వారాల ఆనంద్ “ఇరుగు పొరుగు” పుస్తకాన్ని ఆవిష్కరించిన కె. శివారెడ్డి

సుప్రసిధ్ధ కవి కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత  కె. శివారెడ్డి ఆదివారం సాయంత్రం హనుమాన్ నగర్ లోజరిగిన ఇంఫార్మల్ సమావేశంలో “ఇరుగుపొరుగు” అనువాద కవితా సంకలనాన్ని ఆవిష్కరించారు.

varala anand's Irugu Porugu Book Launch by k shiva reddy ksp

సుప్రసిధ్ధ కవి కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత  కె. శివారెడ్డి ఆదివారం సాయంత్రం హనుమాన్ నగర్ లోజరిగిన ఇంఫార్మల్ సమావేశంలో “ఇరుగుపొరుగు” అనువాద కవితా సంకలనాన్ని ఆవిష్కరించారు. కవి, సినీ విమర్శకుడు  కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత వారాల ఆనంద్ 29 భారతీయ భాషల్లోంచి 90 మంది సుప్రసిధ్ధ కవులు రచించిన 150 కవితల్ని అనువదించి ఇరుగుపొరుగు సంకలనం వెలువరించారు.

ఆవిష్కరణ సందర్భంగా కె.శివారెడ్డి మాట్లాడుతూ అనువాదం గొప్ప అనుసృజన అన్నారు. వివిధ భాషల కవిత్వాన్నిచదవడం వల్లనే కవి ఎదుగుతాడని ఆన్నారు. అందుకే తాను దశాబ్దాల క్రితమే ఆఫ్రికన్ కవిత్వాన్ని అనువదించానని చెప్పారు.  మూలాన్ని  గ్రహించి తర్జుమా చేసినప్పుడే కవిగా అనువాదకుడు పరిణితి సాధిస్తాడని అన్నారు. ఇరుగుపొరుగులో వివిధ భాషల్లోంచి చేసిన ఎంపిక గొప్పగా వుందన్నారు. వివిధ భాషల కవితల్ని ఒకే చోట చదివే అవకాశం ఈ సంకలనం ఇచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సుప్రసిధ్ధ కవి జూకంటి జగన్నాధం, నలిమెల భాస్కర్, గాజోజు నాగభూషణం, పీ.ఎస్. రవీంద్ర, దేశరాజు తదితరులు పాల్గొన్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios