యరకల యాదయ్య కవిత : వెలుగురేకలౌదాం

ఒకప్పుడు ప్రశ్నించిన గొంతులు  అధికార బలం ముందు పెదవి విప్పక  మూగబోయిన కలాల సిరా అక్షరాలు పిడికిల్లెత్తెదేప్పుడో ?   అంటూ  యరకల యాదయ్య రాసిన కవిత 'వెలుగురేకలౌదాం' ఇక్కడ చదవండి :        

Yerukala Yadaiahs poem - bsb - opk

నిజాలు సమూహాలకు  అధిపతులు
అణగారిన జనం బతుకులకు జీవనాధార దిక్సూచిలై
అమరమై బతకాలి బతికించాలి
అధర్మంగ గమ్యం చేరుకోవడానికి
ఎందరినో బలి చేస్తే ! 
ఒకప్పుడు ప్రశ్నించిన గొంతులు 
అధికార బలం ముందు పెదవి విప్పక 
మూగబోయిన కలాల సిరా అక్షరాలు
పిడికిల్లెత్తెదేప్పుడో ?

పంచభూతాలను విడి విడిగా చూస్తే
వాటికి ప్రాణమే కనిపించదు
అవి ఏకమై ప్రకృతికి ఊపిరిపోసే అంతర్భాగాలే
కంటి చూపుకు దేహాస్పర్శకు కనిపించే దైవాలు

ఎవ్వరికి వారమే సామాన్యులం
కలసిగట్టుగ నడిస్తే 
కార్యాచరణకు వెలుగు దివ్వెలం 
ప్రగతి రధ చక్రాలు పయనిస్తున్నప్పుడు
రాళ్లు రప్పలు అడ్డు తగలడం సహజమే
పెద్దవైతే పెగిలిద్దాం 
చిన్నచిన్నవైతే పక్కకు తొద్దాం

పాలు పారబోయడం కాదు
పాలు పంచుకుందాం
పెద్ద తరహ అంటే పెత్తనం కాదు
సాధించుకున్న స్వతంత్రాన్ని
రాసుకున్న రాజ్యాంగాన్నీ
నిజంవైపు నిలబెడదాం 
ఆలోచనల్ని కూడగడదాం
భావితరాలకు వెలుగురేకలౌదాం

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios