వసుంధర విజ్ఞాన వికాసమండలి కవితల పోటీ ఫలితాలు... విజేతల వీరేే...
పాఠశాల స్థాయిలోని విద్యార్థినీ విద్యార్థులకు తెలుగు సాహిత్యంపై మక్కువ పెంచే సదుద్దేశంతో వసుంధర విజ్ఞాన వికాసమండలి గత పది సంవత్సరాలుగా కవితల పోటీ నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఈ సంవత్సరం నిర్వహించిన కవితల పోటీ ఫలితాలు ఇక్కడ చదవండి :
వసుంధర విజ్ఞాన వికాస మండలి నిర్వహించిన కర్కముత్తారెడ్డి స్మారక రాష్ట్ర స్థాయి ద్వితీయ పాఠశాల విద్యార్థుల కవితల పోటీ ఫలితాలను సంస్థ వ్యవస్థాపకులు వి.మధుకర్ ప్రకటించారు. వారికి వచ్చిన మొత్తం కవితల నుంచి ఐదు ఉత్తమ కవితలను ఎంపిక చేస్తామని ప్రకటించినప్పటికీ విద్యార్థులను సృజనాత్మకంగా ప్రోత్సాహించాలనే ఉద్ధేశంతో మొత్తం తొమ్మిది కవితలను ఎంపిక చేశారు.
ఎంపికైన విద్యార్థిని / విద్యార్థుల వివరాలు :
1. జె.వైష్ణవి(టీఎంఆర్‌ఎస్ గర్ల్స్) బాలానగర్, నాగోల్.
2. చిన్మయి (విజయవాడ).
3. సి.హెచ్.సాయి (జెడ్పీహెచ్‌ఎస్) బొల్లారం, జిన్నారం.
4. సి.హెచ్.ప్రేరణ, విజయ హైస్కూల్, నిజామాబాద్.
5.అభిలాష్ శర్మ, విజయ హైస్కూల్, నిజామాబాద్.
6. సాయికీర్తన (జెడ్పీహెచ్‌ఎస్) మార్కాపురం, ప్రకాశం జిల్లా.
7. జె.రమ్య (టీఎంఆర్‌ఎస్ గర్ల్స్) బాలానగర్, నాగోల్.
8. కొలుపుల నందిని (జెడ్పీహెచ్‌ఎస్),దుగ్గొండి, వరంగల్.
9. పృధ్వీ (జెడ్పీహెచ్‌ఎస్) లక్ష్మీపురం.
విజేతలకు త్వరలో హైదరాబాద్‌లోని రవీంధ్ర భారతిలో జరిగే సభలో ప్రముఖుల చేతుల మీదుగా బహుమతి ప్రధానోత్సవం మరియు సన్మాన కార్యక్రమం ఉంటుందని వసుంధర విజ్ఞాన వికాసమండలి కన్వీనర్ సుమలత, అధ్యక్షులు చదువు వెంకటరెడ్డి , వర్కింగ్ ప్రెసిడెంట్ కట్కూరి శంకర్ ఒక ప్రకటనలో తెలిపారు.