రంగినేని సుజాత మోహన్ రావు ఎడ్యుకేషనల్ & చారిటబుల్ ట్రస్ట్, సిరిసిల్ల వారు ఒక సంవత్సరం కవితకు మరో సంవత్సరం కథకు ' రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం' ఇస్తూ తమ వంతు సాహిత్య సేవ గత ఇరవై సంవత్సరాలుగా  చేస్తున్నారు.  
 
ఈ ప్రతిష్టాత్మక పురస్కారం 2020 సంవత్సరానికి గాను న్యాయ నిర్ణేతల మూల్యాంకనం మేరకు వెంకట్ శిద్ధారెడ్డి కథా సంపుటి 'పోల్ సర్కస్ ' ఎంపికైన విషయాన్ని చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు రంగినేని మోహన్ రావు, అవార్డు కమిటీ కన్వీనర్ మద్దికుంట లక్ష్మణ్ ఒక ప్రకటనలో తెలియజేశారు.

ఈ అవార్డు కింద పురస్కార గ్రహీతకు రూ. 20,116/- నగదు, జ్ఞాపిక, శాలువ మరియు పురస్కార పత్రం ట్రస్ట్ ఆవరణలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో అందజేస్తారు.