా బలమైన అంశాలను చెబితే బాగుండేది. కానీ ఎంత సేపు ఒక పాత్ర రెండు గంటలు ఎలా ఎంగేజ్ చేసింది, ఎంత స్ట్రగుల్ అయ్యింది మాత్రమే చూపించారు. ఇంకా సమ్‌థింగ్ అనే అంశాలు ఉంటే మరింత ఇంట్రెస్టింగ్‌గా ఉండేదేమో. అయితే సింగిల్ షాట్ మూవీలో కొత్తగా చేయడానికి కూడా ఉండదు. చాలా పెద్ద రిస్క్ తో కూడిన మ్యాటర్. ఆ పాత్ర కాకుండా మరే ఇతర ఎలిమెంట్లు వచ్చినా, పాత్రలు వచ్చినా సింగిల్ షాట్ అనేదానికి అర్థం లేదు. ఇలాంటి సవాళ్ల మధ్య వచ్చిన `105 మినిట్స్` మూవీ ఓవరాల్‌గా మంచి ప్రయత్నం అని చెప్పొచ్చు.
నటీనటులు, టెక్నీషియన్లుః
జాను పాత్రలో హన్సిక బాగా చేసింది. ఇలాంటి పాత్రలు చేయాలంటే మామూలు కాదు. అసలు ఏమీ ఉండదు, కానీ ఏదో ఉన్నట్టు ఊహించుకుని ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వడం పెద్ద ఛాలెంజ్, హన్సిక ఆ విషయంలో బాగా చేసింది. తన బెస్ట్ ఇచ్చింది. ఎక్స్ ప్రెషన్స్ కూడా బాగున్నాయి. ఇక టెక్నీకల్‌గా దర్శకుడు ఒక సహసం చేశాడు. సక్సెస్ ఫెయిల్యూర్ అనేది పక్కన పెడితే అతని ఆలోచనని అభినందించాలి. దాన్ని ఎగ్జిక్యూషన్‌లో పెట్టడం మరో పెద్ద సవాల్. సినిమా తీయడం పెద్ద ఛాలెంజ్. అవన్నీ దాటుకుని థియేటర్ వద్దకి సినిమాని తీసుకురావడం విశేషం. ఇక సామ్ సీఎం మ్యూజిక్ ఓకే, బీజీఎం కొంత వరకు ఆకట్టుకుంది. కానీ సరిపోలేదు. కిషోర్ బీ కెమెరా వర్క్ బాగుంది. అతనే సినిమాకి హీరో. రాజు దుస్సా దర్శకత్వం ఫర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఖర్చు పెట్టడానికి కూడా పెద్దగా ఏం లేదు.
ఫైనల్‌గాః `105 మినిట్స్` మూవీ ఒక డిఫరెంట్ ప్రయోగం.
Read More: ధనుష్ `కెప్టెన్ మిల్లర్` మూవీ రివ్యూ, రేటింగ్..