నేడు జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా కొల్లాపూర్ నుండి వేదార్థం మధుసూదన శర్మ  రాసిన కవిత "మహాత్మా" కవిత ఇక్కడ చదవండి.

గ్రామ స్వరాజ్యానికి
పచ్చ జెండా ఊపి
గ్రామాభివృద్ధితోనే దేశ ప్రగతి సాధ్యమన్నాడు
అదే తన అభిమతమన్నాడు

మనుష్యులంతా సమానమని
పరస్పర సహకారంతో మెలగాలన్నాడు
గ్రామాలు స్వయం సమృద్ధి చెందాలన్నాడు
దేశ ప్రగతికి ఇవే సోపానాలన్నాడు

రైతు శ్రేయస్సును కాంక్షించి
రైతే దేశానికి వెన్నెముకని
పల్లెలు పచ్చని పంటలతో
కళకళలాడాలన్నాడు

కృత్రిమ ఎరువులు వద్దని
సేంద్రీయ ఎరువులు ముద్దని
పంటల ఉత్పత్తి పెరగాలన్నాడు
భూమికి బలము కావాలన్నాడు

గ్రామ స్వరాజ్యమే గాంధీ స్వప్నం
సహకార పద్దతే బాపూ ధ్యేయం
దేశ ఆర్థిక భద్రతే జాతిపిత లక్ష్యం